2.0 మూవీ ..రివ్యూ రేటింగ్..?

AP2TG Staff

Movie (చిత్రం): 2.0

Story:

మొబైల్ ఫోన్స్ మీద శంకర్ ఈ సినిమా ని రూపు దిద్దిన తీరు అమోఘం, అక్షయ్ కుమార్ ని ఎదిరించడానికి చిట్టి ని రంగం లోకి దింపుతాడు వసీకర్, కానీ చిట్టి అక్షయ్ కుమార్ ముందు నిలువ లేక పోతాడు, దాంతో బ్యాడ్ చిట్టి తిరిగి వస్తాడు , అక్కడినుంచి అసలైన సినిమా మొదలవుతుంది. అక్షయ్ కుమార్ విలన్ గా మారడానికి అసలు కారణం ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు, క్లైమాక్స్ లో బ్యాడ్ చిట్టి, అక్షయ్ కుమార్ మధ్యలో ఫైట్ జరుగుతుంది. అసలు బ్యాడ్ చిట్టి మంచిగా ఎలా మారాడు? అక్షయ్ కుమార్ విలన్ గా మారడానికి కారణం ఏంటి? చివరికి ఎవరు గెలిచారు అనేది సినిమా కథ.

Cast & Crew (న‌టీన‌టులు): రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్:

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సినిమాటోగ్రఫీ: నిరవ్ షా

నిర్మాతలు: సుభాస్కరన్

దర్శకత్వం: శంకర్

Plus Points: సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్, 3D ఎఫెక్ట్స్, VFX, నేపధ్య సంగీతం, సెకండ్ హాఫ్

Minus Points: పెద్దగా ఏమి లేవు.

Final Verdict: 2017 లో బాహుబలి-2, 2018 లో 2.0

Rating: 3.75/5

ఇత‌ర అంశాలు:

అక్షయ్ కుమార్ నటన అమోఘం, ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ లో అతని నటన అద్భుతం. రజినీకాంత్ DR.వసీకర్, చిట్టి పాత్రల్లో నటించినా, జనాలకు గుర్తుండిపోయేది మాత్రం బ్యాడ్ చిట్టి పాత్ర నే, బ్యాడ్ చిట్టి క్యారెక్టర్ రాక తో ఒక్క సారిగా మూవీ గ్రాఫ్ ఆలా పైకి వెళ్ళిపోయింది, ఆ తరువాత ఎక్కడ తగ్గలేదు మూవీ, ఈ సినిమాని శంకర్ మలిచిన తీరు, వేగ వంతమైన స్క్రీన్ ప్లే, రెహమాన్ నేపధ్య సంగీతం అదుర్స్ అంతే, అమీ జాక్సన్ నటన కూడా బాగుంది. గ్రాఫిక్స్ గురుంచి ముఖ్యంగా చెప్పుకోవాలి, 3D లో ఈ సినిమా ను చూస్తూ ఉంటె ఈ సినిమాను నిజంగానే 500 కోట్లతో ఎలా తియ్యగలిగారు అనిపించింది. ఎందుకంటే హాలీవుడ్ లో ఇలా మొత్తం 3D లో చేయాలి అంటే కనీసం 2000 కోట్లు ఖర్చు పెడతారు, కానీ శంకర్ 500 కోట్లతో తీయగలిగాడు అంటే చాలా గ్రేట్. మొత్తం మీదుగా 2.0 చిత్రాన్ని 3D లో తప్పక చూడండి, ఎందుకంటె 3D లో ఈ సినిమా ఇచ్చే అనుభూతే వేరు. దీర్ఘ కాలం ఈ సినిమా పలు రికార్డు లను తిరగ రాయడం పక్కా. ప్రపంచ దేశాలకు మరో సారి భారతీయ సినిమా సత్తా ఏంటో ఈ సినిమా ద్వారా తెలుస్తుంది.

 

Comments

comments