యూపీలో ఇద్ద‌రు బాలిక‌ల‌ను 14 మంది యువ‌కులు ప‌ట్ట ప‌గ‌టి పూట వేధించి వీడియో తీశారు..!

అది నిర్మానుష్య ప్రాంతం. జ‌న సంచారం దాదాపుగా లేద‌నే చెప్ప‌వ‌చ్చు. ప‌ట్ట ప‌గ‌లు అవుతోంది. ఇద్ద‌రు బాలిక‌లు ఆ ప్రాంతంలో ఉన్న తోవ‌లో న‌డుచుకుంటూ వెళ్తున్నారు. ఇంత‌లో వెనుకాల నుంచి కొంద‌రు యువ‌కుల గుంపు వ‌చ్చింది. మొత్తం 14 మంది ఉంటారు. ఇంకేముందీ.. మంచి అవ‌కాశం దొరికింది అన్న‌ట్టుగా వారు ఆ బాలిక‌ల‌ను ఏడిపించ‌డం మొద‌లు పెట్టారు. అది తారాస్థాయికి చేరుకుంది. మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి, అని వారు ప్రాధేయ‌ప‌డ్డారు. అయినా ఆ యువ‌కులు విన‌లేదు. చివ‌ర‌కు ఎలాగో ఆ ఇద్ద‌రు బాలిక‌లు వారి నుంచి త‌ప్పించుకున్నారు. ఇది క‌థ కాదు, నిజంగా జ‌రిగిన ఘ‌ట‌న‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లా అది. అక్క‌డి కువ‌ఖేర అనే గ్రామంలో ప‌ట్ట ప‌గ‌టి పూట ఇద్ద‌రు బాలిక‌లు న‌డుచుకుంటూ వెళ్తున్నారు. జ‌న సంచారం అస్స‌లు లేని ప్రాంత‌మది. ఇంత‌లో షాన‌వాజ్ అనే ఓ యువ‌కుడు త‌న తోటి స్నేహితులు మ‌రో 13 మందితో క‌ల‌సి అక్క‌డికి వ‌చ్చాడు. న‌డుచుకుంటూ వెళ్తున్న ఆ బాలిక‌ల‌ను వారు చూశారు. ఇంకేముంది, వారిలో ఉన్న మృగాళ్లు రెచ్చిపోయారు. న‌డుచుకుంటూ వెళ్తున్న ఆ బాలిక‌ల చున్నీలు లాగారు. అనంత‌రం వారిని ఎత్తుకుని వేధించారు. వ‌ద‌లిపెట్టండ‌ని వేడుకున్నా వారు విన‌లేదు. అయితే చివ‌ర‌కు ఎలాగో ఆ బాలిక‌లు త‌ప్పించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఆ యువకులు అలా చేస్తున్న‌ప్పుడు వారిలోనే ఓ యువ‌కుడు ఆ దృశ్యాల‌ను త‌న సెల్‌ఫోన్‌లో బంధించి వాటిని ఇంట‌ర్నెట్‌లో పెట్టాడు. దీంతో ఆ సంఘ‌ట‌న గురించి ఆల‌స్యంగా తెలిసింది. స‌మాచారం తెలిసిన పోలీసులు వెంట‌నే ఆ 14 మందిపై కేసు న‌మోదు చేశారు. మొత్తం అంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ సంఘ‌టన యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. ప‌ట్ట ప‌గ‌లే ప‌బ్లిగ్గా అమ్మాయిల‌ను అలా వేధిస్తుంటే ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని అంద‌రూ విమ‌ర్శిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలోనే అధికారంలోకి వ‌చ్చిన యోగి స‌ర్కారు మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం నారి సుర‌క్షా బ‌ల్ పేరిట వుమెన్స్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతుండ‌డంతో స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి… ఈ ఘ‌ట‌న‌ను యూపీ ప్ర‌భుత్వం సీరియస్‌గా తీసుకుంటుందా, లేదా చూడాలిక‌..!

Comments

comments

Share this post

scroll to top