17 ఏళ్ల అమ్మాయిని త‌ల్లిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి…. అత్యంత వ‌య‌స్సులో తండ్రి అయిన ర్యాంక్ లో వీడిది 3 వ స్థానం.

నిజ‌మే మ‌రి. కాలం మారుతుంది క‌దా..! అర‌చేతిలో ప్ర‌పంచాన్ని చూపే వ‌స్తువులు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. ఇంకేముందీ..! అలాంట‌ప్పుడు మ‌నం ఊహించ‌ని వింత‌లు, విడ్డూరాలు ఎన్నో జ‌రుగుతుంటాయి మ‌రి. వాటిని తెలుసుకోక తప్ప‌దు. ఇంత‌కీ… అస‌లు ఏం జ‌రిగింద‌నేగా మీ డౌట్‌..! ఏమీ లేదండీ… కేర‌ళ‌లో 12 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ఓ బాలుడు 17 ఏళ్ల బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేశాడు. అవును, ముందే చెప్పాం క‌దా. ఎన్నో వింత‌లు, విడ్డూరాలు జ‌రుగుతుంటాయ‌ని. ఇది కూడా ఓ వింతే..!

కేర‌ళ‌లో 12 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ఓ బాలుడు త‌మ ఇంటి పక్క‌నే నివాసం ఉండే 17 ఏళ్ల బాలిక‌తో కొంత కాలంగా చ‌నువుగా ఉంటున్నాడు. అయితే వారిద్దరి మ‌ధ్య ఆ చ‌నువు ప్రేమ‌గా మారింది. ప్రేమ అనే కంటే అది ఆ వ‌య‌స్సులో క‌లిగే అట్రాక్ష‌న్ అనుకోవ‌చ్చు. అయితే వారు అంత‌టితో ఆగ‌లేదు. తొంద‌ర ప‌డ్డారు. దీంతో ఆ బాలిక కాస్తా గ‌ర్భం దాల్చింది. అయితే ఇటీవలే ఆ బాలిక‌ను ఆమె తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా, ఆ బాలిక‌కు కూతురు పుట్టింది. దీంతో ఒక్క‌సారిగా ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిసింది.

ఈ క్ర‌మంలో పోలీసులు విష‌యం తెలుసుకుని ఆ బాలుడిపై కేసు న‌మోదు చేశారు. అయితే ఆ బాలుడు ఏమ‌న్నాడో తెలుసా..? ఆ బాలిక‌, తాను ప‌క్క ప‌క్క‌నే ఉంటామ‌ని, ఆమె ఇష్ట ప్ర‌కార‌మే అలా చేశాన‌ని చెప్పాడు. అయితే పోలీసులు మాత్రం విన‌లేదు. బాలున్ని అదుపులోకి తీసుకుని జువైన‌ల్ హోంకు త‌ర‌లించారు. ఆ బాలిక‌కు పుట్టిన బిడ్డ‌ను చైల్డ్ వెల్ఫేర్ అధికారుల‌కు అప్ప‌గించారు. POCSO Act ప్ర‌కారం బాలుడిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు చెబుతున్నారు. ఆ బిడ్డ డీఎన్ఏ, ఆ బాలుడి డీఎన్ఏల‌ను పోల్చి అప్పుడు ఆ బాలుడే ఆ బిడ్డ‌కు తండ్రి అవునా, కాదా అన్న‌ది తేలుస్తామ‌ని, ఆ త‌రువాతే ఆ బాలుడిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆ బాలుడు మాత్రం మ‌న దేశంలో అత్యంత పిన్న వ‌య‌స్కుడైన తండ్రిగా రికార్డు సాధించాడు. అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇత‌ను 3వ స్థానంలో ఉంటాడు. న్యూజిలాండ్‌కు చెందిన ఓ 11 ఏళ్ల బాలుడు అలా తండ్రి అయి మొద‌టి స్థానంలో ఉండ‌గా, బ్రిట‌న్‌కు చెందిన 12 ఏళ్లు బాలుడు రెండో స్థానంలో నిలిచాడు. అత‌ని త‌రువాతే పైన చెప్పిన బాలుడు అలా చిన్న వ‌య‌స్సులో తండ్రి కావ‌డం గ‌మ‌నార్హం..!

Comments

comments

Share this post

scroll to top