టీ అమ్ముకునే ఇతని నెల సంపాదన 12 లక్షలు..! ఎలాగో తెలుస్తే షాక్ అవుతారు…!

అవునా.. చాయ్ అమ్మే అత‌ను నెల‌కు రూ.12 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడా..? అంటే.. అవును, నిజ‌మే. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఫేక్ మెసేజ్ కాదు. సాక్షాత్తూ స‌ద‌రు చాయ్ షాపు య‌జ‌మాని ఓ మీడియా చాన‌ల్‌కు చెప్పాడు. త‌న‌కు చాయ్ అమ్మ‌డం ద్వారా నెల‌కు రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంద‌ని అన్నాడు. అవును, క‌రెక్టే. మీరు న‌మ్మ‌లేకుండా ఉన్నా ఇది నిజ‌మే. అదేంటీ.. కేవ‌లం చాయ్ అమ్మ‌డం ద్వారా అంత డ‌బ్బులు వ‌స్తాయా..? అంటే.. అవును, వ‌స్తాయి. కాక‌పోతే ఆ చాయ్‌ను అంద‌రూ అమ్మిన‌ట్టు అమ్మ‌కూడ‌దు మ‌రి..!

అత‌ని పేరు న‌వ్‌నాథ్ యెవ్లె. మహారాష్ట్ర‌లోని పూణె వాసి. 2011లో ఇత‌ను అక్క‌డ యెవ్లె టీ హౌస్ పేరిట ఒక చాయ్ స్టాల్ ప్రారంభించాడు. అయితే దాన్ని ఓపెన్ చేయ‌డం కోసం అత‌ను చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఎందుకంటే.. అంద‌రూ పెట్టిన‌ట్టుగానే తాను కూడా ఒక టీ స్టాల్ పెట్టి అంద‌రూ అమ్మినట్టు సాధార‌ణ టీ అమ్మితే త‌న‌కు ఏం లాభం వ‌స్తుంది, త‌న‌కు పేరు ఎలా ఉంటుంది, ఎక్క‌డైనా స్పెష‌ల్ చాయ్ దొరికితేనే క‌దా, న‌లుగురూ చెప్పుకునేది, లాభం వచ్చేది. క‌నుక‌నే నవ్‌నాథ్ త‌న చాయ్ స్టాల్‌ను ఓపెన్ చేయ‌డానికి ముందు 4 ఏళ్లు బాగా గ్రౌండ్ వ‌ర్క్ చేశాడు. పూణె మొత్తం తిరిగాడు. దాదాపు అన్ని ర‌కాల చాయ్‌ల‌ను టేస్ట్ చేశాడు. చివ‌ర‌కు త‌న‌దైన బ్రాండ్ క్రియేట్ చేసేలా తాను ఒక స్పెష‌ల్ చాయ్‌ను త‌యారు చేసి అమ్మ‌డం మొద‌లు పెట్టాడు.

అలా 2011లో న‌వ్‌నాథ్ త‌న యెవ్లె టీ హౌస్ చాయ్ స్టాల్ ను ప్రారంభించ‌గా అందులో ల‌భించే చాయ్ చుట్టు పక్క‌ల వారంద‌రికీ న‌చ్చింది. అదే మౌత్ ప‌బ్లిసిటీ అయింది. దీంతో న‌వ్‌నాథ్ చాయ్‌కు గిరాకీ పెరిగింది. ఇక న‌వ్‌నాథ్ వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. అలా అత‌ని చాయ్ బిజినెస్ దిన దిన ప్ర‌వ‌ర్థ‌మానం ఎదిగిపోయింది. ఈ క్ర‌మంలో తాజాగా న‌వ్‌నాథ్ పూణెలో త‌న చాయ్ స్టాల్ రెండో బ్రాంచ్‌ను ఓపెన్ చేశాడు. దీంతో రెండు స్టాల్స్‌లోనూ క‌లిపి రోజుకు 3వేల నుంచి 4వేల క‌ప్పులు, ప‌కోడీలు అమ్ముడుపోతుండ‌గా, త‌న‌కు నెల‌కు రూ.10 ల‌క్షల నుంచి రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంద‌ని చెబుతున్నాడు. ఇక త‌న చాయ్ కు అంత‌ర్జాతీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చే ప‌నిలో ప‌డ్డాడు ఇత‌ను. అత‌ని క‌ల నెర‌వేరాల‌ని మ‌న‌మూ కోరుకుందాం. ఏది ఏమైనా.. అలా చాయ్ అమ్ముతూ నెల‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదించ‌డం అంటే మాట‌లు కాదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top