ఇండియాలో జరిగిన అతి భయానక 12 రైల్వే యాక్సిడెంట్స్.

మన దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్న చిన్న పొరపాట్ల వలన భారీ మూల్యం చెల్లించుకుంటూనే ఉన్న. రైలు ప్రమాదాలతో అయితే వందల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన పాట్నా – ఇండోర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం ఎన్నో కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. మరి కొన్ని కుటుంబాలు అనాథలుగా మారిన పరిస్థితి. ఈ ఘటనలో 120మందికి పైగా మరణించగా, 200 మందికి పైగా గాయాలయ్యాయి. స్వాతంత్ర్యం సిద్దించిన నాటి నుండి ఇప్పటి వరకు చోటు చేసుకున్న భారీ రైలు ప్రమాదాల గురించి ఒక్క సారి తెలుసుకుందాం.

• సెప్టెంబరు 28,1954: దక్షిణ రైల్వేలో జరిగిన రైల్వే ప్రమాద ఘటన ఇది. యసంతి నది దాటుంతున్న సమయంలో ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 139 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు.

55d30718e8cad

• సెప్టెంబరు 2, 1956: జడ్చర్ల – మహబూబ్‌నగర్‌ వద్ద జరిగిన రైల్ ప్రమాదంలో 125 మంది చనిపోయారు. 22 మంది వరకు గాయపడ్డారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ లో ఇదే భారీ రైలు ప్రమాదం.

th01-ariyalur_1773854g

• జూన్ 6, 1981: బీహర్ లోని సహస్ర వద్ద జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటన. ప్యాసింజర్ రైల్ భాగమతి నదిలో పడిన ఘటనలో 300 మందికి పైగా ప్రాణాలు వదిలారు. 200 మందికి పైగా గల్లంతయ్యారు.

55d30718e9efd

• ఏప్రిల్ 18, 1988: ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ వద్ద కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైల్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 75 మంది వరకు మరణించారు. 50 మందికి పైగా గాయాల పాలయ్యారు.

wor-train

• జులై 8, 1988: అత్యంత ప్రమాదకరమైన ఘటన ఇది. కేరళలోని అష్టముది వద్ద పట్టాలు తప్పిన ఐ ల్యాండ్ ఎక్స్ ప్రెస్ అష్టముది సరస్సులో పడి మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 107 మంది చనిపోయారు.

astamudi

• ఆగస్టు 20, 1995: ఉత్తరప్రదేశ్ లోని ఫీరోజాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఎదురెదురుగా వస్తున్న పురుషోత్తం ఎక్స్ ప్రెస్, కళింది ఎక్స్ ప్రెస్ ను ఢీ కొట్టిన ఘటన. ఈ ఘటనలో 400 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. 150 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన అప్పటి ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపేసింది.

firoza

• సెప్టెంబర్ 14, 1997: అహ్మదాబాద్-హౌరా ఎక్స్ ప్రెస్ కు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పి మధ్యప్రదేశ్ లోని ఓ నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 81 మంది మృతి చెందారు.

ahmadabad

• నవంబర్ 26, 1998: ఫ్రంటీయర్ మెయిల్ బోగీలను జమ్మూ తావి-సీల్డా ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టిన ఘటన పంజాబ్ లో జరిగింది. ఈ ఘటనలో 212 మంది మరణించారు.

jammu

• ఆగస్ట్ 2, 1999: అస్సాంలోని గైసాల్ వద్ద రెండు రైళ్లు ఢీకొనడంతో 290 మంది ప్రయాణీకులు మరణించారు. ఆ సమయంలో రెండు రైళ్లలో 2,500మంది పాసింజర్లు ఉన్నారు.

f41sk4-00324_031914081633

• సెప్టెంబర్ 9, 2002: బీహార్ లోని ధావే నది వంతెనపై వెళ్తున్న హౌరా-ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి ఓ బోగి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 100మంది ప్రయాణీకులు మరణించగా, 150మంది గాయాలపాలయ్యారు.

1024x1024

• మే 28, 2010: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సలైట్లు రైల్వే ట్రాక్ కు బాంబులు పెట్టి జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ ను పట్టాలు తప్పెలా చేశారు. ఈ దుర్ఘటనలో 148మంది ప్రయాణీకులు మరణించారు.

55d30718e9136

Comments

comments

Share this post

scroll to top