ఖాళీ క‌డుపుతో….ఈ పండ్ల‌ను తిని 122 మంది చిన్న‌పిల్ల‌లు చ‌నిపోయారు.!!

క్రిమి సంహార‌క మందుల‌ను వాడి పండించిన పండ్లు, కూర‌గాయ‌ల‌ను తింటే మ‌న ఆరోగ్యానికి ఎంత‌టి హాని క‌లుగుతుందో అంద‌రికీ తెలిసిందే. అందుకే వైద్యులు చెబుతుంటారు, పండ్లు, కూర‌గాయ‌లను బాగా క‌డిగాకే తినాల‌ని అంటారు. అయినా చాలా మంది ఈ శ్ర‌ద్ధ‌ను పాటించ‌రు. దీంతో అనారోగ్యాల బారిన ప‌డుతుంటారు. అయితే ఆ ప్రాంతానికి చెందిన కొంద‌రు పిల్ల‌లు కూడా ఈ పండ్ల‌ను తిన్నారు. కానీ వారు అనారోగ్యాల బారిన ప‌డ‌డం కాదు, ఏకంగా ప్రాణాల‌నే కోల్పోయారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ర‌సాయ‌నాలు వాడి పండించిన పండ్ల‌ను తిని ఏకంగా 122 మంది పిల్ల‌లు చ‌నిపోయారు. అదెలాగంటే…

బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పుర్ ప్రాంతం అది. అక్క‌డ 2014 వ‌ర‌కు ఏటా వంద‌ల మంది చిన్నారులు విచిత్ర‌మైన వ్యాధి కార‌ణంగా మృత్యువు బారిన ప‌డుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో అనుమానం వ‌చ్చిన ప‌లువురు అమెరికా, ఇండియా సైంటిస్టులు స‌ద‌రు పిల్ల‌ల‌కు సోకుతున్న వ్యాధిని గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. అస‌లు అది ఎందుకు వ‌స్తుందో తెలుసుకున్నారు. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) సైంటిస్టులు ఒకే లాంటి వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న మొత్తం 390 మంది పిల్ల‌ల‌ను ల్యాబ్‌ల‌లో టెస్ట్‌లు చేశారు. అయితే వారిలో దుర‌దృష్ట‌వ‌శాత్తూ 122 మంది మృతి చెందారు. కానీ అంద‌రిలోనూ ఒకే లాంటి వ్యాధి ల‌క్ష‌ణాలుండ‌డం వ‌ల్ల వారు ప‌రిశోధ‌న‌లు చేయ‌గా తెలిసిందేమిటంటే… వారికి హైపోగ్లైసీమిక్ ఎన్సెఫాలోప‌తీ అనే ఓ ర‌క‌మైన న‌రాల సంబంధ వ్యాధి సోకింద‌ని అందుకే ఫిట్స్ వ‌చ్చి చ‌నిపోతున్నార‌ని గుర్తించారు.

అయితే ఆ పిల్ల‌లంద‌రిలోనూ ఆ వ్యాధి ఎందుకు వ‌చ్చిందో కూడా వారు తెలుసుకున్నారు. వారు రోజూ సాయంత్రం పూట తిండి మానేసి అదే ఖాళీ క‌డుపుతో మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే లిచి పండ్ల‌ను బాగా తిన్నార‌ట‌. దీంతో స‌హ‌జంగానే వారి శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ తక్కువ‌గా ఉండ‌డం, ఖాళీ క‌డుపుతో ఆ పండ్ల‌ను తిన‌డంతో వాటిలో ఉండే మిథైలీన్ సైక్లోప్రొపైల్ గ్లైసీన్ (ఎంసీపీజీ), హైపోగ్లైసీన్ ఎ అనే ప‌లు ర‌సాయ‌నాలు వారిలో హైపోగ్లైసీమిక్ ఎన్సెఫాలోప‌తీ వ్యాధిని క‌లిగించాయ‌ట‌. దీంతో వారికి అక‌స్మాత్తుగా ఫిట్స్ వ‌చ్చి చ‌నిపోయార‌ట‌. త‌గినంత ఆహారం దొర‌క్క‌పోవ‌డం, స్థానికంగా లిచి పండ్లు ఎక్కువ‌గా ల‌భించ‌డంతో అక్క‌డి పిల్ల‌లు వాటిని తిన‌డం అల‌వాటు చేసుకున్నారు. అలా తినీ తినీ కొంద‌రు చ‌నిపోగా, మ‌రికొంద‌రు ఇప్ప‌టికీ ఫిట్స్ తో, ఇత‌ర నాడీ సంబంధ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారని ప‌రిశోధ‌న‌లు చేసిన సైంటిస్టులు చెప్పారు. అయితే ఇది గ‌తంలో మాట‌. కానీ తాజాగా తెలిసిన విష‌యం ఏమిటంటే… అస‌లు ఆ పండ్ల వ‌ల్ల ఆ పిల్ల‌లు చ‌నిపోలేద‌ట‌. వాటికి వాడిన క్రిమి సంహార‌క మందుల వ‌ల్ల ఆ పిల్ల‌లు చ‌నిపోయార‌ట‌.

ఆ పిల్ల‌లు ఎక్కువ‌గా లిచి తోట‌ల‌కు వెళ్లి అక్క‌డే చెట్ల కింద ప‌డిన లిచి పండ్ల‌ను ఏరుకుని వాటిని శుభ్రం చేయ‌కుండా, క‌డ‌గ‌కుండా అలాగే తిన్నార‌ట‌. దీంతో మెద‌డు డ్యామేజ్ అయి వారికి పైన చెప్పిన వ్యాధి సోకి మ‌ర‌ణించార‌ని తాజాగా సైంటిస్టులు చెప్పారు. ఆ పిల్ల‌ల మృతికి ఆ పండ్లు తిన‌డం కార‌ణం కాద‌ని, వాటిని సేఫ్‌గా తిన‌వ‌చ్చ‌ని, వారి మృతికి ఆ పండ్ల‌పై ఉన్న క్రిమిసంహార‌క మందులే కార‌ణమ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. చూశారుగా..! ఇక‌పై మీరు కూడా ఏ పండు తిన్నా, కూర‌గాయ‌ను తిన్నా శుభ్రంగా క‌డిగాకే తినండి. లేదంటే తెలుసు క‌దా, అనారోగ్యాల బారిన ప‌డతారు. అది ప్రాణాల మీద‌కు కూడా తేవ‌చ్చు, క‌నుక జాగ్ర‌త్త‌..!

Comments

comments

Share this post

scroll to top