16 ఏళ్ల బాలికపై 15 మంది మృగాళ్లు పాశ‌వికంగా అత్యాచారం చేశారు. షాకింగ్ ఘ‌ట‌న‌..

స‌మాజంలో క్రూర మృగాలు పెరిగిపోయాయి. వాటికి అడ్డు, అదుపూ ఉండ‌డం లేదు. మ‌హిళ‌లు క‌న‌బ‌డితే చాలు రెచ్చిపోతున్నాయి. వారిపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నాయి. వాటికి క‌న్నూ మిన్నూ క‌నిపించ‌దు. వావి, వ‌రుస, చిన్న‌, పెద్ద అనే తేడాలు ఉండ‌వు. పాశ‌వికంగా దాడి చేయ‌డ‌మే ప‌ని. అదే కోవ‌లో తాజాగా 15 మంది మృగాళ్లు 16 ఏళ్ల బాలిక‌పై అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. ఆమె ఎంత బ‌తిమాలినా వారు వినిపించుకోలేదు. దీంతో ఇప్పుడా బాధితురాలు ప‌డుతున్న వేద‌న అంతా ఇంతా కాదు.

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పిన‌పాక మండ‌లంలో ఈ నెల 11వ తేదీన స్థానికంగా ఉండే ఓ బాలిక (16) త‌న పుట్టిన రోజు కావ‌డంతో చాక్లెట్లు కొనుక్కునేందుకు ఇంటి ద‌గ్గ‌ర్లో ఉన్న ఓ కిరాణా షాపుకు వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా దారిలో అమరారం గ్రామానికి చెందిన కిరణ్, వినోద్, నవీన్, భరత్, కుంజా ఏసు అనే వ్య‌క్తులు ఆ బాలిక‌ను పిలిచారు. వారు త‌న‌తో గ‌తంలో ప‌ని చేసిన కూలీలు కావ‌డంతో వారు పిల‌వ‌గానే వారి వ‌ద్ద‌కు ఆమె వెళ్లింది. ఈ క్ర‌మంలో వారు ఆమెతో మాట్లాడుతున్న‌ట్లు న‌టించి వెంట‌నే ఆమెను బ‌ల‌వంతంగా ఆటోలో ఎక్కించుకుని అక్కినపల్లి మల్లారం శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై పాశవికంగా అత్యారానికి పాల్పడ్డారు.

కాగా ఆ మృగాళ్ల‌తో జ‌రిగిన పెనుగులాటలో ఆ బాలిక స్పృహ కోల్పోవడంతో నిందితులు తమ స్నేహితులకి ఫోన్ చేశారు. దీంతో వారి స్నేహితులు కూడా వ‌చ్చి మ‌ళ్లీ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా మొత్తం 14 మంది బాధితురాల్ని హింసించి అఘాయిత్యం చేశారు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అమరారంలో ఉన్న మన్యం సమ్మిరెడ్డి అనే వ్య‌క్తి ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. అప్పటికే భయభ్రాంతులకి గురైన బాలికను బెదిరించి సమ్మిరెడ్డి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీంతో మరుసటి రోజు బాధితురాలు సమ్మిరెడ్డి నుంచి తప్పించుకుని బస్‌లో జయశంకర్‌ జిల్లా వాజేడు మండలంలోని సోదరుడి ఇంటికి వెళ్లింది. అప్పటికే ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం వెతికి చివరికి తన సోదరుడి ఇంట్లో ఉందని గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆ బాలిక‌ను ఆమె త‌ల్లిదండ్రులు ఇంటికి తీసుకురాగా బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకి వివరించింది. దీంతో ఆ బాలిక‌ తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా కొంత మంది మధ్యవర్తులు నిందితుల నుంచి రూ.5 లక్షలు ఇప్పిస్తామని రాజీ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రతిపాదనని తిరస్కరించిన బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు 14 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నాడని అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి మృగాళ్ల‌ను మాత్రం స‌మ‌జాంలో అలా స్వేచ్ఛ‌గా వ‌దిలేయ‌కూడ‌దు. క‌ఠినంగా శిక్షించాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top