అయిదవ తరగతి చదివినోడికే ABCD లు రావట్లేదు బాబోయ్ అంటూ మన దగ్గర సర్వేలు చెబుతుంటే..పట్టుమని రెండేళ్ళు లేని ఈ కుర్రాడు ఇంగ్లీష్ పదాలను టపీటపీ మని చదువుతున్నాడు. ఇప్పటి వరకు మనోడు 300 ఆంగ్ల పదాలను నేర్చేసుకున్నాడు . 1 నుండి 50 వరకు అంకెలను ఫటాఫట్ లెక్కేట్టేస్తాడు . ఇప్పుడు ఈ వండర్ బాయ్ వీడియో సోషల్ మీడియాలో హుద్ హుద్ చేస్తోంది. ఈ వండర్ బాయ్ పేరు కార్టర్. అమెరికాకు చెందిన వాడు. కార్టర్ 7 నెలల వయస్సునుండే అక్షరాలను గుర్తుపట్టడం స్టార్ట్ చేశాడంట.
పిల్లాడి మెమెరీ గురించి తెలుసుకున్న కార్టర్ తల్లి..ష్లాష్ కార్డులను తీసుకొచ్చి ఒకసారి చదివి వినిపించిందంట..మమ్మీ చదివిన దానిని ఇట్టే గుర్తుపట్టిన కార్టర్ …తర్వాత అతనే ప్లాష్ కార్డ్ లను చూస్తూ చదవడం స్టార్ట్ చేశాడు. ఇతడు ఇదే మాదిరిగా చదివితే కలెక్టర్ కొలువు సింపుల్ గా కొట్టేయడు..All The Best Wonder Kid.
Watch Video: