మన దేశంలో బాగా ఫేమ‌స్ అయిన ఈ 14 ఫుడ్స్ నిజానికి మ‌న ద‌గ్గ‌రివి కావు తెలుసా..?

మ‌న దేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో అనేక ర‌కాల వంట‌కాలు మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు హైద‌రాబాద్‌లో బిర్యానీ మ‌న‌కు ఫేమ‌స్‌గా ల‌భిస్తే కాశ్మీర్ వైపు రాజ్మా దొరుకుతుంది. అలాగే దేశ వ్యాప్తంగా అనేక ప్ర‌ముఖ డిషెస్ మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫేమ‌స్ డిష్‌ల‌లో కొన్ని నిజానికి మ‌న దేశంలో పుట్టిన‌వి కావు. ఎక్క‌డో వేరే దేశాల్లో మొద‌ట అవి ల‌భ్య‌మ‌య్యాయి. ఆ త‌రువాత అవి మ‌న ద‌గ్గ‌ర ఫేమ‌స్ అయ్యాయి. మ‌రి మ‌న దేశంలో ఫేమ‌స్ అయిన ఇత‌ర దేశాల‌కు చెందిన ఆ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. స‌మోసా
మ‌నం ఎంతో ఇష్టంగా తినే స‌మోసా మ‌న ద‌గ్గ‌ర మొద‌ట త‌యారు కాబ‌డ‌లేదు తెలుసా..? ముందుగా దీన్ని మ‌ధ్య తూర్పు దేశాల వారు వండారు. అది కూడా 13, 14 శ‌తాబ్దాల్లో. ఆ త‌రువాత అది నెమ్మ‌దిగా ఆసియా దేశాల‌కు విస్త‌రించింది. అయితే అప్ప‌ట్లో స‌మోసాను సంబోసా (sambosa) అని పిలిచే వారు.

2. బిర్యానీ
బిర్యానీకి ఫేమ‌స్ హైద‌రాబాద్‌. కానీ ఇది పుట్టింది మ‌న ద‌గ్గ‌ర కాదు. ద‌క్షిణ ఆసియా దేశాల్లో. ప‌ర్షియా దేశంలో దీన్ని మొద‌ట త‌యారు చేశారు. త‌రువాత మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు ఈ వంట‌కాన్ని మ‌న‌కు పరిచ‌యం చేశారు.

3. గులాబ్ జామున్
ఇది కూడా ప‌ర్షియా దేశానికి చెందిన వంట‌క‌మే. మ‌న ద‌గ్గ‌ర ఫేమ‌స్ అయింది. ప‌ర్షియ‌న్ భాష‌లో గోల్ అంటే పువ్వు, అబ్ అంటే నీరు అని అర్థాలు వ‌స్తాయి. అందుక‌నే గులాబ్ జామున్ అని ఈ వంట‌కానికి పేరు వ‌చ్చింది. అంటే గులాబీ పువ్వు నీటిలా ఈ వంట‌కం రుచిని క‌లిగి ఉంటుంద‌ని అర్థం.

4. చాయ్
టీ కూడా మ‌న ద‌గ్గ‌ర పుట్టింది కాదు. చైనా నుంచి మ‌న‌కు వ్యాప్తి చెందింది. డ‌చ్ వారు దీన్ని ఇండియాకు తెచ్చారు. 1600 వ సంవ‌త్స‌రం నుంచి మ‌న దేశంలో టీని తాగ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌రువాత 1830ల‌లో బ్రిటిష్ వారు చైనా టీ తాగ‌డం ఏంటి అని భావించి మ‌న దేశంలోనే టీ తోట‌ల‌ను పెట్టారు. దాంతో టీ మ‌న ద‌గ్గ‌ర పాపుల‌ర్ అయింది.

5. Dal Bhat
ఈ వంట‌కం నేపాల్ వాసుల‌ది. అక్కడి నుంచి ఇండియాకు వ్యాప్తి చెందింది.

6. చికెన్ టిక్కా మ‌సాలా
మ‌నం ఎంతో ఇష్టంగా తినే చికెన్ టిక్కా మ‌సాలా మ‌న ద‌గ్గ‌ర పుట్టింది కాదు. స్కాట్లాండ్‌లోని గ్లాస్‌గోలో ఇది పుట్టింది. దాన్ని అక్క‌డ వేరే పేరుతో పిలుస్తారు.

7. రాజ్మా
మ‌నం ఇష్టంగా తినే మ‌రో వంట‌క‌మైన రాజ్మా మ‌న ద‌గ్గ‌ర పుట్ట‌లేదు. ఈ డిష్ మెక్సికో వాసుల‌ది. అక్క‌డి నుంచి ఇత‌ర దేశాల‌కు వ్యాప్తి చెందింది.

8. Bandel Cheese
ఇది పోర్చుగీసు వారి డిష్. దీన్ని వారు ఇండియాకు ప‌రిచయం చేశారు. నిమ్మ‌ర‌సం, పెరుగుల‌ను ఉప‌యోగించి దీన్ని త‌యారు చేస్తారు. మ‌న దేశంలో ఎక్కువగా కోల్‌క‌తాలో దీన్ని త‌యారు చేస్తారు.

9. నాన్‌
నాన్ రోటీ కూడా ఇక్క‌డిది కాదు. ప‌ర్షియాలో పుట్టింది. దీన్ని మొగ‌ల‌లు మ‌న దేశానికి పరిచ‌యం చేశారు. 2500 సంవ‌త్స‌రాలకు పూర్వం నుంచి నాన్ రోటీల‌ను మ‌న ద‌గ్గ‌ర త‌యారు చేస్తున్నారు.

10. Shukto
దీన్ని కాక‌ర‌కాయ‌తో త‌యారు చేస్తారు. దీన్ని కూడా పోర్చుగీసు వారే ఇండియాకు ప‌రిచ‌యం చేశారు. కాక‌ర‌కాయ ఉన్న‌ప్ప‌టికీ ఈ వంట‌కం తీపిగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో పాలు, చ‌క్కెర‌, మ‌సాలాలు వేసి వండుతారు కాబ‌ట్టి.

11. జిలేబీ
మ‌న దేశంలో ర‌ద్దీగా ఉండే ఏ రోడ్డు చూసినా అక్క‌డ ఒక జిలేబీ బండి క‌నిపిస్తుంది. అయితే నిజానికి ఇది పుట్టింది ప‌ర్షియాలో. మొగ‌ల్స్ దీన్ని మ‌న‌కు ప‌రిచ‌యం చేశారు.

12. ఫిల్ట‌ర్ కాఫీ
ఫిల్ట‌ర్ కాఫీ మొద‌ట పుట్టింది మ‌క్కాలో. 16వ శ‌తాబ్దంలో క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ వ్య‌క్తి మ‌క్కాకు వెళ్లాడ‌ట‌. దీంతో అత‌ను ఆ టేస్ట్‌ను ఇక్క‌డ పరిచ‌యం చేశాడు.

13. ఫ‌లూదా
వేస‌వి వ‌స్తే చాలా మంది దీన్ని తాగుతారు. కానీ అన్ని కాలాల్లోనూ మ‌న‌కు ఇది దొరుకుతుంది. మ‌రి ఫ‌లూదా అసలు ఎక్క‌డ పుట్టిందో తెలుసా..? ఇది కూడా ప‌ర్షియాలోనే.

14. Vindaloo
ఈ వంట‌కాన్ని వైన్‌, వెల్లుల్లి, ఆలుగ‌డ్డ‌ల‌తో వండుతారు. దీన్ని పోర్చుగీసు వారు మ‌న‌కు ప‌రిచ‌యం చేశారు.

 

Comments

comments

Share this post

scroll to top