200 ఏళ్ల క్రితం…. ప‌ద్మాస‌నంలో కూర్చున్న ఈయ‌న‌…ఇప్ప‌టికీ అలాగే ఉన్నాడు.!

అది ఒక బౌద్ధ స‌న్యాసి మ‌మ్మీ. అలా అని చెప్పి అది చ‌నిపోయాక దాచి పెట్ట‌బ‌డిన మ‌మ్మీ కాదు. బ‌తికి ఉన్న మ‌మ్మీనే. అస‌లు దాన్ని మ‌మ్మీ అనే కంటే బ‌తికి ఉన్న శవం… అని అన‌వ‌చ్చేమో..! ఏంటీ… క‌న్‌ఫ్యూజ‌న్‌గా ఉందా..! అవును మ‌రి. ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం వింటే మీకు డ‌బుల్ క‌న్‌ఫ్యూజ‌న్ క‌ల‌గ‌క మాన‌దు. విష‌యం అలాంటిది మ‌రి. ఏమీ లేదండీ… 200 ఏళ్ల కింద‌ట ఓ బౌద్ధ స‌న్యాసి ఉండేవాడ‌ట‌. అయితే అత‌ను మెడిటేష‌న్ చేస్తూ అలాగే ఉండిపోయి ఇప్పుడు అందులో ఉచ్ఛ‌స్థాయికి చేరుకున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలో అత‌ని శ‌రీరం మాత్రం మిగిలి ఉంది, కానీ అత‌ను ఇంకా చ‌నిపోలేద‌ట‌. కాక‌పోతే అత‌నిప్పుడు మ‌మ్మీలా త‌యార‌య్యాడ‌ట‌. చూసేందుకు మ‌మ్మీలా ఉన్నా ఆ స‌న్యాసి మాత్రం ఇప్ప‌టికీ జీవించే ఉన్నాడ‌ట‌. ఆ స‌న్యాసి ప‌ద్మాస‌నంలో కూర్చుని ఉండ‌డాన్ని బ‌ట్టి చూస్తే క‌చ్చితంగా అత‌ను ఇంకా జీవించే ఉన్నాడ‌ని, ధ్యానంలో దాదాపుగా చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డం వ‌ల్లే అలా మారాడ‌ని బౌద్ధ సన్యాసులు అంటున్నారు.

monk-mummy-1
అయితే మమ్మీలా ఉన్న ఆ స‌న్యాసి క‌ద‌లడు, మెద‌ల‌డు. అలాగే ఉంటాడు. కానీ కొంద‌రు యోగ శిక్ష‌కులు, బౌద్ధ స‌న్యాసులు ఏమంటున్నారంటే… అది ధ్యానంలో చాలా ఉన్న‌త‌మైన ద‌శ అట‌. ఆ ద‌శ దాటిన వారు ఏకంగా బుద్ధులే అవుతార‌ట‌. ఆ ద‌శ‌ను టుక్డ‌మ్ అని అంటార‌ట‌. అలాంటి ద‌శ‌లోనే ఇప్పుడు పైన చెప్పిన మ‌మ్మీ స‌న్యాసి ఉన్నాడ‌ట‌. ఈ ద‌శ దాటితే ఇక అత‌డు బుద్ధినితో స‌మాన‌మ‌ని ప‌లువురు బౌద్ధ స‌న్యాసులు అంటున్నారు. గ‌త 200 ఏళ్ల కింద‌ట ఆ స‌న్యాసి జ‌న్మించాడ‌ట‌. అత‌ను స‌న్యాసిగా మారిన‌ప్ప‌టి నుంచి అలా ధ్యానం చేస్తూ ఉండిపోయి ఇప్పుడీ ద‌శ‌కు చేరుకున్నార‌ట‌. అయితే ఆ స‌న్యాసి ఎప్పుడైతే ధ్యానంలో అంత్య ద‌శ‌కు చేరుకుని బుద్ధునిలా మార‌తాడో అప్పుడు చుట్టూ ఉన్న‌వారిని బాగు చేస్తాడ‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజ‌మేన‌ట‌. ప‌లువురు ప్ర‌ముఖ బౌద్ధ స‌న్యాసులు ఈ విష‌యం చెబుతున్నారు.

monk-mummy-2
ఈ క్ర‌మంలో స‌ద‌రు స‌న్యాసి మ‌మ్మీని మంగోలియాలోని Kobdsk అనే ప్రాంతంలో ఉన్న ఓ గుహ నుంచి ఓ వ్య‌క్తి వెలికి తీసి దాన్ని అత్యంత ఎక్కువ ధ‌ర‌కు మార్కెట్‌లో అమ్ముకోవాల‌ని మంగోలియా బార్డ‌ర్ వ‌ద్ద త‌ర‌లిస్తుండ‌గా Ulaanbaatar అనే ప్రాంతం వ‌ద్ద అక్క‌డి పోలీసులు ఆ వ్య‌క్తిని ప‌ట్టుకున్నారు. దీంతో ఆ మమ్మీ స‌న్యాసి గురించిన అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అయితే ఇప్పుడా స‌న్యాసి మ‌మ్మీ మంగోలియాలోని Ulaanbaatar ప్రాంతంలో నేష‌న‌ల్ సెంట‌ర్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్‌ప‌ర్ట‌యిజ్ అనే కేంద్రంలో భద్రంగా ఉంద‌ట‌. ఈ క్రమంలో కొంత సమ‌యం పాటు వేచి చూస్తే ఆ స‌న్యాసి మ‌మ్మీ బుద్ధునిలా మారుతుంద‌ని ప‌లువురు బౌద్ధ స‌న్యాసులు అంటున్నారు. అయితే అది ఎప్పుడ‌నేది వారికి కూడా తెలియ‌ద‌ట‌. కాగా ఇలా స‌న్యాసి మ‌మ్మీలు దొర‌క‌డం కొత్త కాద‌ట‌. గ‌త 50 ఏళ్లుగా మంగోలియాలో ఇలాంటివే దాదాపుగా 40 కేసుల వ‌ర‌కు జ‌రిగాయ‌ట‌. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు బౌద్ధ స‌న్యాసులు చెప్పిన‌ట్టుగా ఎవ‌రూ బుద్ధులు కాలేద‌ట‌. మ‌రి ఇప్పుడైనా అది నిజ‌మ‌వుతుందా?  లేదా అన్న‌ది వేచి చూడాలి. అయితే సాధార‌ణంగా ఏ బౌద్ధ స‌న్యాసి అయినా మెడిటేష‌న్ చేస్తే 3 వారాల క‌న్నా ఎక్కువ‌గా అదే స్థితిలో ఉంటే అప్పుడు అలాంటి వారి శ‌రీరం పైన చెప్పినట్టుగా మమ్మీలా త‌యార‌వుతుంద‌ట‌. ఇది స‌న్యాసులు చెబుతున్న మాట కాదు, డాక్ట‌ర్ బ్యారీ కెర్జిన్ అనే ఓ ఫిజిషియ‌న్ చెబుతున్న మాట‌లు. మ‌రి అదే వాస్త‌వ‌మైతే పైన చెప్పిన ఆ స‌న్యాసి మ‌మ్మీ ఇప్ప‌టికీ బ‌తికే ఉంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి ఉండ‌దేమో..!

Comments

comments

Share this post

scroll to top