సక్సెస్ అయిన వారు..ఆఫీస్ లో చివరి 10 నిమిషాలు ఏం చేస్తారో తెలుసా.? ఫాలో అవ్వాల్సిన 12 సలహాలు

గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌. మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌. పెప్సీ ఇండియా సీఈవో ఇంద్రా నూయి. వీరే కాదు, ఇంకా చాలా మంది స‌క్సెస్ పీపుల్ ఉన్నారు. చెప్పుకోవాలంటే వీరి గురించి చాలానే మ్యాట‌ర్ ఉంటుంది. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోతుంది వీరి జీవితం గురించి కాదు. ఇలాంటి వారు రోజూ ప‌నిలో ఆఖ‌రి 10 నిమిషాల్లో ఏం చేస్తారో తెలుసా..? ఆ ఏముందీ… ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా..? సాయంత్రం ఏం చేద్దాం, ఏం తిందాం..? అని ఆలోచిస్తారు, అంతే క‌దా..! అనుకుంటే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే వారు చాలా భిన్నంగా ఉంటారు. ఎంతైనా స‌క్సెస్ పీపుల్ క‌దా. క‌నుక వారు రోజూ ప‌నిలో ఆఖ‌రి 10 నిమిషాల్లో కొన్ని ప‌నులు చేస్తారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. స‌క్సెస్ పీపుల్ ఎప్పుడూ రోజూ ప‌నిలో ఆఖ‌రి 10 నిమిషాల్లో చేసే ప‌నుల్లో ఇది కూడా ఒక‌టి. వారు ఆ స‌మ‌యంలో ఏం చేస్తారంటే.. ఆ రోజుకు ఆఫీసులో మిగిలిన చిన్న చిన్న ప‌నుల‌ను చ‌క చ‌కా పూర్తి చేస్తారు.

2. త‌రువాతి రోజు ఏం చేయాలో లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు.

3. త‌మ ఆఫీస్ డెస్క్‌ను, దానిపై ఉన్న కంప్యూట‌ర్‌ను నీట్‌గా స‌ర్దుకుంటారు.

4. ఆ రోజు వారు ఏం చేశారో ఓ బుక్‌లో రాసుకుంటారు.

5. త‌రువాతి రోజు ఏం సాధించాలో రాసుకుంటారు.

6. ఆ రోజున ఏవైనా కాల్స్‌కు ఆన్స‌ర్ చేయ‌లేక‌పోతే వారికి మ‌ళ్లీ కాల్ బ్యాక్ చేస్తారు.

7. ఆ రోజున వారు ఏమేం ఖ‌ర్చు పెట్టారో లెక్క రాసుకుంటారు.

8. ఆ రోజున వారు చేసిన ప‌ని అంత‌టినీ ఓ సారి రీకాల్ చేసుకుంటారు.

9. ఆ రోజున ఏమేం త‌ప్పులు చేశారో గుర్తు చేసుకుంటారు. మ‌ళ్లీ వాటిని చేయ‌కుండా ఉండేలా వాటిని గుర్తు పెట్టుకుంటారు.

10. ఎవరికైనా కృత‌జ్ఞ‌త చెప్పాలి అనుకుంటే ఫోన్ చేసి చెప్పేస్తారు. వ్య‌క్తి అందుబాటులో ఉంటే ప‌ర్స‌న‌ల్‌గా చెబుతారు.

11. ఎవ‌రికైనా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి అనుకుంటే చెబుతారు.

12. ఆ రోజున చేసిన ముఖ్య‌ప‌నుల‌ను ఓ లిస్ట్ రూపంలో రాసుకుంటారు.

Comments

comments

Share this post

scroll to top