ఈ కుర్రాడు తన స్కూల్ అయ్యాక, స్లమ్ ఏరియాలోని పిల్లలకు చదువు నేర్పిస్తాడు, ఇతని గురించిన మరిన్న విషయాలు..

అది లక్నో  కు కాస్త దూరంలో ఉంటే స్లమ్ ఏరియా… సమయం సాయంత్రం 5:30 నిమిషాలు, స్లమ్ లోని పిల్లలంతా ప్లాస్టిక్ బస్తాలను కిందపరుచుకొని శ్రద్దగా కూర్చున్నారు.మరి కాసేపట్లో  సార్ వస్తారు,ఆనంద్ సార్ వస్తారు అని వారిలో వారే మాట్లాడుకుంటూ. అంతలోనే ఓ 11 యేళ్ళ పిల్లాడు వచ్చాడు. ఆ పిల్లాడు రావడంతోనే అందరూ లేచి నిలబడి రాగయుక్తంగా, ముక్తకంఠంతో…. హమ్ హొంగే కామియాబ్, హమ్ హోంగే కామియాబ్ …ఏక్ దిన్. అంటూ సినిమాలోని పాట పాడారు. చిత్రమేంటంటే ఆ 11 యేళ్ళ పిల్లాడే వాళ్ల టీచర్.. వాళ్ళు పాడిన పాటే వాళ్ళ ప్రార్థనా గీతం. హమ్ హోంగే కామియాబ్, హమ్ హోంగే కామియాబ్..( మేం సక్సెస్ అవుతాం… మేం సక్సెస్ అవుతాం..) అని దానర్థం.

called-chota-masterji-this-11-year-old-kid-teaches-slum-children-after-school2-1447155535

పాట అయ్యాక పిల్లలందరూ తాము రాసిన నోట్ బుక్స్ ను అతనికి చూపించారు. వాటిని చూశాకా… పిల్లలకు ఓ చిట్టి కథ చెప్పాడు ఆనంద్…కథ పూర్తయ్యాక పిల్లలందూ చప్పట్టు కొట్టారు. ఇప్పటి వరకు సుమారు 150 మంది పిల్లలకు పైగా చదవడం,రాయడం నేర్పాడు ఆనంద్. ఈ ఆనంద్ పూర్తి పేరు ఆనంద్ కృష్ణన్ మిశ్రా….లక్నో లోని ఓ స్కూల్లో 7 వతరగతి చదువుతున్నాడు. గత 10 నెలలుగా స్కూల్ అయిపోగానే ఆనంద్ ది ఇదే పని… మూడు నెలల పాటు ఓ స్లమ్ ను సెలెక్ట్ చేసుకోవడం.. అక్కడి పిల్లలకు పాఠాలు చెప్పడం. వాళ్ళకు చదవడం, రాయడం నేర్పించడం. దీనితో పాటు రోజూ ఓ ఇన్స్పిరేషన్ కథ కూడా చెబుతాడు ఆనంద్..ఆ కథ వినడం కోసమే చాలా మంది ఆనంద్ దగ్గర చదువు నేర్చుకోడానికి వస్తుంటారు. దానికోసం ఆనంద్ మంచి మంచి కథల పుస్తకాలను సేకరించి నైట్ చదివి, సాయంత్రం వీళ్లకు వచ్చి చెబుతుంటాడు.ఎంత నైట్ అయినా తన హోం వర్క్ కూడా కంప్లీట్ చేసే పడుకుంటాడు.

called-chota-masterji-this-11-year-old-kid-teaches-slum-children-after-school4-1447155571

వీళ్ళకు చదువు చెప్పాలని నీకెందుకు అనిపించింది అని అడిగితే… తను ప్రత్యక్షంగా చూసిన ఉదంతాన్ని చెబుతాడు ఆనంద్..”ఓ సారి మా ఫ్యామిలీ అంతా ముంబాయ్ వెళ్ళాం..అక్కడ వీధిలైట్ కింద ఓ కుర్రాడు కూర్చొని చదవడాన్ని గమనించాను… అంతలోనే గుడిలో గంట చప్పుడు వినిపించింది, అంతే ఆ కుర్రాడు ఆ బుక్స్ పక్కకు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడిచ్చే ప్రసాదం తిని, నీళ్ళు తాగి మళ్లీ వచ్చి చదవడం చూశాను..అంటే చదవాలని చాలా మందికి ఉంటుంది.కానీ పరిస్థితులే అనుకూలించవ్.. సో ఆ కుర్రాడినే ప్రేరణగా తీసుకొని మా దగ్గర స్లమ్స్ లోని పిల్లలకు కాస్తైనా చదువు చెప్పాలని ఫిక్స్ అయ్యా… అదిగో అప్పటి నుండి ఇలా…” అంటాడు ఆనంద్ మిశ్రా.

called-chota-masterji-this-11-year-old-kid-teaches-slum-children-after-school3-1447155553

లాంగ్ బెల్ ఎప్పుడు కొడతారా..? ఇంటికెళ్లి కార్టూన్ ఛానల్ ఎప్పుడు చూద్దామా అని ఆలోచించే ఈ రోజుల్లో… నిజంగా ఆనంద్ లాంటి పిల్లాడు దేశానికే గర్వకారణం.. చదువంతా నేర్పించలేను, కానీ  ఈ పిల్లలకు చదువు పట్ల కాస్తంతైనా  ఆసక్తి కల్గించగలిగితే చాలు నా ప్రయత్నం సక్సెస్ అయినట్టే అన్నాడు ఆనంద్.. సత్యపత్ బాల్ రతన్ అవార్డ్ తీసుకుంటూ… హ్యాట్సఫ్ ఆనంద్.

called-chota-masterji-this-11-year-old-kid-teaches-slum-children-after-school5-1447155588

called-chota-masterji-this-11-year-old-kid-teaches-slum-children-after-school1-1447155517

Comments

comments

Share this post

scroll to top