టాయిలెట్ సీట్స్ ఇలా కూడా ఉంటాయా..? ప్రపంచంలో ఉన్న ఈ 20 సీట్స్ చూస్తే నవ్వాపుకోలేరు..!

అవును నిజమే మరి. అందరిలా ఆలోచిస్తే అప్పుడు అందరికీ మనకు తేడా ఏముంటుంది ? మన క్రియేటివిటీ నలుగురికీ తెలియాలంటే దాన్ని ఏదో ఒక అంశంలో చూపించాల్సిందే. అది ఏం అయి ఉంటుందబ్బా..? ఆ.. ఎస్‌.. మనం నిత్యం వెళ్లే టాయిలెట్‌ అయితే బెటర్‌. ఎందుకంటే బహుశా వాటిని మరింత క్రియేటివ్‌గా ఎవరూ చేసి ఉండరు. ఇంకే ముందీ.. మనం చేద్దాం. మన క్రియేటివిటీ మొత్తాన్ని వాటి డిజైన్‌లో చూపిద్దాం… అని అనుకుని ఉంటారు వాళ్లు. అందుకే కింద ఇచ్చిన పలు టాయిలెట్లను అలా డిజైన్‌ చేశారు. చూస్తే నిజంగా అవి నవ్వు తెప్పిస్తాయి. మరి అలాంటి ఫన్నీ టాయిలెట్లపై ఓ లుక్కేద్దామా..!

watch video here:

1. చిన్న పిల్లలకు ఇలాంటి టాయిలెట్‌ అయితే బెటర్‌ ? ఏమంటారు !

2. ఇది టాయిలెటేనా ? లేకపోతే అలంకరణ వస్తువా ! అలా డిజైన్‌ చేశారు.

3. ఫ్యాక్షనిస్టుల ఇండ్లలో టాయిలెట్లు ఇలా ఉంటాయి కాబోలు.

4. అక్వేరియం పైన ఉంటే హాయిగా చేపలతో మనం కూడా టాయిలెట్‌ వెళ్లవచ్చు.

5. వీడికెవడికో పండ్లు అంటే తెగ ఇష్టం అనుకుంటా. అందుకే డిజైన్‌ అలా చేయించాడు.

6. ఊ.. ఫర్లేదు.. డిఫరెంట్‌ లైటింగ్‌ ఉండాలంటే.. ఆ మాత్రం చేయాల్సిందే.

7. మీరు మరీనూ.. టాయిలెట్లను ఇలా కూడా డిజైన్‌ చేస్తారా..!

8. పై దానికి కాపీ. కాకపోతే దీన్ని చూసి భయపడకండి. ముఖ్యంగా రాత్రుళ్లు.

9. ఎంత డబ్బుంటే మాత్రం మరీ బంగారంతో టాయిలెటా ? తప్పు కదా !

10. వీడి క్రియేటివిటీ తగలెయ్య. మరీ క్రిస్మస్‌ తాత డిజైన్‌తో టాయిలెటా ?

11. ఊగుతూ ఎవరైనా టాయిలెట్‌కు వెళ్తారా ? మరీ చోద్యం కాకపోతే !

12. అవును మరి, పెద్ద సీటు ఉన్నవారికి ఆ మాత్రం పెద్ద టాయిలెట్‌ ఉండాల్సిందే.

13. టాయిలెట్‌లో ఎంత వాసన వస్తే మాత్రం దాన్ని బొమ్మ రూపంలో వేయాలా ?

14. ఎస్‌.. టాయిలెట్‌ ఇలా ఉంటే ఆఫీస్‌ వర్క్‌ నిమిషాల్లో పూర్తవుతుంది.

15. మీ క్రియేటివిటీ తగలెయ్య. మరీ ఈ డిజైన్‌ ఏంట్రా బాబూ !

16. ఇలా ఉంటే ఇక 24 గంటలు గేమింగ్‌ ప్రియులు పండగ చేసుకుంటారు.

17. పైనే చెప్పాం కదా, డబ్బుందని చెప్పి ఖరీదైన వస్తువులతో ఎవరైనా టాయిలెట్‌ కట్టిస్తారా !

18. వీడెవడో హ్యారీ పోటర్‌ ఫ్యాన్‌ అయి ఉంటాడు. అందుకే ఆ సెటప్‌లో టాయిలెట్‌ను డిజైన్‌ చేయించాడు.

19. ఎస్‌… మనిషై పుట్టిన వాడు ఎవడైనా కచ్చితంగా టాయిలెట్‌కు వెళ్లాల్సిందే. దాన్నే సింబాలిక్‌గా చెప్పారు.

20. ఎంత సంగీతం అంటే ఇష్టం ఉంటే మాత్రం.. మరీ టాయిలెట్‌ కూడా అదే డిజైన్‌లో కావాలా ?

Comments

comments

Share this post

scroll to top