శ్రీమంతుడు సినిమా తో స్పూర్తి పొందిన ముగ్గురు యువకులు… రియల్ స్టోరి.

సినిమా ఈ  మూడు అక్షరాల ఈ పదం… మానవ జీవితాల్లో మిళితమయ్యిందిప్పుడు. మూకీ చిత్రాల దగ్గర నుండి మోషన్ పిక్చర్స్ వరకు అన్ని పార్మాట్లను లిమిట్స్ లేకుండా  ఆదరిస్తూ వస్తున్నాం. మన మీద సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది మాత్రం నగ్న సత్యం.  ఇది ఇప్పుడు కొత్తేం కాదు..  ఎన్టీఆర్ ను చూసి ఇన్ప్సైర్ అయిన వారున్నారు…ఠాగూర్ చూసి చేంజ్ అయిన వారూ ఉన్నారు.

తాజాగా శుక్రవారం శ్రీమంతుడు సినిమాను చూసి ఇన్ప్సైర్  అవుతున్న వారి సంఖ్య కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. వాళ్ళలో ముగ్గురి గురించి  నేను విన్నాను.. ఇప్పుడు మీకు పరిచయం చేస్తా..!

3 GUYZ

  • 1)  హరీష్
  • 2) సింహాద్రి నాయుడు.
  • 3) నవనీత్.

వీరు ముగ్గురూ సాఫ్ట్ వేర్ జాబ్స్ చేసే వాళ్ళే.. అందులో  సింహాద్రి, నవనీత్  ఇద్దరు  ఒకే కంపెనీలో జాబ్ చేస్తుంటారు, హరీష్ మాత్రం మరో  సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ చేస్తున్నాడు.

ముగ్గురు హడావుడి గా .. హైద్రాబాద్ CBS బస్టాప్ లో  రాజమండ్రి బస్ కోసం…ఎదురు చూస్తున్నారు. వచ్చే బస్ ను , పోయే బస్ ను గమనిస్తూ రెండు రెండు బ్యాగ్ లతో ఫుల్ లగేజ్ తో  ఉన్నారు. నిమిషానికోసారి వాచ్ చూసుకుంటున్నారు. నేను వాళ్లతో కలిసిపోయా…. పరిచయ కార్యక్రమాలయిపోయాయ్.  మాటలు కలిశాయ్… అంతలో బస్ దొరికింది. బస్సెక్కి లగేజ్ సర్దుకొని…చివరి సీట్లో  ఫిక్స్ అయిపోయాం నలుగురం.

సింహాద్రీ, నవనీత్ శుక్రవారం మార్నింగే శ్రీమంతుడు సినిమా చూసి.. నైట్ వరకు బస్టాప్ కు వచ్చేశారు. శని, ఆది వారాలు సెలవులు కావడంతో ఇంటికెళ్లాలని.  సినిమా చూసిన వాళ్లు ఊరికే ఉంటారా.. మరో సారి స్టోరి స్టార్ట్ చేశారు, ఇంతలో హరీష్ వాళ్లకు జత కలిశాడు… నేను అదే రోజు సినిమా చూశా కదా  గమ్మున ఉండలేకపోయా నేనూ మాట కలిపా…!

మహేష్ బాబు గురించి, శ్రీమంతుడి స్టోరి గురించి చర్చలు నడుస్తున్నాయ్… నేనే ఉండబట్టలేక అడిగా..అయినా బ్రదర్ సినిమా వరకు ఓకే లే కాని … సొంత డబ్బులతో ఎవడు ఊరిని దత్తత తీసుకుంటాడు అని అడిగా… అప్పటి వరకు కూల్ గా స్టోరి డిస్కర్స్ చేసుకుంటున్న ముగ్గురు నన్ను ప్రత్యర్ధి లాగా చూశారు..  బాస్ కొంపదీసి మీరు మహేశ్ బాబు వీరాభిమానులు కాదు కదా… ఎందుకంత కోపంగా చూస్తున్నారు అన్నారు.

ప్పుడు స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు……………………………….

సింహాద్రీ:    అన్నా…. నేను వీళ్లకు వాళ్లకు ఫ్యాన్ కాను, కానీ ఎదో నవనీత్ గాడి ఫోర్స్ తో మార్నింగ్ షో  శ్రీమంతుడికి వెళ్లాను.. ఆ తర్వాత అటునుండి అటు బిగ్ బజార్ కు వెళ్లాను.. ఎందుకో తెలుసా… నా జీతం 40 వేలు అందులో 25 వేలు పెట్టి పెన్నులు, పెన్సిల్స్, కథల పుస్తకాలు… బాల్, క్యారెమ్ బోర్డ్ …ఇలాంటివి కొన్న.. ఇవి ఎందుకో తెలుసా  మా ఊర్లో ఉన్న స్కూల్ కు ఇవ్వడానికి.. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివా… క్రికెట్   ఆడాలంటే తాటి మట్టలను బ్యాట్ లుగా చేసుకొని ఆడేవాళ్లం, అది చేతికి కోసుకుని అయిన గాయం నాకింకా గుర్తు ఉంది.. అందుకే..  ఎప్పటి నుండో ఇది చేద్దాం అనుకున్న కాని శ్రీమంతుడు సినిమా చూశాక ఇక ఆగలేకపోయా…….!

నవనీత్:   నేను పక్కా పోకిరి బ్యాచ్… సరదాలకు ఫుల్ టైమ్ స్పెండ్ చేసే రకాన్ని,  చిన్నప్పటి నుండి గ్రూప్ ను గట్టిగా మెయింటెన్ చేసేవాడిని, తాగుడు పార్టీలు, సరదా ట్రిప్పులకు లెక్కే లేదు… కానీ ఇప్పుడు ఊరికి వెళ్లేది ఎందుకో తెలుసా… నా చిన్న నాటి గ్రూప్ ను కలవాలి.. కలిసి ఈ సారి గోవా ట్రిప్పులకు ప్లాన్ వేసుకోకుండా.. ఊరికి సరిగ్గా రోడ్డు లేదు దాని కొరకు ఏం చేయాలో ఆలోచించాలి.. ఈ నెల అందరం 15000 రూపాయల చొప్పున పక్కకు పెడదామని,  గ్రూప్ గా ఓ అకౌంట్ ఓపెన్ చేద్దామని ఫోన్లో మాట్లాడుకున్నాం.. వెళ్లాక దాని గురించి చర్చించాలి. అందరం డబ్బులు పోగేసి  మా ఊరికి రోడ్డేసి ఫ్రెండ్స్ యూత్ సహాకారంతో  అని బోర్డ్ పెట్టేయాలి.. అందుకే ఇంటికి….!

హరీష్: బాస్… నేను అప్పుడెప్పుడో సంక్రాంతికి మా ఊరికి వెళ్లాను, దాని తర్వాత మా ఊరి  మొఖమే నే చూడలేదు. నిజం చెప్పాలంటే నాకు వెళ్లాలనిపించదు.. అక్కడ అంత కంఫర్ట్ గా ఉండదు. బోర్ కొడుతుంది. కానీ ఇప్పుడెందుకు వెళుతున్నానో తెలుసా.. నేనేదో మా ఊరిని డెవలప్ చేయాలని కాదు.. మా అమ్మా, నాన్న లతో గడపడానికి…. వాళ్ళతో కలిసి మా తోటలో వండుకొని తినడానికి..  పాపం ఎప్పుడు ఫోన్ చేసిన కట్ చేసే వాడిని .. డార్లింగ్ అంటూ వేరే వాళ్లతో సొల్లు పెట్టడానికి.. ఇప్పుడు వెళ్లగానే అమ్మా, నాన్న లను గట్టిగా కౌగిలించుకోవాలి. చాలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు వాళ్ళ ప్రేమను.

వామ్మో..వామ్మో…  సినిమాల ప్రభావం మనుషుల మీద ఉంటుందని తెలుసు కాని ఇంతగానా..?  రైట్.. రైట్  ఇప్పుడే మనోళ్ళు మంచి ట్రాక్ లోకి వచ్చారు..  @KORATALA SIVA … మీకు చాలా థాంక్స్.. సినిమా అంటే అదేదో అర్థం కాని మూడుగంటల ప్రపంచం అనుకొని గడిపే యూత్ కు జీవిత సత్యాన్నిచెప్పడానికి , తల్లిదండ్రులకు, సమాజానికి దగ్గర చేసే సాధనంలా కూడా వాడొచ్చని నిరూపించావ్.

మీకు కూడా మీ ఊరు చాలా ఇచ్చి ఉంటుంది.. ఎంతో కొంత మీరు కూడా మీ ఊరికి తిరిగి ఇచ్చేయండి.. లేకపోతే లావయిపోతారు.  ఇది రియల్ స్టోరి…   ఆ ముగ్గురితో జర్నీ చేసింది జానీపాష….   వాడు చెప్పిన స్టోరిని ఎడిట్ చేసి రాసింది నేను.

Comments

comments

Share this post

0 Replies to “శ్రీమంతుడు సినిమా తో స్పూర్తి పొందిన ముగ్గురు యువకులు… రియల్ స్టోరి.”

  1. rajender says:

    very nice and interesting too!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top