అమానుషం….!!ఉద్యోగం కోసం వెళ్లిన భారతీయులను చితకబాధిన సౌధీ షేక్.! (Video)

చదువులేకపోయినా సరే  డోంట్ వర్రీ..లక్షల్లో జీతం, మీకు నచ్చిన రంగంలో  పని, అంటూ  మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులను  సౌధీకి పంపించారు మధ్యవర్తులు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గొడ్డుచాకిరీ కన్న ఘోరంగా ఉన్న పనులను చూసి మేం ఈ పని చేయడానికి ఇక్కడికి రాలేదని అన్నందుకు ఓనర్ చేత చావు దెబ్బలు తిన్నారు ఇండియాకు చెందిన ముగ్గురు యువకులు.. పూర్తి వివరాల ప్రకారం…..ఉత్తర కేరళలోని హరపాద్ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని. యెమెన్ కి(సౌదీ అరేబియా) తీసుకెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు లేవ్, ఏమీ లేవని.. చివరకు అక్కడ ఇటుకల బట్టీలలో పనిచేయమని బలవంతపెట్టారు.

మేం వచ్చింది ఈ పని చేయడానికి కాదని, ఆ యజమానితో ఆ ముగ్గురు మాట్లాడగ పెద్ద కర్రతీసుకొని ముగ్గురిని కర్కశంగా బాదడం మొదలుపెట్టాడు. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న ఆ ముగ్గురు అతడి చేతిలో దెబ్బలుతిన్నారు. అయితే అందులో ఒకతను తమని యజమాని కొడుతున్న వీడియోని తన మొబైల్ ద్వారా తీసి, తమ కుటుంబసభ్యులకు పంపి తమను రక్షించాల్సిందిగా తెలిపారు.

దీనిపై వేగంగా స్పందించిన కేరళ సిఎం  ఊమెన్ చాంది .సౌదీలోని ఇండియన్ ఎంబసీ మరియు కేరళ అధికారులను అలర్ట్ చేశారు, మరో రెండు రోజుల్లో  ఆ బాధితులు  మనదేశానికి తిరిగి వస్తారని హామీ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్ లో అందరినీ కదిలిస్తోంది. కాగా ఉత్తరకేరళలోని ఆ ప్రాంతం నుండి చాలామంది ఉద్యోగాల కోసం బ్రతుకు తెరువు కోసం అక్కడికి పేదరికం కారణంగా తిరిగి రాలేక ఉన్నవారు చాలా మందే ఉన్నారట.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top