“ఊహ”కు ఊహించని షాక్ ఇచ్చిన యూనివర్శిటీ…ఎంత ఇంప్రూవ్మెంట్ 100 అయితే 105 వేస్తారా?

పరీక్ష రాసొచ్చాక మనం ఊహించిన వాటి కంటే ఎక్కువ మార్కులొస్తే సంతోషిస్తాం…తక్కువ వచ్చినా,ఫెయిల్ అయినా బాదపడ్తాం…  మనం ఎంత సూపర్ గా రాసినా..మనం అంటే టీచర్ కి ఎంత ప్రేమున్నా వందకి వందే వస్తాయ్ తప్ప …ఒక్క మార్కు కూడా ఎక్కువ రాదు… కానీ వందకు నూటాయిదు మార్కులొస్తే ఎలా ఉంటుంది….మార్కులొచ్చిన స్టూడెంట్ కూడా అవాక్కయేలా చేశారూ ఆ యూనివర్శిటీ సిబ్బంది…..

రివాల్యుయేషన్ కి అప్లై చేసిన విధ్యార్ధినికి వందకు నూటా ఐదు మార్కులు వేసిన గనత కాకతీయ యూనివర్శిటీది..ఊహ అనే విధ్యార్దిని మ్యాథమెటిక్స్ పరీక్ష రాస్తే అందులో ఇరవై మార్కులు వచ్చి  ఎగ్జామ్ ఫెయిలయి …. రివాల్యుయేషన్ కి అప్లై చేసింది..రివాల్యుయేషన్ కి అప్లై చేస్తే ఒకటి,రెండు మార్కులు పెరగడం సహజమని విధ్యార్దుల అభిప్రాయం..మనం బాగా రాసినట్టయితే ఒక పది మార్కులు పెరుగుతతాయనకుందాం…ఇక్కడ ఊహకి ఊహించని విధంగా ఎనభైఐదు మార్కులు పెరిగి మొత్తం నూటఅయిదు మార్కులు వేసి మార్క్స్ లిస్టు ఇంటికి పంపారు….

వందకువంద వస్తే సంతోషిస్తారు కానీ నూట అయిదు వస్తే అవాక్కవుతారు….మార్కులు చూసి నవ్వుకున్నప్పటికీ మన విధ్యావ్యవస్థ ఎటు పోతుంది  అనే ప్రశ్న తలెత్తకమానదు…ఇప్పుడు ఆ మార్కులిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది…మరోవైపు ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా కాకతీయవర్శిటీలో జరిగాయ్..ఇప్పుడు ఇది ..యూనివర్శిటీ సిబ్బంది ఎప్పుడు నిద్ర మత్తు వదులుతుందో…

Comments

comments

Share this post

scroll to top