2వేల ఏళ్ల నాటి పుస్త‌కంలో జీస‌స్ అస‌లైన బొమ్మ ఉంద‌ట‌. అది ఇదే తెలుసా..?

చ‌రిత్ర అంటే.. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు తెలిసింది చాలా త‌క్కువే అని చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు తెలియ‌ని చ‌రిత్ర, విశేషాలు ఇంకా ఎన్నో ఈ భూమిపై, విశ్వంలో ఉన్నాయి. ఆయా రంగాల‌కు చెందిన నిపుణులు మ‌న‌కు తెలియ‌ని కొత్త విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు క‌నిపెట్టి చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా చ‌రిత్ర విష‌యానికి వ‌స్తే మ‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక విష‌యం తెలుస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది, అదీ జీస‌స్ గురించి. సుమారు 2వేల ఏళ్ల నాటి పుస్త‌కాల ద్వారా జీస‌స్‌కు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను నిపుణులు గుర్తించారు. అవేమిటంటే…

జోర్డాన్ అనే దేశంలో ఈ మ‌ధ్యే 70 పుస్త‌కాలు పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌ల‌కు దొరికాయి. వాటిల్లో ఉన్న ఓ పుస్త‌కం మాత్రం సుమారు 2వేల ఏళ్ల నాటిద‌ట‌. సీసం, ఇత‌ర ప‌దార్థాలు క‌లిపి రేకుల్లా ఉండే కాగితాల‌తో త‌యారు చేసిన ఆ పుస్త‌కం క్రెడిట్‌కార్డు సైజులో ఉంది. స్పైర‌ల్ బైండింగ్ బుక్‌లా దాన్ని త‌యారు చేశారు. ఆ పుస్త‌కంలోని రేకు కాగితాల‌పై ప‌లు ప‌దాలు, అక్ష‌రాలు, బొమ్మ‌లు, చిహ్నాలు ఉన్నాయి. వాటిని శోధించిన నిపుణులు ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జీసస్ ఇప్పటి వ‌ర‌కు ఓ క్రిస్టియ‌న్ అని చెబుతూ వ‌చ్చారు కానీ ఆయ‌న క్రిస్టియ‌న్ కాద‌ట‌. యూదు తెగ‌కు చెందినవాడ‌ట‌. సుమారుగా 1000 సంవ‌త్స‌రాల నాటి నుంచి మ‌రుగున ప‌డిన యూదు సంస్కృతిని తిరిగి పున‌రుద్ధ‌రించే ప‌నికి పూనుకున్నాడ‌ట‌. ఆ స‌మ‌యంలో డేవిడ్ అనే రాజు ప‌రిపాలిస్తున్న‌ట్టు పైన తెలిపిన ఆ పుస్త‌కంలో ఉంది. ఇక జీస‌స్ అంటే మ‌గ దేవుడు అని అంద‌రూ భావించారు కానీ అలా కాద‌ట‌. జీస‌స్ స్త్రీ, పురుషులు ఇద్ద‌రినీ ప్ర‌తిబింబిస్తాడ‌ట‌. ఇద్ద‌రి అంశ‌లు ఆయ‌న‌లో ఉన్నాయ‌ట‌.

స‌ద‌రు పురాత‌న పుస్త‌కంలో జీస‌స్ బొమ్మ అస్ప‌ష్టంగా ఉంద‌ని నిపుణులు తేల్చారు. అది పైన బొమ్మే. అందులో జీస‌స్ నిజమైన బొమ్మ ఉంద‌ట‌.

ఈ పుస్త‌కం 2వేల ఏళ్ల నాటిద‌ని సైంటిస్టులు ప‌క్కాగా చెబుతున్నారు. అందులో రాయ‌బ‌డి ఉన్న కొన్ని ప‌దాలు, అక్ష‌రాలు పాలియో, హిబ్రూ అనే భాష‌ల్లో ఉన్నాయ‌ని చెబుతున్నారు. అయితే ఇదంతా వట్టిదే అని కొంద‌రు అంటుండ‌డం విశేషం..!

Comments

comments

Share this post

scroll to top