2019 లోపు….2000/- నోట్లు రద్దు కానున్నాయా??

పెద్ద నోట్ల రద్దుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో సంచ‌లనానికి తెర లేపబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పెద్ద నోటు 2000 పై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేపథ్యంలో….. కేంద్రం  ఆ నోటును మ‌ళ్లీ వెన‌క్కి తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు….. మరోవైపు  50, 100 రూపాయల నోట్లను రద్దు చేసే యోచనలో కేంద్ర ప్ర‌భుత్వం ఉందంటూ వార్తలొస్తున్నాయి. వీటిపై స్పందించిన కేంద్ర  సమాచార మంత్రిత్వ శాఖ చిన్ననోట్ల రద్దు ఉండదని క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా వెయ్యి రూపాయల నోటును మరలా చలామణిలోకి తీసుకొచ్చే అవకాశం అస‌లు లేద‌ని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ సంధర్భంగా 2000 వేల రూపాయల నోటు విషయంలో మాత్రం జనాల్లో ఓ క్లారిటీ లేదు. మోడీ తాజా నిర్ణయంలో నల్లధనం లెక్కలు తేలాక…ఈ కొత్త 2000/- రూపాయల నోటు ను కూడా రద్దు చేస్తారనే పుకార్లు వినిపిస్తున్నాయి. వాటికి 4 కారణాలు బలాన్ని చేకూర్చుతున్నాయి.

notes-large

  • వెయ్యి నోటు లేకుండా 2000 రూపాయ‌ల నోటును చ‌లామ‌ణిలో ఉంచ‌డం క‌ష్టం.
  • 500/- లకే చిల్లర కష్టమైన ఈ తరుణంలో 2000/- నోటు కేవలం అలంకార ప్రాయమే అవుతుంది.
  • నల్లధనం నియంత్రణలో…..పెద్ద నోట్ల చలామణి ఉండకూడదు.
  • అన్నింటికి మించి…సెక్యురిటీ ఫీచర్స్ పరంగా 2000/- రూపాయల నోట్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు.

Comments

comments

Share this post

scroll to top