బాబాయ్, తమ్ముడి రాక తో కళ్యాణ్ రామ్ దశ తిరిగేనా.? 118 ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడే..Watch Live ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ఇరువురు కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అయిన 118 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతున్నారు, ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కలిసిన ఈ ముగ్గురు, మరో సారి స్టేజి ని పంచుకోవడం అభిమానులని ఆనందింపజేస్తుంది.

బాబాయి.. అబ్బాయి.. :

బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ ఒకే స్టేజి మీద కనిపిస్తే నందమూరి అభిమానులకి పండగే, బాబాయి అబ్బాయి ల మధ్య సంబంధం ఇటీవల కాలం లో చాలా గట్టిపడింది. అరవింద సామెత సక్సెస్ మీట్ కు బాలకృష్ణ గారు రావడం తో నందమూరి అభిమానులకు కొత్త ఉత్సాహం వచ్చింది, ఆ తరువాత ఎన్టీఆర్ గారి బయోపిక్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూ.ఎన్టీఆర్ రావడం తో వీరి మధ్య బంధం మరింత బలపడింది.

కోనేరు, కళ్యాణ్ రామ్ పుణ్యమా.. :

కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన 118 మూవీ మార్చి 1 న విడుదల కానుంది, ఈ చిత్రానికి మహేష్ కోనేరు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు, నా నువ్వే చిత్రానికి కూడా మహేష్ కోనేరు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు, సామాన్య వ్యక్తి గా హీరో లను విమర్శించే వ్యక్తి నుండి జూ.ఎన్టీఆర్ కి ప్రో అయి ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు కోనేరు. మహేష్ కోనేరు చాలా గట్టోడు అని జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు, అందుకే ఆయన కళ్యాణ్ రామ్ పుణ్యమా అంటూ మరో సారి స్టేజి పైన ఒకేసారి బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ ని చూసే అదృష్టం నందమూరి అభిమానులకు దక్కింది.

అదృష్టం కలిసొచ్చేనా..:

ఈ సంవత్సరం నందమూరి అభిమానులకి ఆదిలోనే రెండు పెద్ద దెబ్బలు తగిలాయి, ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దెగ్గర ఘోర పరాజయాలుగా మిగిలిపోడం ఏ కాకుండా, పటాస్ తరువాత సరైన హిట్ లేని కళ్యాణ్ రామ్ అన్ సీజన్లో వస్తుండటం అభిమానులని భయపెడుతుంది, 118 చిత్రం తో కచ్చితంగా హిట్ కొడతా అని కళ్యాణ్ రామ్ బలంగా నమ్ముతున్నాడు. బాబాయి, తమ్ముడి బలగం కళ్యాణ్ రామ్ కి తోడైతే 118 సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నందమూరి అభిమానులు చెబుతున్నారు, ఇంకో వారం లో 118 మూవీ రిసల్ట్ తేలిపోనుంది. 118 చిత్రం లో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే, నివేద థామస్ హీరోయిన్స్ గా నటించారు.

Comments

comments

Share this post

scroll to top