డాక్టర్ దేవుడుతో సమానం అంటారు.కోయబంత్తూర్కు చెందిన బాలసుబ్రమహ్మణ్యం అనే ఈ డాక్టర్ నిజంగా కామన్ మ్యాన్ కి దేవుడిగా నిలిచాడు.. పేదవారి కష్టాలను అర్థం చేసుకున్నాడు. కేవలం 20 రూపాయల నామమాత్రపు జీతం తీసుకొని పేదప్రజలకు వైద్యం అందించేవాడు. 2 రూపాయలకే వైద్యం ఆయన తొలినాళ్లలలో పేదల నుండి తీసుకున్న ఫీజు. పేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన బాలసుబ్రమహ్మణ్యం ఇకలేరన్న వార్త స్థానికులను విషాదాన్ని నింపింది.. 2 రూపాయల డాక్డర్, 20 రూపాయల డాక్టర్ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే ఆయన శుక్రవారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.
డా.సుబ్రమణ్యం మరణవార్త తెలియగానే స్థానికులు ఆయన పోస్టర్లు అతికించి కొవ్వొత్తులు, పుష్పగుఛ్చాలతో నివాళులర్పించారు.ఆయన మీదున్న ప్రేమతో కనీసం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టలేదు.
ప్రజల్లో ఇంత గొప్ప పేరు సంపాదించుకున్న ఆయనది ఓ పెద్ద కార్పోరేట్ ఆసుపత్రి అనుకుంటే పొరపాటే. కోయంబత్తూర్లోని రాజగణపతి నగర్లోని ఆవారుపాళెంల రోడ్డులో ఓ చిన్న క్లినిక్ మాత్రమే. పేదలకు నామమాత్రపు రుసుముతో అక్కడ వైద్యసేవలు అందేవి. దీంతో అవారుపాళెం, నేతాజీనగర్, అన్నానగర్ తదితర ప్రాంతాల నుంచి రోగులు ఆయన వద్దకు క్యూ కట్టెవారు. రూ.2 రుసుము నుంచి గత రెండేళ్లుగా రూ.20 నామమాత్రపు రుసుముతో ఆయన వైద్య సేవలు అందించేవారు. నిరుపేదలకు మందులు ఉచితంగా అందించడంతో పాటు ఫీజు నుంచి వారికి మినహాయింపు నిచ్చేవారు. ప్రస్తుతం ఆయన ఇకలేరన్న వార్తతో ఆ క్లినిక్ కూడా చిన్నబోయింది.
విలువలే ఆస్తి అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చెప్పండి?