13-03-2019 రోజువారీ రాశిఫలాలు!!

మేషం :

ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఆలయాలను సందర్శిస్తారు.

వృషభం :

కోళ్ళు, మత్స్య, పాడి పరిశ్రమ, గొఱ్ఱెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి కానవచ్చు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ప్రయాణాలలో మెళకువ అవసరం.

మిథునం :

కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అవగాహన లోపం, చిన్న చిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఫైనాన్సు వ్యాపారాలు మొండి బాకీల మీద దృష్టి ఉంచండి.

కర్కాటకం :

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, ఆల్కహాల్ వ్యాపారస్తులకు ఆశాజనకం. స్త్రీలు దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

సింహం :

రాజకీయనాయకులు తరచూ సభా సమావేశాల్లో పాల్గొంటారు. దూరప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. బంధుమిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి వస్తుంది. క్రీడ, కళా రంగాల్లో వారికి సంతృప్తి కానరాదు. విదేశాలకు వెళ్లటానికి చేయు యత్నాలు వాయిదా పడతాయి.

కన్య :

ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు సదవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కిలిగిస్తుంది. స్త్రీలు కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు.

తుల :

ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. ఆరోగ్య వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ సంతానంతో కలిసి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురికాకండి. మీరు ఓ స్నేహితునితో కలిసి లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషి చేస్తారు.

వృశ్చికం :

బంధుమిత్రుల రాకపోవడం వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. కిరాణా, ఫ్యాన్సీ, మందుల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలోను, దూరప్రయాణాల్లో మెళకువ వహించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం.

ధనుస్సు :

హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. ఏదైనా అమ్మటానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. ఎదుటివారిని తక్కువగా అంచనా వేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.

మకరం :

స్త్రీలకు, వస్త్రాలు, అలంకరణ, విలాస వస్తువుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. కుటుంబీకుల కోసం నూతన పథకాలు వేస్తారు. మిఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

కుంభం :

వృత్తి, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తొడ్పడతాయి. మీ ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మీనం :

ఆర్థిక విషయాలలో సంతృప్తి కానవస్తుంది. ప్రేమికుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ప్రోత్సాహం, పురోభివృద్ధి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.

Comments

comments

Share this post

scroll to top