IPL లో ఆక‌ట్టుకున్న 20 ఏళ్ళ కుర్రోళ్ళు….

IPL-2018 లో చాలా వ‌రకు ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ త‌మ ఆట‌తో ఆక‌ట్టుకున్నారు. ఇక ఇండియ‌న్ యంగ్ టాలెంట్ మాత్రం త‌మ స‌త్తా చాటి….భ‌విష్య‌త్ ఇండియ‌న్ క్రికెట్ కు భ‌రోసానిచ్చింది.! ముఖ్యంగా ఈ 5 గురు ప్లేయ‌ర్స్ మాత్రం అద్భుత‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించారు. వీరంతా 20 ఏళ్ళ కుర్రాళ్ళు కావ‌డం విశేషం.!

రిష‌బ్ పంత్:

ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడిన రిష‌బ్ పంత్…. IPL-2018 లో ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ అండ్ స్టైలిష్ ప్రేయ‌ర్ గా రెండు అవార్డుల‌ను గెలుపొందాడు.! 14 మ్యాచెస్ లో 52.61. స‌గ‌టుతో 684 ప‌రుగులు చేసిన పంత్ ఇన్నింగ్స్ లో…. 68 ఫోర్స్, 37 సిక్సులుండ‌డం విశేషం. నెక్ట్స్ IPL లో పంత్ కు భారీ డిమాండ్ ఉండ‌డం ఖాయం.

  • కొన్న‌ది – DD
  • ఎంత‌కు-8 Crores

పృథ్వీ షా.

ఇండియ‌న్ అండ‌ర్ -19 కు కెప్టెన్ గా క‌ప్ ను సాధించిపెట్టిన పృథ్వీ షా…. ఈ IPL-2018 త‌న‌దైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. 9 మ్యాచ్స్ లో 245 ప‌రుగులు చేసిన పృథ్వీ ఇన్నింగ్స్ లో 2 హాప్ సెంచ‌రీలున్నాయి. 27 ఫోర్స్, 10 సిక్సులు బాదాడు ఈ యంగ్ ప్లేయ‌ర్.

  • కొన్న‌ది – DD
  • ఎంత‌కు- 1.2 Crores

 

మ‌యాంక్ మార్ఖండే.

రైట్ హ్యాండ్ లెగ్ బ్రేక్ బౌల‌రైన మ‌యాంక్ లేటెస్ట్ స్పిన్ సెన్సేష‌న‌ల్ అనే చెప్పాలి. ముంబాయి కి ఆడిన మ‌యాంక్ 14 మ్యాచెస్ లో 15 వికెట్స్ తీశాడు. దీనిలో ఒకే మ్యాచ్ లో 4 వికెట్స్ తీశాడు. IPL-2018 లో అత్య‌ధిక వికెట్స్ తీసిన బౌల‌ర్స్ లో మూడో స్థానంలో ఉన్నాడు.

  • కొన్న‌ది – MI
  • ఎంత‌కు- 20 Lakhs

 

శుభం గిల్ –
ఇండియ‌న్ అండ‌ర్ -19 టీమ్ కు చెందిన శుభం గిల్ ప్ర‌ద‌ర్శన కూడా ఆక‌ట్టుకుంది. మంచి టైమింగ్ తో అత‌ను ఆడిన చాలా షాట్స్ కు విమ‌ర్శ‌కుల ప్ర‌సంశ‌లు సైతం ద‌క్కాయి.13 మ్యాచెస్ లో 203 ప‌రుగులు చేసిన గిల్ ఇన్నింగ్స్ లో 22 fours , 5 సిక్సులున్నాయి.

 

  • కొన్న‌ది – KKR
  • ఎంత‌కు- 1.8 Crores

Comments

comments

Share this post

scroll to top