స్కూల్ వ్యాన్ లో మంటలు.! తన ప్రాణాన్ని పణంగా పెట్టి 8 మంది స్నేహితులను కాపాడిన 11 యేళ్ళ విద్యార్థి.

ఒకరిమీద ఒకరు జోకులు వేసుకుంటూ తాము రెగ్యులర్ గా వెళ్లే వ్యాన్ లో కూర్చొని  స్కూల్ కు వెళుతున్నారు విద్యార్థులు. జోక్స్..నవ్వులు..అల్లరి…అల్లరిగా ఉంది ఆ స్కూల్ వ్యాన్. మరికాసేపట్లో స్కూల్లో దిగుతారనగా.. అనుకోని ప్రమాదం. వేగంగా స్కూల్ వైపు ప్రయాణిస్తున్న మారుతీ వ్యాన్ గ్యాస్ కిట్ లో షాట్ సర్య్కూట్ కావడం వల్ల  మంటలు చెలరేగాయి..అప్పటి వరకు అల్లరి అల్లరి గా గడిపిన పిల్లలు హాహాకారాలు చేస్తున్నారు. మమ్మల్ని రక్షించండీ..రక్షించండీ అంటూ…. మంటలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయ్… మారుతీ వ్యాన్ మొత్తం మంటల్లో తగబడుతుంది. పరిస్థితి గమనించిన డ్రైవర్ కార్ లో నుండి దూకి బయటపడ్డాడు.

hero

వ్యాన్ లోపల పిల్లలు ఆ మంటల వేడిని భరించలేక …హాహాకారాలు చేస్తున్నారు. అదే వ్యాన్ లో ఉన్న 11 యేళ్ళ ఓం ప్రకాశ్ అతి కష్టం మీద వ్యాన్ అద్దాలు పగులగొట్టాడు..ఒక్కొక్కరిగా మొత్తం 8 మంది పిల్లలను తాను  పగులగొట్టిన కిటీకీ అద్దాల గుండా కిందికి దించాడు.  వ్యాన్ లో ఉన్న అందర్నీ దించాక తాను కూడా ఆ కిటీకీ గుండా కిందికి దిగాడు, కానీ ఆ పాటికే ఓం ప్రకాష్ చేతులకు, వీపు వెనుక భాగాన, ముఖానికి మంటలు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. వీరు దిగిన కాసేపటికే మారుతీ వ్యాన్ పేలిపోయింది.

MUmbai Oct. 25 :- Maruti van caught fire at CST on Tuesday,Fire Brigade person dousing the Fire at CST,Mumbai.( pic by Ravindra Zende )

అద్దాలు పగులగొట్టిన వాడివి మరి ముందు నీవే దిగొచ్చుగా..?? అని అతడిని ప్రశ్నిస్తే అతనిచ్చిన సమాధానం.. ఆ సమయంలో నా స్నేహితుల ముఖాల్లో బాధను చూశాను, ముందు వారిని బయటికి పంపాలని డిసైడ్ అయి అలా చేశాను. మనకు ఏం జరిగినా ఫర్వాలేదు కానీ మన ధైర్య సాహసాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తాయి కదా అంటూ  గొప్పగా సమాధానమిస్తాడు ఓం ప్రకాశ్. ఈ ఘటన జరిగి ఇప్పటికి ఐదేళ్ళు అయింది.

Comments

comments

Share this post

scroll to top