సూర్య "24" టీజర్.. మైండ్ బ్లోయింగ్

కోలీవుడ్ లో విభిన్న చిత్రాలలో నటించే కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ’24’. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. మనం,ఇష్క్ సినిమాలను డైరెక్ట్ చేసిన విక్రం కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చిత్ర ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసి, ఓ సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు అనేలా చేసిన విక్రం కుమార్, తాజాగా విడుదలైన టీజర్ లో అదే చెప్పాడు. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, యాక్షన్ సీన్స్, టైం, కాల్యుక్యులేషన్, గణితం అంటూ సైన్స్ ఫిక్షన్ సినిమాను ప్రయోగాత్మకంగా చూపించాడు.

ఒక నిముషం పైగా ఉన్న ఈ టీజర్ సూర్య మూడు గెటప్స్ లో దర్శనమిచ్చాడు. సైంటిస్ట్, గ్యాంగ్ స్టర్ , యంగ్ లుక్.. వేటికవే డిఫరెంట్ లుక్ లో సూపర్బ్ గా ఉన్నాడు. కాలానికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. టీజర్ లో రెహమాన్ అందించిన నేఫధ్య సంగీతం సూపర్బ్ గా ఉంది. నిత్యమీనన్, సమంతాలకు సినిమాలో మంచి స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. ‘పంచుకున్నది ఒకే గర్భం, క్షణాల తేడాలో మన జననం, ఇద్దరికీ ఒకటే రూపం, అని చెబుతూ నేను నా వాచ్ కోసం వచ్చాను’ డైలాగ్ లోనే సినిమా కథను చెప్పబోతున్నారు. చాలా రోజులుగా ఈ సినిమా టీజర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఓ విజువల్ ఫీస్ట్ టీజర్ అందించారు సూర్య-విక్రంకుమార్. స్టూడియో గ్రీన్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని 2016 సమ్మర్ కానుకగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
 
Watch Teaser:
 

Comments

comments

Share this post

scroll to top