రోజువారీ రాశిఫలాలు 19-02-2019

మేషం :

కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. చేస్తున్న ఉద్యోగం నుంచి ఉన్నతోద్యోగానికి చేరుకోవచ్చు. పత్రిక, ప్రవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థినులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది.

వృషభం :

ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది.

మిథునం :

గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యూహాలతో క్లిష్టమైన పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఎంతో కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.

కర్కాటకం :

బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. హోటల్. తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యం, వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు యోగదాయకం.

సింహం :

ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. కొత్త వ్యూహాలతో క్లిష్టమైన పనులు పూర్తిచేస్తారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. మీలోని సృజనాత్మకతను వెలికితీయండి. ఇతరులను ఒప్పించి మీకు కావలసిన పనిని చేయించుకునే నేర్పును కలిగి ఉంటారు.

కన్య :

నూతన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. కుటుంబానికి సంబంధించిన ప్రతి పని మీరే స్వయంగా చేసుకోవడం మంచిది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కొంచెం ఓర్పును ప్రదర్శిస్తే ఎన్నో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తుల :

ఆర్థిక సమస్యలన్నీ స్నేహితుల సహాయం ద్వారా తీరిపోతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షలలో మెళకువ అవసరం. బ్యాంకు రంగాలలోని వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. భార్య, భర్తల మధ్య బంధం బలంగా మారుతుంది. తల్లిదండ్రులలో ఒకరికి అనారోగ్య సమస్య తలెత్తవచ్చు.

వృశ్చికం :

ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషాన్ని ఇస్తుంది. గతంలో చేజారిన పత్రాలు చేతికందుతాయి. చిరకాల ప్రత్యర్ధలు మిత్రులుగా మారుతారు. కొత్త రుణాలు అందుతాయి. వ్యాపారంలో భాగస్వామ్యం పొందవచ్చు. స్త్రీలకు మానసిక, శారీరక ఒత్తిడులకు లోనవుతారు.

ధనుస్సు :

ఉపాధ్యాయులకు అధికారుల అండదండలు మెండుగా ఉంటాయి. ఆదాయం రావడం ఎలాగ ఉన్నా ఖర్చులు మాత్రం తగ్గవు. మిత్రులు చేసిన చెడు పనులకు మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అయినా తెలియని ఉత్సాహం ధైర్యం ప్రదర్శిస్తారు. రుణాల కోసం అన్వేషిస్తారు. చేపట్టిన పనులు పూర్తికావు.

మకరం :

ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్ధంగా నిర్వహిస్తారు. సోదరులతో అభిప్రాయ బేధాలు ఏర్పడతాయి. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. ఇంజనీరింగ్ రంగాల వారికి విశ్రాంతి, ప్లీడర్లకు పురోభివృద్ధి, వైద్యులకు సంతృప్తి కానవస్తుంది. క్రీడ, కళా, సాంస్కృతిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.

కుంభం :

బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరోలోచన మంచిది. ఉపాధ్యాయులకు పరస్పర అవగాహన లోపం వంటివి ఎదుర్కుంటారు. వస్త్రములు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. క్రయ విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరప్రయాణాలలో చికాకులు తప్పవు.

మీనం :

స్త్రీలు ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. విద్యార్థులకు విదేశాలకు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.మీ వ్యవహార జ్ఞానానికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు.

 

Comments

comments

Share this post

scroll to top