ఈ 21 ఫొటోల‌ను చూస్తే మీకు మీ చిన్న‌త‌నం గుర్తుకు వ‌స్తుంది.! 6 వ ది ఎంతమందికి గుర్తుంది.?

జీవితం అంటే అంతే.. ఒక‌సారి గ‌డిచిపోయిన క్ష‌ణాలు మ‌ళ్లీ రావు. అవి చెడువైనా స‌రే.. మంచివైన మ‌ధుర క్ష‌ణాలు అయినా స‌రే.. ఎవ‌రి జీవితంలోనూ అలాంటి క్ష‌ణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు. ఇక చిన్న‌తనంలో గ‌డిపిన ఆనంద‌పు క్ష‌ణాలు, జ్ఞాప‌కాల సంగ‌తి స‌రే స‌రి. అవి అంద‌రికీ జీవితాంతం గుర్తుంటాయి. కింద మేం ఇచ్చింది కూడా స‌రిగ్గా ఆ కోవ‌కు చెందిన ఫొటోలే. ఇవి చాలా మందికి త‌మ చిన్న‌త‌నంలో గుర్తుండే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే వాటిని మ‌రోసారి చూసి మీరు కూడా మీ చిన్న‌త‌నంలో గ‌డిపిన ఆనంద‌పు క్ష‌ణాను ఓసారి గుర్తు చేసుకోండి.

1. సిటీలో సూప‌ర్ మార్కెట్ల‌లో దొరికే పండ్లను తిన‌డం కాదు, గ్రామంలో ఇలా చెట్టెక్కి పండ్ల‌ను తినాలి. ఇలా ఎవ‌రైనా తిన్నారా..

2. కొబ్బ‌రి ఆకుల‌తో త‌యారు చేసే పెండ్లి మండ‌పాలు, వ‌స్తువులు.. వ‌గైరా.. వీటిని చాలా మంది త‌మ చిన్న‌త‌నంలో చూసే ఉంటారు.

3. ఇప్పుడంటే టీవీలు బాగా స్లిమ్ అయ్యాయి. కానీ ఒక‌ప్పుడు ఇదిగో.. ఇలా ఉండేది వాటి సైజు.

4. ఈ ఆట ఏమిటో తెలియ‌దు.. మీరు దాని పేరు చెప్ప‌గ‌ల‌రా..?

5. ఇలాంటి పూరి గుడిసెలు ఇప్పుడు లేవు.

6. కిరోసిన్‌తో న‌డిచే లాంత‌ర్‌.. ఎన్నాళ్ల‌కు చూశాం..

7. ఫైవ్ స్టార్ చాక్లెట్ అప్ప‌ట్లో ఇలా ఉండేది.

8. ఇప్పుడు ఇస్త్రీ చేసుకునేందుకు ఐర‌న్ బాక్సులు ఉన్నాయి. ఒక‌ప్పుడు మాత్రం బొగ్గును వేడి చేసి ఇలా ఇస్త్రీ చేసే వారు.

9. సోడా ఇప్పుడూ ఉంది. గోలీ లేదు.

10. ఐదు పైస‌లు, 10, 20 పైస‌ల నాణేలు.. వీటిని ఎంత మంది చూశారు. ఎంత మంది వీటితో చిన్నప్పుడు తినుబండారాలు కొన్నారు. చెప్పండి.

11. సైకిల్‌కు ఉండే డైన‌మో. దీని ద్వారానే సైకిల్‌కు లైట్ వెలుగుతుంది.

12. వెనుక‌టికి పోస్టాఫీసులు ఇలా ఉండేవ‌న్న‌మాట‌.

13. వీటిని ఎవ‌రూ మ‌రిచిపోరు. తాటి ముంజ కాయ‌ల బండ్లు.

14. ఇప్పుడు కూడా కొంద‌రు రోటి ప‌చ్చ‌డి చేస్తున్నారు లెండి. పూర్తిగా ఇది క‌నుమ‌రుగు కాలేదు.

15. క‌రెంటు లేక‌పోతే ఇలాంటి దీపాలు వెనుక‌టికి దిక్కు.

 

16. గోళీకాయ‌ల ఆట అంటే ఆటే.. భ‌లే మ‌జా వ‌స్తుంది క‌దా.

17. ఇప్పుడు మిక్సీలు, గ్రైండ‌ర్లు. అప్ప‌ట్లో ఇలా రోట్లో దంచేవారు.

18. అప్ప‌ట్లో ఉన్న టేప్ రికార్డ‌ర్ క‌మ్ రేడియో ఇది. ఎలా ఉంది.

19. 1963వ సంవ‌త్స‌రంలో పెట్రోల్ 5 లీట‌ర్ల ధ‌ర రూ.3.60.. ఇప్పుడు వ‌ద్దులే.. గుండెలు బాదుకోవాల్సి వ‌స్తుంది.

20. ఈ వ‌స్తువు పేరు మీరు చెప్ప‌గ‌ల‌రా.. మేం మ‌రిచిపోయాం..

21. వెనుక‌టికి ఇండ్ల‌లో వంట గ‌ది ఇలా ఉండేది.

Comments

comments

Share this post

scroll to top