23వ GST కౌన్సిల్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. వస్తు ధరలపై పన్నును తగ్గించింది. GST వల్ల నిత్యావసర ధరలు పెరిగాయన్న విమర్శలతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారధ్యంలోని సమావేశం ఊహించని డిసిషన్ తీసుకుంది. ప్రస్తుతం 28శాతం పన్ను స్లాబ్ లో 227 వస్తువులు ఉన్నాయి. వీటిలో 177 నిత్యావసర వస్తువులను 18శాతం స్లాబ్ లోకి తీసుకొచ్చింది. అంటే ఆయా వస్తువులపై పన్ను భారం 10శాతం తగ్గింది. అంటే కేవలం 50వస్తువులు మాత్రం ఇక 28శాతం స్లాబ్ లో ఉండనున్నాయి

18శాతానికి తగ్గిన వస్తువులు ఇవే :
చాక్లెట్లు, చూయింగ్ గమ్స్, టూత్ పేస్ట్ లు, షాంపూలు, సెంటు బాటిల్స్, షేవింగ్ క్రీములు, ఫేవింగ్ లోషన్స్, వాషింగ్ పౌడర్స్, బట్టల సబ్బులు, మేకప్ ఐటమ్స్, గ్రానైట్ ఇలా 177 నిత్యావసర వస్తువులపై పన్నును 10శాతం తగ్గించారు. 28శాతం పన్ను స్లాబ్ లో ఉన్న నిత్యావసరాలకు సంబంధించిన ప్రతి వస్తువులు అన్నింటినీ కూడా 18శాతం పరిధిలోకి తీసుకొచ్చారు.

28శాతం స్లాబ్ లో 50 వస్తువులే :
సవరించిన GSTతో కేవలం 50 వస్తువులు మాత్రమే 28శాతం పన్ను పరిధిలో ఉన్నాయి. వీటిలో సిగరెట్లు, పాన్ మసాలాలు, ఇతర టుబాకో ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. విలాసవంతమైన వాటిని మాత్రమే ఈ పన్ను స్లాబ్ లో ఉంచారు.
20వేల కోట్ల భారం :
177 నిత్యావసర వస్తువుల పన్ను స్లాబ్ ను సవరించటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి 20వేల కోట్ల నష్టంగా అంచనా వేస్తున్నారు.