చైనాలో బ‌య‌ట‌ప‌డిన 2వేల ఏళ్ల నాటి పురాత‌న న‌గ‌రం

ఈ విశ్వ‌మే ఓ మాయా ప్ర‌పంచం. మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాల‌ను త‌న‌లో దాచి పెట్టుకుంది. అందులో నుంచి ఒక్కో విష‌యం మ‌న‌కు అప్పుడ‌ప్పుడూ తెలుస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చైనాకు చెందిన అలాంటి ఓ ప్ర‌త్యేక‌మైన విష‌యం తాజాగా తెలియ‌వ‌చ్చింది. అదేమిటంటే… చైనాలో అక్క‌డి పురాత‌త్వ శాస్త్రవేత్త‌లు 2వేల ఏళ్ల కింద‌టి ఓ పురాత‌న న‌గ‌రాన్ని క‌నుగొన్నారు. ఆ స‌మ‌యంలోనే అక్క‌డి నాగ‌రిక‌త ఎంతో ప్ర‌త్యేకంగా ఉండేద‌ని స‌ద‌రు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఆ పురాత‌న న‌గ‌రం బ‌య‌ట ప‌డింది.

ancient-china-city-1

గ‌తేడాది జూలై 2016 నుంచి చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్ షెన్యాంగ్ ప్రాంతంలో పురాత‌త్వ శాస్త్రవేత్త‌లు తవ్వ‌కాల‌ను మొద‌లు పెట్టారు. కాగా ఆ త‌వ్వ‌కాలు ఈ మ‌ధ్యే ముగిశాయి. అయితే ఆ త‌వ్వ‌కాల్లో 2వేల ఏళ్ల కింద‌టి ఓ పురాత‌న న‌గ‌రం ఆన‌వాళ్లు బ‌య‌ట ప‌డ్డాయి. దీంతోపాటు స‌ద‌రు శాస్త్రవేత్త‌ల‌కు అప్ప‌టి కాలానికి చెందిన కొన్ని వ‌స్తువులు కూడా దొరికాయి. ఆ స‌మ‌య‌లో ఇంటి నిర్మాణాలు, సెల్లార్లు, యాష్ కుండీలు, స‌మాధులు త‌దిత‌ర నిర్మాణాల‌ను శాస్త్రవేత్త‌లు గుర్తించారు. దీంతోపాటు ప‌లు కుండ పెంకులు, కాంస్య‌, రాగి వ‌స్తువులు కూడా వారికి అక్క‌డ దొరికాయి.

ancient-china-city-2

ఈ క్ర‌మంలో స‌ద‌రు వ‌స్తువుల‌ను ప‌రిశీలించిన పురాత‌త్వ శాస్త్రవేత్త‌లు అవి 2వేల ఏళ్ల కింద‌టివ‌ని గుర్తించారు. అప్ప‌ట్లోనే ఆ న‌గ‌రం ఎంతో ప్ర‌త్యేకమైన సంస్కృతిని క‌లిగి ఉండేద‌ని అన్నారు. షెన్యాంగ్ లోని హునాన్ జిల్లాలో ఉన్న కింగ్ జువాంగ్జి అనే ప్రాంతంలో ఈ నాగ‌రిత గురించి శాస్త్రవేత్త‌ల‌కు తెలిసింది. దీంతో అక్క‌డే వారు మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టారు. ఆ కాలంలో ప్ర‌జ‌ల జీవన విధానం, ఆచారాలు, వ్య‌వ‌హారాలు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు వారు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో తెలిసే అవ‌కాశం ఉంది. అయితే ఆ నాగ‌రిత బ‌య‌ట ప‌డేందుకు శాస్త్రవేత్త‌లు ఎంత ప్ర‌దేశాన్ని త‌వ్వారో తెలుసా..? దాదాపుగా 500 చ‌ద‌ర‌పు మీట‌ర్ల మేర తవ్వ‌కాల‌ను జ‌రిపారు. ఈ క్ర‌మంలో మ‌రింత ప్ర‌దేశాన్ని త‌వ్వితే ఇంకా ఏమైనా ఆధారాలు దొర‌క‌వ‌చ్చ‌ని వారు భావిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top