రాజకీయ నాయకులకు ఓ పౌరుడి విన్నపం. న్యూ ఇయర్‌లో ఈ 20 నిర్ణయాలను మీరు తీసుకోండి..!

కొత్త సంవత్సరం వస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చాలా మంది న్యూ ఇయర్‌ వేడుకలను జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి తోడు న్యూ ఇయర్‌లో ఇది చేయాలి, అది చేయకూడదు అని నిర్ణయాలు తీసుకునేందుకు కూడా చాలా మంది రెడీ అవుతున్నారు. అలాంటి వారిలో కొందరు తమ నిర్ణయాలను పాటిస్తారు. కొందరు పాటించరు. పాటించని వారి విషయానికి వస్తే వారిలో రాజకీయ నాయకులే ఉంటారు. అయితే కనీసం ఈ ఏడాది అయినా.. ప్లీజ్‌.. నాయకులూ.. మీరు కొన్ని రిజల్యూషన్స్‌ తీసుకోండి. వాటిని పాటించండి. దాంతో జనాలకు కొంత అయినా మేలు జరుగుతుంది.. మరి మీరు తీసుకోవాల్సిన ఆ రిజల్యూషన్స్ ఏమిటో చూడండిక…

1. ఎవరిపై కూడా అసత్య ఆరోపణలు చేయకండి. మీకు తెలిస్తేనే జనాలకు చెప్పండి. తెలియకపోతే ఏదో ఒకటి మాట్లాడకండి. కామ్‌గా తప్పుకోండి.

2. పోలీసుల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పెంచండి. పోలీసులు, ప్రజల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. పోలీసులు ఉన్నది ప్రజల కోసమే అని చాటి చెప్పండి.

3. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించండి. దోషులకు కఠిన శిక్షలు పడేలా చేయండి. మహిళలను కించ పరిచే వ్యాఖ్యలు చేయకండి.

4. నెరవేర్చలేని వాగ్దానాలను ఎన్నికల్లో ప్రజలకు చేయకండి. నెరవేరుస్తాం అనుకుంటేనే వాగ్దానాలను చేయండి. తప్పుడు వాగ్దానాలను చేయకండి.

5. మత ఘర్షణలకు పురికొల్పకండి. జనాల మధ్య మతం పేరిట చిచ్చు పెట్టకండి.

6. సాంప్రదాయాలను బలవంతంగా జనాలపై రుద్దకండి. పాశ్చాత్య పోకడలు అంటూ జనాలను రెచ్చగొట్టకండి.

7. పండుగలు, ఉత్సవాలు, సాంప్రదాయ వేడుకలపై నిషేధం విధించకండి.

8. సినిమాలకు రాజకీయ రంగు పులమకండి. వాటిని సినిమాల్లాగే చూడండి.

9. జనాలపై అనవసరపు ట్యాక్సులు వేయకండి.

10. అక్రమాలకు పాల్పడకండి. ఇతర రాజకీయ నాయకులపై రుజువులు లేనిదే ఆరోపణలు చేయకండి.

11. అధికారం కోసం జనాల మధ్య చిచ్చు పెట్టకండి.

12. హిజ్రాలకు ఇతరులతో సమానంగా హక్కులు కల్పించండి.

13. మత పవిత్ర గ్రంథాలపై అనవసర వ్యాఖ్యలు చేయకండి.

14. మహిళల వస్త్రధారణపై కామెంట్లు చేయకండి.

15. పాత చింతకాయ పచ్చడి, మూఢాచారాలకు తిలోదకాలు ఇవ్వండి.

16. నేరస్తులను నేరస్తులుగానే చూడండి. వారిని మంచి వారిగా చిత్రీకరించకండి.

17. అవినీతికి పాల్పడకండి.

18. ప్రతి విషయాన్ని గుడ్డి ఫాలో అవ్వకండి. జనాలకు మంచి చెప్పండి.

19. యువత పెడదారి పడుతుందని అనకండి. మీరు మంచి మార్గంలో నడవండి.

20. వివాహాలు, పెళ్లికి ముందు సెక్స్‌ వంటి అంశాలపై తప్పుడు కామెంట్లు చేయకండి.

Comments

comments

Share this post

scroll to top