17 నెలల చిన్నారి చ‌నిపోయినా ఆమె క‌ళ్లు మాత్రం ఈ ప్ర‌పంచాన్ని చూస్తూనే ఉన్నాయి..!

మ‌నిషి బ‌త‌క‌లేక‌పోయినా అత‌ని క‌ళ్లు మాత్రం ఈ ప్ర‌పంచాన్ని 100 ఏళ్ల పాటు చూస్తాయి. అందుకే క‌దా నేత్ర‌దానం చేయాల‌ని చెబుతారు. అప్పుడు ఓ వ్య‌క్తి క‌ళ్లు ఏకంగా ఇద్ద‌రికి చూపును ప్ర‌సాదిస్తాయి. అవును క‌రెక్టే. అలా ఆలోచించారు కాబ‌ట్టే ఆ త‌ల్లిదండ్రులు గొప్ప ప‌ని చేశారు. ఓ వైపు త‌మ 17 నెల‌ల చిన్నారి మృతి చెంది తీవ్ర‌మైన విషాదంలో ఉన్నా నేత్ర‌దానం చేయ‌డం మ‌రువ‌లేదు. దీంతో వారి చ‌లువ వ‌ల్ల మ‌రో ఇద్ద‌రికి చూపు వ‌చ్చింది. గుండెల్ని పిండేసే ఈ ఘ‌ట‌న జ‌రిగింది మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో.


మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని బ‌ర్వాని అనే ప్రాంతంలో నివాసం ఉండే అమిత్‌, అంజ‌లి శ‌ర్మల ఒక్క‌గానొక్క గారాల పట్టి అరోహి శ‌ర్మ‌. ఆ పాప వ‌య‌స్సు కేవ‌లం 17 నెల‌లు మాత్ర‌మే. నిండా రెండేళ్లు కూడా నిండ‌ని ఆ చిన్నారి పుట్టుక‌తోనే గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోంది. ఎప్పుడు చ‌నిపోతుందో తెలియ‌దు. దీంతో అమిత్‌, అంజ‌లిలు అరోహిని అత్యంత ప్రేమ‌గా, గారాబంగా పెంచుకుంటూ వ‌చ్చారు. అయితే తానొకటి త‌లిస్తే దైవ‌మొకటి త‌ల‌చింద‌న్న చందంగా, కొంత కాలం త‌మ మ‌ధ్య అల్లారుముద్దుగా పెరుగుతుంద‌నుకున్న అరోహి ఒక్క‌సారిగా చ‌నిపోయింది. ఈ  నెల 12వ తేదీన ఆ పాప గుండె వ్యాధితో తీర‌ని లోకాల‌కు వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెల‌కొంది.


అయితే అరోహి త‌ల్లిదండ్రులు అమిత్‌, అంజ‌లిలు మాత్రం అంత‌టి తీవ్ర‌మైన విషాదంలోనూ ఓ గొప్ప కార్యం చేశారు. త‌మ పాప నేత్రాల‌ను దానం చేశారు. దీంతో మ‌రో ఇద్ద‌రికి చూపు వ‌చ్చింది. స్వ‌త‌హాగా అమిత్ డాక్ట‌ర్ కావ‌డంతో త‌న స్నేహితుల‌తో మాట్లాడి ఆ ప‌ని చేశాడు. దీంతో అరోహి నేత్రాల‌ను ఇచ్చిన అత్యంత చిన్న వ‌య‌స్కురాలుగా పేరు గాంచింది. ఓ వైపు కూతురు చ‌నిపోయి దుఃఖంతో ఉన్నా ఆ తల్లిదండ్రులు చేసిన ప‌నికి వారిని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ఏది ఏమైనా అమిత్‌, అంజలిల‌కు ఈ విష‌యంలో హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చూశారుగా… నేత్ర‌దానం ఎంత గొప్ప పని చేసిందో… క‌నుక ప్ర‌తి ఒక్క‌రు త‌మ క‌ళ్ల‌ను దానం చేస్తే వారు చ‌నిపోయాక కూడా అవి ఈ ప్ర‌పంచాన్ని చూస్తాయి. మ‌రో ఇద్ద‌రికి చూపును ప్ర‌సాదిస్తాయి..!

Comments

comments

Share this post

scroll to top