ఆ 21 ఏళ్ల కుర్రాడు..”అమెజాన్” నుండి 166 ఫోన్లు ఆర్డర్ చేసి..50 లక్షలు ఎలా దోచుకున్నాడో తెలుసా.? చివరికి.!

ఆన్ లైన్ షాపింగ్ సైట్ల‌ను న‌మ్మ‌లేం. మ‌నం ఫోన్ ఆర్డ‌ర్ ఇస్తే స‌బ్బు బిళ్ల వ‌స్తుంది, అదే టీవీ ఆర్డ‌ర్ ఇస్తే ఇటుక‌లు వ‌స్తాయి.. అని న‌మ్మేవాళ్లు కొంద‌రుంటారు. అయితే నిజానికి ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం అలాంటిది కాదు, ఇక్క‌డ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ యూజ‌ర్‌ను మోసం చేయ‌డం కాదు, యూజ‌రే ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌ను మోసం చేశాడు. త‌న‌కు ఐట‌మ్స్ రాలేద‌ని చెప్పి ఏకంగా 166 ఫోన్ల‌కు గాను మొత్తం రూ.50 ల‌క్ష‌ల రీఫండ్ పొందాడు. అనంత‌రం ఆ ఫోన్ల‌ను కూడా త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. అయితే మోసం ఎంత‌కాలం సాగ‌దు క‌దా, క‌నుక అత‌ను దొరికిపోయాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అత‌ని పేరు శివ‌మ్ చోప్రా. వ‌య‌స్సు 21 సంవ‌త్స‌రాలు. ఢిల్లీలోని రోహిణి అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సు చ‌దివాడు. ఎన్ని రోజులు ఉన్నా ఉద్యోగం రావ‌డం లేద‌ని భావించిన శివ‌మ్ ఎలాగైనా డ‌బ్బులు సంపాదించాల‌ని అనుకుని ఓ ప‌థ‌కం ప‌న్నాడు. దాన్ని వెంట‌నే అమ‌లు చేశాడు. అమెజాన్ సైట్ నుంచి మొద‌ట రెండు ఖ‌రీదైన ఫోన్ల‌ను వేర్వేరు ఫోన్ నంబ‌ర్లు, అడ్ర‌స్‌లు, ఈ-మెయిల్ ఐడీల‌తో ఆర్డర్ ఇచ్చాడు. వాటిని డెలివ‌రీ బాయ్ నుంచి వేర్వేరు ప్రాంతాల్లో డెలివ‌రీ తీసుకున్నాడు. అయితే అత‌నికి ఫోన్‌లు వ‌చ్చినా, రాలేద‌ని చెప్పి, ఆ బాక్సులు ఖాళీగా ఉన్నాయ‌ని పేర్కొంటూ అమెజాన్‌లో రీఫండ్ కోసం రిక్వెస్ట్ పెట్టాడు. దీంతో అత‌ను డెలివ‌రీ స‌మయంలో చెల్లించిన డ‌బ్బులు తిరిగి వ‌చ్చాయి. పైగా ఫోన్లు కూడా ఉన్నాయి. దీంతో ఆ ఫోన్ల‌ను ఓఎల్ఎక్స్ వంటి సైట్ల‌లో త‌క్కువ ధ‌ర‌కు అమ్మాడు. ఈ క్ర‌మంలో అత‌నికి డ‌బ్బు వ‌చ్చింది. దీంతో ఇదేదో బాగానే వ‌ర్క‌వుట్ అయింద‌ని భావించి ఇక అదే ప‌ని చేయ‌డం ప్రారంభించాడు.

అలా శివ‌మ్ కేవ‌లం 4 నెల‌ల కాలంలోనే అమెజాన్‌లో ఏకంగా 166 ఫోన్లు కొన్నాడు. అవ‌న్నీ చాలా ఖ‌రీదైన‌వి. శాంసంగ్‌, యాపిల్‌, వ‌న్ ప్ల‌స్ వంటి కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌ను ఆర్డ‌ర్ చేసేవాడు. అందుకు గాను భిన్న‌మైన ఫోన్ నంబ‌ర్లు, ఈ-మెయిల్ ఐడీలు, చిరునామాలు ఉప‌యోగించాడు. అయితే ఫోన్ నంబ‌ర్ల‌కు గాను అత‌ను ఓ లోక‌ల్ మొబైల్ షాప్ అత‌న్ని ఆశ్రయించాడు. దీంతో ఆ వ్య‌క్తి శివ‌మ్‌కు రూ.150కి ఒక్క సిమ్ చొప్పున మొత్తం 141 ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌ల‌ను శివ‌మ్‌కు అందించాడు. వాటితో ఫోన్ల‌ను కొన్నాడు. డెలివ‌రీ స‌మ‌యంలో తాను ఇంటి ద‌గ్గ‌ర లేన‌ని చెప్పి వేరే చోటికి ర‌మ్మ‌ని డెలివ‌రీ బాయ్ ద్వారా ఫోన్ల‌ను డెలివ‌రీ తీసుకునేవాడు. డ‌బ్బులు క‌ట్టేవాడు. అనంత‌రం వెంట‌నే అమెజాన్ లోకి వెళ్ళి త‌న‌కు ఫోన్ రాలేద‌ని, బాక్స్‌లో అంతా ఖాళీగా ఉంద‌ని చెప్పి డ‌బ్బులు రీఫండ్ చేయాల‌ని రిక్వెస్ట్ పెట్టేవాడు. ఆ క్ర‌మంలో అది నిజ‌మే అని న‌మ్మిన అమెజాన్ అత‌నికి డ‌బ్బులు రీఫండ్ చేసింది. అలా 166 ఫోన్ల‌కు గాను ఇప్ప‌టి వ‌ర‌కు రూ.50 ల‌క్ష‌ల‌కు పైనే శివ‌మ్ రీఫండ్ పొందాడు.

ఇక ఫోన్లు ఎలాగూ ఉన్నాయి కాబట్టి వాటిని స్థానికంగా లోక‌ల్ మొబైల్ షాపుల్లో లేదా ఓఎల్ఎక్స్ వంటి సైట్ల‌లో త‌క్కువ ధ‌ర‌కు విక్ర‌యించేవాడు. అలా శివ‌మ్ సొమ్ము చేసుకున్నాడు. కానీ అత‌ని మోసం దాగలేదు. చివ‌ర‌కు అమెజాన్ వారికి డౌటొచ్చి ఎంక్వ‌యిరీ చేయించ‌గా శివ‌మ్ చేసిన మోసం బ‌య‌ట ప‌డింది. దీంతో అమెజాన్ కంపెనీ ప్ర‌తినిధులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారు శివ‌మ్ ను అదుపులోకి తీసుకుని అత‌ని నుంచి 19 ఫోన్లు, రూ.12 ల‌క్ష‌ల న‌గ‌దు, 40 పాస్‌బుక్‌లు, ప‌లు చెక్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అవును మ‌రి, అంత పెద్ద సంస్థ‌ను బోల్తా కొట్టించాల‌ని చూస్తే అలాగే అవుతుంది మ‌రి, మోసాలు ఎల్ల‌కాలం చెల్ల‌వు క‌దా. ఎప్పుడో ఒక సారి బ‌య‌ట ప‌డ‌క త‌ప్ప‌దు..!

Comments

comments

Share this post

scroll to top