ఈ రోజు: 23-02-2019 ( శనివారం ) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?

మేషం :

ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు ఎదుటివారిని గమనించండి. పాత వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు. వృత్తుల్లో వారికి అనుకూలమైన కాలం. కళారంగాల వారికి సంతృప్తి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృషభం :

మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. వాణిజ్య ఒప్పందాలు వాయిదా వేయండి. రచయితలకు, పత్రికా రంగాల్లో వారికి అనుకూలమైన కాలం. ముఖ్యమైన విషయాలు చర్చకు వచ్చినా వాయిదా వేయండి. సోదరీ, సోదరుల సహకారం లభించకపోవచ్చు.

మిథునం :

కాంట్రాక్టర్లకు చికాకులు తలెత్తుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, పూల, పండ్ల, వ్యాపారులకు ఆశాజనకం. రుణాలు తీరుస్తారు. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. విద్యార్థినులకు దూరప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ముఖ్యులకు శుభాకాంక్షలు అందజేస్తారు.

కర్కాటకం :

వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. కోర్టు వ్యవహారాలు, పరిష్కార దిశగా సాగుతాయి. బదిలీపై వచ్చిన ఉద్యోగస్తులకు అధికారులు, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి.

సింహం :

ప్రైవేటు సంస్థల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనిలో కొన్ని చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. సాహిత్యాభిలాష పెరుగుతుంది. పెద్దలను ప్రముఖులను కలుసుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది.

కన్య :

ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. బంధువులు, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది.

తుల :

విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులెదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి విషయాన్ని మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం మంచిది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.

వృశ్చికం :

కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులు, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. దంపతుల మధ్య మనస్ఫర్ధలు తలెత్తుతాయి. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ప్రయాణాలు అనుకూలం.

ధనుస్సు :

కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తలెత్తవచ్చును. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. కుటుంబ విషయాలను మిత్రులతో చర్చించడం మంచిది కాదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది.

మకరం :

గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. భాగస్వాముల మధ్య నూతన విషయాలు చర్చకు వస్తాయి. ప్రేమికుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఐరన్, కలప, సిమెంట్ వ్యాపారస్తులకు మందకొడిగా ఉండగలదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది.

కుంభం :

విద్యా సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచనను వాయిదా వేయండి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, వ్యాపారులకు లాభదాయకం.

మీనం :

బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి.

Comments

comments

Share this post

scroll to top