అందరూ మనకెందుకులే అనుకున్న చోట… జంక్షన్ లో నిలబడి ట్రాఫిక్ క్లియర్ చేసిన 10 యేళ్ళ పిల్లాడు.!

ట్రాఫిక్ బాధను అంతా ప్రత్యక్షంగా ఫేస్ చేసి ఉంటారు.  ఒక్క మాటలో చెప్పాలంటే ట్రాఫిక్ సమస్య  ప్రత్యక్ష నరకానికి ఫర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. అర్జెంట్ గా ఆఫీసుకు వెళ్ళాల్సి ఉంటుంది, బయలుదేరి రోడ్ మీదకు రాగానే ట్రాఫిక్ జామ్. హాస్పిటల్ కు అత్యవసరంగా వెళ్తున్నప్పుడు అంబులెన్స్ లకు ఇదే పరిస్థితి. గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి, కాలుష్యానికి గురై ఎన్నో అవస్థలు ఇవి మన రహదారులపై నిత్యకృత్యాలు. రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయిన ప్రతిసారీ మనలో చాలామంది చేసే పనేంటంటే…  మన సీట్లో కూర్చొని అదేపనిగా హారన్ కొడతాం, లేదంటే…. ట్రాఫిక్ క్లియర్ అయ్యే దాకా అలాగే కూర్చోని ఉంటాం….మా అయితే… షార్ట్ కట్ రూట్ వైపు బండిని మలుపుతాం…!

కానీ ఓ కుర్రాడు మాత్రం…. మనకు ఆదర్శంగా నిలిచాడు. భారీగా ట్రాఫిిక్ జామ్ అయిన జంక్షన్ లో నిలబడి ట్రాఫిక్ వాలంటీర్ గా విధులు నిర్వహించి… పెద్ద ఎత్తున జామ్ అయిన వాహనాలకు సిగ్నల్స్ చూపిస్తూ అరగంటలో క్లియర్ చేశాడు. కొంతమంది పిల్లాడిని చూసి చలించి వారు కూడా ట్రాఫిక్ వాలంటీర్లు గా ముందుకు వస్తే, మరికొంత మందైతే మరింత వేగంగా అలాగే దూసుకెళ్ళారు.  బెంగళూర్ ట్రాఫిక్ పోలీసులు చాలా తక్కువ మంది ఉండటం వలనే అక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడిందట.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top