బిటెక్ లో 20 సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు సూసైడ్..! ఫ్రెండ్ కి చివరగా ఏమని మెసేజ్ చేసాడో తెలుసా.?

స‌మాజంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ఒక్కొక్క‌రికి ఒక్కో బాధ ఉంటుంది. నిజానికి ఇత‌రుల‌కు ఆ బాధ అంత పెద్ద‌గా అనిపించ‌దు. కానీ ఏదైనా త‌నంత దాకా వ‌స్తేనే గానీ తెలియ‌దు క‌దా. అలాగే.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేవారు కూడా త‌మ‌కున్న బాధ‌ను ఎవ‌రూ తీర్చ‌లేరు, ఇక జీవితం ముగించ‌డ‌మే మిగిలి ఉంది, అనుకుంటారు. అందులో భాగంగానే అన్నంత ప‌నీ చేస్తారు. కానీ కుటుంబ స‌భ్యులు ఏమైపోతారు, వారు ఎంత‌గా బాధ‌ప‌డుతారు అనే విష‌యాల్ని మాత్రం ప‌ట్టించుకోరు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కూడా ఇలాగే త‌న కుటుంబ స‌భ్యుల గురించి ఏ మాత్రం ఆలోచించ‌లేదు. వారికి తీర‌ని విషాదాన్ని మిగిల్చి కాన‌రాని లోకాల‌కు త‌ర‌లివెళ్లాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

మంచిర్యాల జిల్లా ఆర్కేపురం ప్రాంతానికి చెందిన విద్యార్థి కె.విక్రమ్‌(21) హైద‌రాబాద్‌ మీర్‌పేటలోని టీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈసీఈ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5వ తేదీన‌ రాత్రి పొద్దుపోయాక మీర్‌పేటలోని ఓ స్నేహితుడి గదిలో మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అనంతరం స్నేహితుడి బైక్‌ తీసుకుని మీర్‌పేటలోని మణికంఠనగర్‌ కాలనీలో నివసించే అజయ్‌ అనే స్నేహితుడి గదికి వెళ్లాడు. రాత్రి 3.20 గంటల ప్రాంతంలో ప్రశాంత్‌ అనే మరో స్నేహితుడి ఫోన్‌కు మెసేజ్ పెట్టాడు. ‘ఐ యామ్‌ గోయింగ్‌ టు డై రా మామా’ అంటూ మెసేజ్ చేశాడు.

త‌రువాత విక్ర‌మ్ మ‌ళ్లీ ఓ మెసేజ్ చేశాడు. తన బంగారు గొలుసు పోయిందని నాన్నకు అబద్ధం చెప్పానని, వాస్తవానికి దాన్ని తాకట్టు పెట్టానని, విడిపించి నాన్నకు అందజేయాలని స్నేహితున్ని కోరాడు. ఇక ఆ త‌రువాత త‌న ఫ్రెండ్ రూం ఉన్న భ‌వ‌నంలోని మూడో అంతస్థు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విక్ర‌మ్ నిజానికి చ‌దువుల్లో వెనుక‌బ‌డినందునే మ‌న‌స్థాపానికి లోనై ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు తెలిసింది. ఇంజినీరింగ్ ఫైన‌లియ‌ర్‌కు వ‌చ్చినా మొద‌టి సంవ‌త్స‌రం నుంచి బ్యాక్‌లాగ్స్ అలాగే ఉన్నాయి. మొత్తం నాలుగేళ్లు క‌లిపి అత‌ను 20 స‌బ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడ‌ట‌. వాటిని క్లియ‌ర్ చేయ‌లేక‌, ఓ వైపు పాఠాలు అర్థం కాక‌, మ‌రోవైపు విలాసాలు ఎక్కువై అత‌ను సూసైడ్ చేసుకున్నాడు. ఏది ఏమైనా ఇలాంటి విషాదం ఏ త‌ల్లీదండ్రికీ రాకూడ‌దు కదా..!

Comments

comments

Share this post

scroll to top