మేకప్ లేకుండా ఈ 15 మంది తెలుగు హీరోయిన్స్ ఎలా ఉన్నారో చూడండి..! అస్సలు గుర్తుపట్టలేరు అనుకుంట.!

ఏం తింటారో కానీ ఇంతందంగా,నాజూగ్గా ఉంటారు అనుకోకుండా ఉండలేం సినిమా హీరోయిన్లను చూస్తే..కాకపోతే అది కూడా మేకప్ తీసేంతవరకే..మేకప్ తీసేస్తే..వాయ్యో వారి కంటే మనమే నయం కదా అనుకుంటాం..నిజమేనండీ మేకప్ లేకుండా హీరోయిన్ ని చూస్తే మన కళ్లని మనమే నమ్మలేం.కానీ కొందరు మేకప్ వేస్తే చాలా అసహ్యంగా ఉంటారు ముఖ్యంగా ఫిదా సాయిపల్లవిలా..మేకప్ లేకుండా ప్రేమమ్,ఫిదాల్లో నటించిన సాయిపల్లవి అందానికి,ముటిమలకు ఎందరో ప్యాన్స్ అయ్యారు..కానీ మేకప్ వేసుకుంటే మాత్రం అందరూ ఛీ అన్నారు. .అంత మ్యాజిక్ ఉంది మేకప్లో.కానీ కొందరు హీరోయిన్ల సినిమా ప్రపంచానికి వచ్చేసరికి అందం అంటే మేకప్..మేకప్ అంటే అందం అంతే..నమ్మట్లేదా..కావాలంటే ఈ కింది ఫోటోలను చూడండి ఖచ్చితంగా నమ్ముతారు..

భూమిక

పవన్ కళ్యాణ్ చిత్రం ఖుషీ గుర్తుండే ఉంటుంది కదూ. ఆ సినిమాలో భూమిక ను మర్చిపోవటం సాధ్యం కాదు. అయితే ఆమె తెరపై ఎంత అందంగా ఉంటుందో .. మేకప్ లేకుండా బయిట కనిపించినప్పుడు కూడా అంతకన్నా ఎక్కువగానే మెరుస్తుంటుంది. కానీ యోగా గురువు భరత్ ఠాకూర్ తో పెళ్లి తర్వాత భూమిక అందంలో మార్పొచ్చిందనే చెప్పాలి..వయసు మీద పడుతున్న కొద్ది ముఖంలో  మార్పులు తప్పవనుకోండి.

నయనతార

నయనతారని మేకప్ లేకుండా చూడలేం..అదేంటో సినిమాల్లో రాను రాను వయసు తగ్గుతూ అందం పెరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది నయన్..కానీ వితవుట్ మేకప్ మాత్రం నయన్ ని చూడాలంటే మన నయనాలు కష్టపడాల్సిందే.

ప్రియమణి

పెళ్లైన కొత్తలో సినిమా తర్వాత వరుస ఆఫర్లు కొట్టేసిన ప్రియమణి..ఇప్పుడు కనుమరుగయింది.మేకప్ తీసేస్తే గుర్తుపట్టడం కొంచెం కష్టమే అన్నట్టుగా ఉంటుంది ప్రియమణి.

యామీ గౌతమ్

మేకప్ లేకపోతేనే యామి గౌతమి చాలా బాగుంటుందని ఆమె తో పనిచేసిన వారందరూ చెప్తూంటారు. అంతెందుకు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ అయితే మేకప్ లేని యామీ ఎంత ముచ్చటగా ఉంటుందో అంటూ మురిసిపోతూ చెప్పాడు.

అంజలి

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సీతమ్మగా అదరకొట్టిన అంజలి ఆ తర్వాత గీతాంజలి అంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా అద్బుతం అనిపించింది. ఆమె మేకప్ లేకుండా ఎలా ఉంటుందో పై ఫొటోలో చూసారు కదా…

ఛార్మీ

జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత ఛార్మి తెరమీద కనిపించలేదు.. పూరి తో కలిసి ఆమె కాస్టింగ్ ఏజన్సీ పనుల్లో బిజీగా ఉంటోంది. అయితే తెలుగు సిని రంగంలో ఆమెదో ప్రత్యేకమైన ముద్ర. ఆమె మేకప్ లేకుండా కూడా మిళమిళా మెరిసిపోతోంది. .

అమలాపాల్

భర్తతో విడాకుల విషయమై అన్ని భాషల మీడియాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన అమలా పాల్ …నిజ జీవితంలో ఎలా ఉంటుంది. మేకప్ లేకుండా ఆమె అంత అందంగా ఉంటుందా..అంటే ఇదిగో ఇదే సమాధానం.

జెనీలియా

హ హ హాసినిగా అదరకొట్టిన జెనిలియా తొమ్మిదేండ్ల ప్రేమకి చెక్ పెడుతూ పెళ్లిచేసుకుంది.రితేష్ ని  పెళ్లిచేసుకుని ఇద్దరి బిడ్డలకు తల్లి అయిన జెనీలియా…ఇదిగో మేకప్ లేకుండా ఇలా ఉంటుంది. రితీష్ కి ఇలాగే నచ్చి ప్రేమలో పడి  పెళ్లిచేసుకున్నాడు మరి.

ఐశ్వర్యరాయ్

మేకప్ లేకుండా ఐశ్వర్యరాయ్ ని చూడడం జరగని పని.. ఆమె మేకప్ లేకుండా ఉన్న ఫొటో ఇదిగో మీరు ఇక్కడ చూడవచ్చు. అఫ్ కోర్స్ ఆమె మేకప్ లేకపోయినా బాగుంటుందనుకోండి.

సోనాలి బింద్రే

ఇంద్ర సినిమాలో చిరంజీవి సరసన, మురారిలో మహేష్ సరసన అదరకొట్టిన సోనాలి బింద్రే గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెను మేకప్ లేకుండా చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది. మీరు హర్టయ్యారు కదూ. కానీ ఏం చేస్తా..మేకప్ లేకపోతే అమ్మగారు ఇదే రూపు మరి.

గోపిక

నా ఆటోగ్రాఫ్..స్వీట్ మెమరీస్ చిత్రంతో అందరి మనస్సులను దోచుకున్న గోపిక, ఆ తర్వాత తెలుగులో పెద్దగా చెయ్యలేదు. తన మాతృభాష మళయాళంలో సినిమాలు చేసి, తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఆమె మేకప్ లేనప్పుడు ఇలా ఉంటుంది.

రంభ,టబు,కాజల్ సమంత ఇలా అనేకమందిని మేకప్ లేకుండా చూస్తే చాలామంది హార్ట్ కోర్ ఫ్యాన్స్ గుండెలు బద్దలవుతాయి..కొందరైతే పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉంటారు హీరోయిన్లు..అంతే మేకప్ మాయ…మరే రంగుల ప్రపంచం అని ఊరికే అన్నారా..

Comments

comments

Share this post

scroll to top