12-03-2019 రోజువారీ రాశిఫలాలు!!

మేషం :

దైవ, సాంఘిక సేవా కార్యక్రమాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయటం మంచిది. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి.

వృషభం :

విరివిగా ధనం వ్యయం చేయటం వల్ల బంధుమిత్రులలో అపోహలు, పలు అనుమానాలు తలెత్తగలవు. వైద్యులకు ఒత్తిడి, ఆడిటర్లకు సంతృప్తి, ప్లీడర్లకు చికాకు అధికం అవుతాయి. స్త్రీలకు చుట్టు పక్కల వారిలో మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. విద్యార్థినులలో భయాందోళనలు అధికం అవుతాయి.

మిథునం :

చేపట్టిన పనుల్లో సంతృప్తి కానవస్తుంది. పూలు, పండ్లు, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు గుర్తింపు, ఆమోదం లభిస్తాయి. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.

కర్కాటకం :

నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తాయి. ఫైనాన్సు, చిట్‌ఫండ్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఆర్థిక విషయాల్లో సంతృప్తికానవస్తుంది. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్థిస్తారు. మీ కుటుంబ విషయాలను గోప్యంగా ఉంచండి.

సింహం :

ఎరువులు, మందులు, సుగంధ ద్రవ్యాలు, ఆల్కహాలు వ్యాపారులకు అభవృద్ధి కానవస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు చేపట్టిన పనుల్లో ఏకాగ్రత లోపం వల్ల సమస్యలెదుర్కోవలసి వస్తుంది. తొదరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురికాకండి. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికం అవుతాయి.

కన్య :

గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పాత జ్ఞాపకాల గురించి మిత్రులతో చర్చించడం వల్ల ఉల్లాసాన్ని పొందుతారు. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం విషయంలో అప్రమత్తత అవసరం.

తుల :

చేతి వృత్తులు, ప్రైవేటు సంస్థల్లో వారికి లభించిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. మిమ్ములను ఉద్రేకపర్చి లబ్ది పొందాలని ప్రయత్నిస్తారు జాగ్రత్త వహించండి. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టి ఉండటం మంచిది. విద్యార్థులు వాహనం నడుపునపుడు ఏకాగ్రత చాలా అవసరం.

వృశ్చికం :

ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మిత్రుల కలయిక అనుకూలించకపోవచ్చు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు అధికమవుతాయి.

ధనుస్సు :

పోస్టల్, కొరియర్ రంగాల వారు ఒత్తిడి ఎదుర్కుంటారు. స్త్రీలకు పుట్టింటి వారి నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. పట్టుదలతో ఏదైనా సాధించగలమన్న విశ్వాసం మీలో నెలకొంటుంది. ధనవ్యయం విషయంలో అదుపుస ఆలోచన అవసరం. ట్రావెలింగ్, ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి.

మకరం :

ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు అనుకూలిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, వాణిజ్య రంగాల్లో వారికి ఆశించిన ఫలితం ఉండదు.

కుంభం :

మీ సన్నిహితుల వాఖరి వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువుల మీద మక్కువ పెరుగుతుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలను దాటుతాయి. ఇతరుల కారణం వల్ల చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయవలసి వస్తుంది.

మీనం :

ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. శస్త్ర చికిచత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. ఒక ముఖ్య కార్యం నిమిత్తం దూరప్రయాణం చేయవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళన కలుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top