ప్ర‌పంచంలో మీకు తెలియ‌ని 19 ఆస‌క్తిక‌ర‌మైన ఫ్యాక్ట్స్ ఇవే..!

నిత్య జీవితంలో మ‌నం ఎన్నో వ‌స్తువుల‌ను చూస్తుంటాం. ఎన్నో సంఘ‌ట‌న‌లు కూడా మ‌న‌కు జ‌రుగుతుంటాయి. కానీ కేవ‌లం కొన్ని మాత్ర‌మే మ‌న దృష్టిని ఆక‌ర్షిస్తాయి. ఇక కొన్నింటి గురించైతే మ‌నం ప‌ట్టించుకోం. కానీ నిజానికి వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలే గానీ మ‌న‌కు అనేక విషయాలు తెలుస్తాయి. అవి వ‌స్తువులు కావ‌చ్చు, జంతువులు కావ‌చ్చు, వ్యక్తులు లేదా ఇతర ఏ అంశాలైనా కావ‌చ్చు. ప‌రిశీలిస్తే మ‌న‌కు అనేక కొత్త విష‌యాలు తెలుస్తాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

1. మ‌నుషుల్లో ఎడ‌మ‌, కుడి చేతి వాటం ఉంటుంది క‌దా. అలాగే పిల్లుల్లోనూ ఎడ‌మ‌, కుడి చేతి వాటం ఉన్న పిల్లులు ఉంటాయట‌. ఇక ఎక్కువ‌గా ఆడ పిల్లులు కుడి చేతి వాటం క‌ల‌వి అయి ఉంటాయ‌ట‌. అలాగే పిల్లులు ఆడుకున్నా, ఆహారం తిన్నా ఒకే చేత్తో తింటాయ‌ని, ఎప్పుడూ ఒకే చేతిని వాడుతాయ‌ని బెల్‌ఫాస్ట్ కు చెందిన క్వీన్స్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.

2. మ‌న‌కు ఇప్పుడు ల‌భిస్తున్న పుచ్చ‌కాయ‌ల్లో లోప‌లి భాగం కూడా గుండ్రంగా ఉంటుంది క‌దా. కానీ 500 ఏళ్ల కింద‌ట పుచ్చ‌కాయ‌ల లోప‌లి భాగం వేరే ఆకారంలో ఉండేది. కావాలంటే 17వ శ‌తాబ్దానికి చెందిన పెయింటింగ్‌ను చిత్రంలో చూడ‌వ‌చ్చు. దాని ఆధారంగానే ఒక‌ప్పుడు పుచ్చ‌కాయ‌ల లోప‌లి భాగం ఆ ఆకారంలో ఉండేద‌ని మ‌న‌కు తెలుస్తుంది.

3. మీకు సాలెపురుగులు అంటే బాగా భ‌య‌మా. అయితే మీకు త్వ‌ర‌గా అవి తార‌స ప‌డ‌తాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ప‌లువురు ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నారు. సాలె పురుగులు అంటే భ‌యం ఉన్న‌వారికి అవి త్వ‌ర‌గా క‌నిపించి ఇబ్బందుల‌కు గురి చేస్తాయ‌ట‌.

4. సూర్యుడు మండుతున్న అగ్ని గోళంలా ఉంటాడ‌ని మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్నాం క‌దా. మండుతున్న గోళం, ఆరెంజ్ రంగులో మ‌న‌కు క‌నిపిస్తాడ‌ని మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు న‌మ్ముతూ వ‌చ్చాం. కానీ నిజానికి సూర్యుడు తెలుపు రంగులో ఉంటాడ‌ట‌. కాక‌పోతే మ‌నం చాలా దూరం నుంచి సూర్యున్ని చూస్తాం కనుక అన్ని వాతావ‌ర‌ణాల నుంచి దాటుకుని చూసే స‌రికి సూర్యుడు మ‌న‌కు అలా ఆరెంజ్ క‌ల‌ర్‌లో మండుతున్న అగ్ని గోళంలా క‌నిపిస్తాడు.

5. జీడిపప్పును ఇంగ్లిష్‌లో క్యాషూ అని పిలుస్తాం క‌దా. అయితే క్యాషూ యాపిల్స్ కూడా ఉంటాయి. కానీ అవేవో యాపిల్స్‌లో ఇంకో ర‌కం అనుకునేరు. కాదు. క్యాషూ యాపిల్స్ అంటే.. జీడిప‌ప్పు కాసే కాయ‌లే. వాటినే ఇంగ్లిష్ లో క్యాషూ యాపిల్స్ అని పిలుస్తారు.

6. మ‌నుషులు గుర‌క పెట్టిన‌ట్టే పిల్లులు కూడా అప్పుడ‌ప్పుడు గుర‌క పెడ‌తాయ‌ట‌. నాలుక మొద‌టి భాగం, పుర్రె ఆధారం మ‌ధ్య‌లో ఉండే ఓ భాగం నుంచి గుర‌క వ‌స్తుంద‌ట‌.

7. మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు వ‌జ్రాలే రేటు క‌ల్ల‌వి అనుకుంటూ వ‌స్తున్నాం క‌దా. కానీ అది కాదు. నిజానికి వ‌జ్రాల క‌న్నా విలువైన‌వి నీల మ‌ణులు. వాటి ఖ‌రీదు వ‌జ్రాల క‌న్నా రెట్టింపు ఉంటుంద‌ట‌.

8. పిల్లి శ‌రీరంలో మొత్తం 240 ఎముక‌లు ఉంటాయి. వాటిల్లో 23 ఎముక‌లు (అంటే 10 శాతం) దాని తోక‌లోనే ఉంటాయి.

9. దోమ‌ల‌ను చంపేందుకు మ‌నం మ‌స్కిటో రిపెల్లెంట్స్‌ను వాడుతాం క‌దా. వాటితో దోమ‌లు చ‌నిపోతాయ‌ని మ‌నం భావిస్తాం. కానీ అది నిజం కాదు. ఎందుకంటే మ‌స్కిటో రిపెల్లెంట్స్ వ‌ల్ల మ‌నం దోమ‌ల‌కు క‌నిపించం. దీనికి తోడు వాటిల్లో ఉండే కెమిక‌ల్స్ దోమ‌ల‌ను దాక్కునేలా చేస్తాయి. అంతేకానీ మ‌స్కిటో రీపెల్లెంట్స్ కు దోమ‌లను చంపే శ‌క్తి మాత్రం లేదు.

10. భూమి గ‌డియారం ముల్లు తిరిగే దిశ‌లో తిరుగుతుంది. కానీ శుక్ర‌, కుజ గ్ర‌హాలు మాత్రం అందుకు వ్య‌తిరేక‌మైన దిశ‌లో తిరుగుతుంటాయి.

11. అమెరికాలో ఆ దేశ క‌రెన్సీ డాల‌ర్ల‌ను 1861లో ముద్రించ‌డం మొద‌లు పెట్టారు. కానీ అంత‌కు ముందే అంటే.. 1778లోనే డాల‌ర్ క‌రెన్సీ సింబ‌ల్ ను వాడడం మొద‌లు పెట్టారు.

12. ఇంగ్లండ్‌లో 18 వ శ‌తాబ్దం వ‌ర‌కు అంటే.. సుమారుగా 600 ఏళ్ల పాటు ఆ దేశ భాష‌గా ఫ్రెంచి ఉండేది. కానీ త‌రువాత మార్పు చేశారు. అయితే గ్రేట్ బ్రిట‌న్‌కు చెందిన కోట్ ఆఫ్ ఆర్మ్స్‌పై గాడ్ అండ్ మై రైట్ అనే అక్ష‌రాలు ఫ్రెంచి భాష‌లో ఉంటాయి. ఇదే అందుకు సాక్ష్యం.

13. ఏవియేట‌ర్ స‌న్ గ్లాసెస్‌ను ఇప్పుడు ఎవ‌రు ప‌డితే వారు వాడుతున్నారు కానీ నిజానికి వాటిని మొద‌టి సారిగా 1942లో మిల‌ట‌రీ సిబ్బంది కోసం త‌యారు చేశారు. అమెరికాలో రెండో ప్ర‌పంచ యుద్ధం సంద‌ర్భంగా ప‌లువురు ఆర్మీ పైల‌ట్ల కోసం వాటిని తయారు చేశారు.

14. మేఘాలు చాలా నెమ్మ‌దిగా క‌దులుతాయ‌ని మ‌నం అనుకుంటాం. కానీ అవి నిజానికి గంట‌కు 95 మైళ్ల నుంచి 125 మైళ్ల‌కు పైగా వేగంతో ప్ర‌యాణిస్తాయ‌ట తెలుసా..!

15. మ‌నం మెళ‌కువ‌తో ఉన్న‌ప్పుడు ముక్కుల్లో వ‌చ్చే ఇరిటేష‌న్ కార‌ణంగా మ‌న‌కు తుమ్ములు వ‌స్తాయి. కానీ నిద్ర‌పోయేటప్పుడు మాత్రం అస‌లు తుమ్ములు రావ‌ట‌.

16. విష‌పూరిత‌మైన సాలె పురుగులు, పాములు, తేనె టీగ‌లకు ఆస్ట్రేలియా నిల‌యంగా ఉంది. ఆ దేశంలో ఏటా తేనెటీగలు కుట్ట‌డం వ‌ల్ల ఎంత మంది చ‌నిపోతున్నారో ఆ సంఖ్య పాములు కుట్ట‌డం వ‌ల్ల చ‌నిపోతున్న వారికి స‌మాన‌మ‌ట‌.

17. హైతీ, Liechtenstein అనే రెండు దేశాల‌కు చెందిన జెండాలు ఒకేలా ఉంటాయి. ఈ తేడాను 1936లో క‌నిపెట్టారు. త‌రువాత 1937లో Liechtenstein దేశం త‌మ జెండాలో ఒక కిరీటాన్ని యాడ్ చేసింది.

18. జురాసిక్ పార్క్ సినిమాలు చూశారు క‌దా. వాటిల్లో డైనోసార్లు బాగా వేగంగా గంట‌కు 35 నుంచి 45 మైళ్ల వేగంతో ప‌రిగెత్తుతాయని చూశాం క‌దా. అది నిజం కాదు. అవి సుమారుగా 7 ట‌న్నుల బ‌రువుంటాయ‌ట‌. క‌నుక అవి గంట‌కు కేవ‌లం 12 నుంచి 16 మైళ్ల వేగంతో మాత్ర‌మే ప‌రిగెత్తుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

19. రోమ‌న్ చక్ర‌వ‌ర్తి క‌లిగులా అస‌లు పేరు Gaius Caesar. Legionnaire uniform ను ధ‌రించ‌డం వ‌ల్ల అత‌నికి ఆ పేరు వ‌చ్చింది.

 

Comments

comments

Share this post

scroll to top