26/11 ముంబై దాడుల్లో వీర‌మ‌ర‌ణం పొందిన అమ‌రుడు మేజ‌ర్ సందీప్ వ‌ర్ధంతి నేడు..!

“పైకి రాకండి… నేను వారి ప‌ని చూస్తా..!” ఇవి మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ ప‌లికిన‌ చివ‌రి మాట‌లు. అంతే… వెనుక నుంచి ఉగ్ర‌వాదులు కాల్చిన బుల్లెట్లు వ‌ర్షంలా అత‌న్ని వీపును తాకాయి. దాంతో ఆ వీర సైనికుడు నేల‌కొరిగాడు. ఆ ఘ‌ట‌న జ‌రిగి నేటికి స‌రిగ్గా 8 ఏళ్లు. 8 ఏళ్ల కింద‌ట ఇదే రోజున మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ ఉగ్ర‌దాడుల నుంచి అనేక మందిని ర‌క్షించి వీర మ‌ర‌ణం పొందాడు. 2008లో న‌వంబ‌ర్ 26న జ‌రిగిన ముంబై ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల్లో ఈయ‌న కూడా ఉన్నారు.

స్‌టీ టెర్మిన‌ల్ లో కొంద‌రు, తాజ్ హోట‌ల్‌లో కొంద‌రు, లియోపోల్డ్ కేఫ్‌లో కొంద‌రు ప్ర‌వేశించారు. క‌న‌బ‌డిన వారిని క‌న‌బ‌డిన‌ట్టు విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్చిపారేస్తూ ముందుకు సాగారు.

major-sandeep-unnikrishnan

అది 2008, న‌వంబ‌ర్ 26. క‌రుడు గ‌ట్టిన తీవ్ర‌వాదులు 10 మంది అప్ప‌టికే ద‌క్షిణ ముంబై తీర ప్రాంతానికి దొంగ‌త‌నంగా చేరుకున్నారు. రాత్రి అవుతోంది. వెంట‌నే త‌మ ప‌ని ప్రారంభించేశారు. అత్యంత అధునాత‌న‌మైన ఆయుధాలు వారి వ‌ద్ద ఉన్నాయి. తుపాకులు, ముఖ్యంగా ఏకే 47లు, గ్రెనేడ్‌లు లెక్క లేనన్ని ఉన్నాయి. వాట‌న్నింటినీ పెద్ద పెద్ద బ్యాగుల్లో వేసుకుని అంద‌రూ గ్రూప్‌లుగా విడిపోయి ముంబై సీఎ

అప్ప‌టికే అల‌ర్ట్ అయిన పోలీసులు, ఇండియన్ ఆర్మీ, ఎన్ఎస్‌జీ క‌మాండోలు ఉగ్ర‌వాదుల దాడిని తిప్పికొడుతూ ఆర్మీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. తాజ్ హోట‌ల్‌లో జ‌రిగిన ఆర్మీ ఆప‌రేష‌న్‌కు మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ నాయ‌క‌త్వం వ‌హించాడు. త‌న స‌బార్డినేట్స్‌తో క‌లిసి తాజ్ హోట‌ల్‌లోకి ప్ర‌వేశించి ఉగ్ర‌వాదుల‌ను ఏరి వేసే ప‌ని చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో చాలా మంది ప్ర‌జ‌ల‌ను ర‌క్షించారు. అయితే ఎన్నో అంత‌స్తులు ఉన్న తాజ్ హోట‌ల్‌లో ఆర్మీ ఒక్కో ఫ్లోర్ వెళ్లే కొద్దీ ఉగ్ర‌వాదులు కూడా ఒక్కో ఫ్లోర్ పైకి వెళ్తూ అంద‌ర్నీ కాల్చేయ‌సాగారు. అలాంటి ప‌రిస్థితుల్లో మేజ‌ర్ సందీప్ ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ బాధ్య‌త‌ను స‌బార్డినేట్స్‌కు అప్ప‌గించి తాను ఉగ్ర‌వాదుల ప‌ని ప‌ట్ట‌డానికి వారి క‌న్నా ఒక ఫ్లోర్ ముందే వెళ్లి కాచుకుని కూర్చున్నాడు. వారు రాగానే అటాక్ ప్రారంభించాడు. అలా అటాక్‌కు వెళ్లే ముందు ఆయ‌న మాట్లాడిన ఆఖ‌రి మాట‌లే అవి..! అనంత‌రం కొంత సేపు ఉగ్ర‌వాదుల‌తో పోరాడినా చివ‌ర‌కు వారి బుల్లెట్ల వ‌ర్షానికి నేల‌కొరిగాడు. అలా ఆయ‌న మృతి చెంది ఇప్ప‌టికి స‌రిగ్గా 8 ఏళ్లు పూర్త‌యింది. ఆయ‌న్ను స్మ‌రించుకోవ‌డం భార‌తీయ పౌరులుగా మ‌నంద‌రి బాధ్య‌త‌. శాల్యూట్ టు మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్‌..!

Comments

comments

Share this post

scroll to top