ఉదయం…గుడి దగ్గర టూరిస్టులకు గైడ్, రాత్రి స్కూల్ లో చదువు…12 యేళ్ళ అమ్మాయి రియల్ స్టోరి.!

అందరిలాగా స్కూల్ కు వెళ్లాలని, చదువుకోవాలని ఆ 12 యేళ్ల రూపాలికి కూడా  ఉంది. కానీ ఏం చేస్తాం పరిస్థితులు అందరికీ సహకరించవు కదా..!!  కఠిన పేదరికం, జబ్బుతో మంచాన పడ్డ తండ్రి, ఒక్కతే రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లి…ఇక చదువెట్టా సాగేదీ…? ఇన్ని ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ తనకిష్టమైన చదువు కోసం సరికొత్త ఆలోచనతో ముందుకు కదిలింది ఆ పన్నెండేళ్ల పాప….తనకొచ్చిన ఐడియాతో తన చదువునే కాదు, కుటుంబ బాధ్యతను కూడా భుజానికెత్తుకొని అందరి చేత ప్రశంసలు పొందుతుంది.

 రాజస్థాన్ లోని మౌంట్ అబూ దగ్గర ఉండే రూపాలి…  ఉదయం 8 కాగానే చక్కగా స్నానం చేసి…నీట్ గా రెడీ అయ్యి తన ఊరినుండి 11 కిలో మీటర్లు దూరంలో ఉండే అలగర్ దేవాలయం దగ్గరికి వెళుతుంది. ఈ గుడి అక్కడ చాలా ఫేమస్ చాలా మంది టూరిస్టులు ఈ గుడిని చూడడానికి వస్తుంటారు. అదిగో సరిగ్గా అలాంటి వారి దగ్గరికే వెళుతుంది ఈ పాప… గుడిచరిత్రను, ఆ గుడిని కట్టించిన రాజుల చరిత్రను.. దాని పుట్టు పూర్వత్రాలన్నీ టకటకా చెప్పేస్తుంది. చిన్న కథలను కలిపి చాలా అందంగా తన చిట్టి చిట్టి మాటలతో బుల్లి గైడ్ గా చాలామంది  టూరిస్ట్ లను ఆకట్టుకుంది ఈ పాప. అలా ఉదయం పూట అక్కడ గైడ్ గా పనిచేస్తూ, వచ్చిన డబ్బులతో తన కుటుంబానికి అండగా నిలబడుతూనే,  తనకిష్టమైన చదువును రాత్రి పూట నడిపే స్కూల్ లో కొనసాగిస్తుంది. మరో విషయం ఏంటంటే ఈ  రూపాలి ఆ స్కూల్ లో టాపర్.
10426807_838513736278347_2621420763167251090_n
గైడ్ గా తన కెరీర్ స్టార్ట్ చేసే ముందు రూపాలీ పెద్ద కసరత్తే చేసింది. ఆ గుడి చరిత్ర తెలుసుకోవడం కోసం..ఆ ఊరి పెద్దల ఇంటికి వెళ్లి వారిని బతిలాడి మరీ అడిగి తెలుసుకునేది…. పురాణాలు తెలిసిన వారి దగ్గరికి వెళ్లి  ఈ గుళ్లోని దేవతలకు పురాణాలలోని కథలకు లింక్ తెలుసుకునేది..ఇలా  ఆ గుడికి , గుడి కట్టించిన రాజులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తన బుర్రలో పెట్టుకుంది చిన్నారి రూపాలి.
తన ఈడు పిల్లలందరూ చదువుకుంటూ, ఆటపాటలతో సరదాగా సంతోషాలతో గడుపుతుంటే ఆ చిన్నారి మాత్రం ఒకవైపు చదువు, మరోవైపు గైడ్ గా కష్టపడుతూ  ఆదర్శంగా నిలుస్తోంది.

Comments

comments

Share this post

scroll to top