ఫేస్బుక్ లో 10ఇయర్స్ ఛాలెంజ్ లో మీ పిక్స్ పెడుతున్నారా.. అయితే జాగ్రత్త, అసలు కథ ఏంటంటే..

సోషల్ మీడియా లో గత వారం నుండి 10ఇయర్స్ ఛాలెంజ్ పేరుతో ఫొటోస్ ని తెగ అప్లోడ్ చేస్తున్నారు నెటిజన్స్. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇందులో పాల్గొంటున్నారు, ఈ ఛాలెంజ్ మొదలైన 3 రోజుల్లోనే దాదాపు 52లక్షల మందికి పైగా పాల్గొన్నారు అట. సెలబ్రిటీస్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు కాబట్టి, ఈ ఛాలెంజ్ వల్ల ఏదైనా నష్టం ఉందా అని చాలా మంది ఆలోచించ సాగారు. అయితే ఈ విషయం అయి సైబర్ సెక్యూరిటీ టీం హెచ్చరిక జారీ చేసారు.

అసలు 10ఇయర్స్ ఛాలెంజ్ గురుంచి వారు చెప్పింది ఏంటంటే. :

10 ఏళ్ళ ముందు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేదే 10 ఇయర్స్ బ్యాక్ ఛాలెంజ్ ఉద్దేశం, మీ 10 ఏళ్ళ నాటి పిక్ ని, ప్రస్తుత పిక్ ని రెండిట్నీ కంపేర్ చేసి, అప్పటికి ఇప్పటికి మీలో ఏం మార్పు వచ్చింది, మీ జీవితం అప్పటికి ఇప్పటి ఏం మారింది అనేదే ఈ 10ఇయర్స్ ఛాలెంజ్.

ఫేస్‌బుక్ తన కృత్రిమ మేధా వ్యవస్థకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఈ ఫొటోలను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కోసం ఇవి ఉపయోగిస్తారు. పదేళ్ల నాటి ఫొటోలు, ఇప్పటి ఫొటోలు ఒకే దగ్గర చేరితే ఆ ముఖాల్లో వచ్చిన మార్పులను స్టడీ చేయడం ద్వారా మనుషుల మొహాలను గుర్తించే టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడానికి చాన్స్ ఉంటుంది. ఈ టెక్నాలజీ నేర పరిశోధనలో ఉపయోగ పడే ఛాన్స్.

అయితే ఈ చాలెంజ్‌ దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖాల్లో వచ్చిన మార్పులను స్టడీ చేసి బ్యూటీ ప్రాడెక్ట్స్ ప్రకటనలు గుప్పిస్తాయి. ముఖకవలికల్లో ఎక్కువగా తేడా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు మనం టార్గెట్ కావచ్చు, ముఖ్యంగా ఫోటోలు మార్ఫింగ్ బారినపడే ప్రమాదం లేదా మీ ఫోటోలు మీకు తెలియని వారి చేతికి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటి ఫొటోలను విశ్లేషించడం ద్వారా బ్యూటీ ప్రాడెక్ట్స్, ఇతర వైద్య సేవల ప్రకటనలను యూజర్లకు ఎక్కువ సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అలాగే పదేళ్లలో మరీ ఎక్కువ మార్పులు వచ్చినట్టు కనిపిస్తే, అలాంటి వారిని ఇన్సూరెన్స్ సంస్థలు కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే దీని మీద ఫేస్బుక్ వివరణ ఇచ్చింది, ఫేస్ రెకగ్నిషన్ ఆప్షన్ ని యూజర్లు ఆఫ్ చేయొచ్చని చెప్పారు, మొత్తానికి కొంతైనా ఈ ఛాలెంజ్ వల్ల మీ పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎదురవొచ్చు. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి.

 

Comments

comments

Share this post

scroll to top