బ్రేకప్ అయిన 10 ఏళ్ల తర్వాత అతను మాజీ ప్రియురాలిని కలిసాడు…ఇప్పుడామె ఎవరో తెలిసి షాక్!

జీవితం అంటే అంతే.. మ‌నం అనుకున్న‌వి జ‌ర‌గ‌వు. త‌లచిన‌దే జ‌రిగితే ఇక దైవం ఎందుకు ? అన్న సామెత‌ల‌ను మ‌న‌కు జీవితం గుర్తు చేస్తుంది. మ‌నం అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌రిగితే.. ఇంక అంత‌కు మించి జీవితానికి సార్థ‌క‌త ఏముంటుంది చెప్పండి. ఎవ‌రైనా కోరుకునేది అదే క‌దా. కానీ అలా అస్స‌లు జ‌ర‌గ‌దు క‌దా. అత‌ని జీవితంలోనూ ఇలాగే అయింది. ప్రేమించి పెళ్లాడుతాన‌నుకున్నాడు. ప్రేమించాడు. పెళ్లి ఖాయం అనే దాకా వ‌చ్చింది. చివ‌ర‌కు క‌థ అడ్డం తిరిగింది. క‌ట్ చేస్తే.. తాను ఎక్క‌డో.. త‌న ప్రేయ‌సి ఎక్క‌డో.. కొన్ని ఏళ్లు ఆగాక‌.. ఇద్ద‌రూ అనుకోకుండా ఒక చోట క‌లిశారు. త‌రువాత ఏమైందంటే…

అది 2012వ సంవ‌త్స‌రం. వారి పేర్లు చేత‌న్‌, జాహ్న‌వి. ఇద్ద‌రిదీ కాలేజ్ అయిపోయింది. జాబ్ ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం చేత‌న్ య‌త్నిస్తున్నాడు. అయితే కాలేజీ డేస్ నుంచే ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. అది పెళ్లి వ‌ర‌కు దారి తీసింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుందామ‌నుకున్నారు. అందులో భాగంగానే చేత‌న్ జాహ్న‌వి ఇంటికి వ‌చ్చాడు. ఆమె తల్లిదండ్రుల‌తో క‌ల‌సి భోజ‌నం చేశాడు. చివ‌ర‌కు త‌న మ‌న‌స్సులో ఉన్న మాటను చెప్పాడు. తాను, జాహ్న‌వి ప్రేమించుకుంటున్నాం అని, అనుమ‌తిస్తే పెళ్లి చేసుకుంటామ‌ని అడిగాడు. అందుకు జాహ్న‌వి త‌ల్లిదండ్రులు అడ్డు చెప్ప‌లేదు. వారు స‌రే అన్నారు. అప్పుడు ఇద్ద‌రి క‌ళ్ల‌లో క‌నిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇక పెళ్లి ఖాయ‌మైన‌ట్టే. త‌మ‌దైన అంద‌మైన క‌ల‌ల జీవితం త‌మ సొంత‌మైనట్టే అని భావించారు.

కానీ పైనే చెప్పాం క‌దా. తానొక‌టి త‌లిస్తే దైవం ఒక‌టి త‌ల‌చిన‌ట్టు… జాహ్న‌వి పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ చేత‌న్ త‌ల్లిదండ్రులు అందుకు స‌సేమిరా అన్నారు. దీంతో వారి పెళ్లి ఆగిపోయింది. త‌ల్లిదండ్రుల‌ను కాద‌నే ధైర్యం చేత‌న్ చేయ‌లేదు. ఫ‌లితంగా చేత‌న్‌, జాహ్న‌వి ఇద్ద‌రూ విడిపోయారు. క‌ట్ చేస్తే.. అది 2022 వ సంవ‌త్స‌రం. చేత‌న్‌, జాహ్న‌వి ఇద్ద‌రూ విడిపోయి అప్ప‌టికి 10 ఏళ్లు అవుతోంది. ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌ల‌వ‌నేలేదు. ఈ 10 ఏళ్ల‌లో ఎన్నో మార్పులు జ‌రిగిపోయాయి. చేత‌న్ పెళ్లి చేసుకున్నాడు. అత‌నికి బాబు పుట్టాడు. 2022కు ఆ బాబుకు 7 సంవ‌త్స‌రాలు వ‌చ్చాయి. ఓ స్కూల్‌లో అతన్ని అప్ప‌టికే జాయిన్ చేశాడు చేత‌న్‌.

ఓ రోజున‌… చేత‌న్ త‌న కొడుకును స్కూల్ నుంచి తీసుకువ‌చ్చేందుకు స్కూల్‌కు వెళ్లాడు. గేట్ బ‌య‌ట వేచి ఉన్నాడు. ఇంకా లాంగ్ బెల్ కొట్ట‌లేదు. అందుకే చేత‌న్ వెయిట్ చేస్తున్నాడు. ఎలాగో లాంగ్ బెల్ కొట్టారు. పిల్ల‌లంద‌రూ బిర బిరా బ‌య‌ట‌కు ప‌రిగెత్తారు. త‌న కొడుకు కోసం చేత‌న్ ఇంకా అలాగే వెయిట్ చేస్తున్నాడు. చివ‌ర‌కు చాలా సేప‌టికి త‌న కొడుకు స్కూల్ మెయిన్ గేట్ నుంచి బ‌య‌ట‌కు రావడాన్ని చేత‌న్ చూశాడు. అయితే అంతలోనే త‌న చూపును మ‌రొక‌రు ఆక‌ర్షించారు.

త‌న చూపును ఆక‌ర్షించిన ఆ వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు.. 10 ఏళ్ల క్రితం త‌న నుంచి విడిపోయిన త‌న జాహ్న‌వి. నిజానికి ఆమె త‌న నుంచి విడిపోలేదు. తానే విడిపోయాడు. త‌న త‌ల్లిదండ్రులు ఆమెతో పెళ్లి చేసేది లేద‌న్నారు. ఆమెది వేరే మ‌తం అని చెప్పి వారు పెళ్లికి అంగీక‌రించ‌లేదు. అందుకే చేత‌న్ చేసేది లేక జాహ్న‌వికి అదే విష‌యం చెప్పి ఆమె నుంచి విడిపోయాడు. అదే విష‌యం చేత‌న్‌కు ఇప్పుడు గుర్తుకు వ‌చ్చింది. ఒక్క‌సారిగా క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు ధైర్యం చేసి ఉంటే… త‌న జాహ్న‌వి.. తాను.. క‌ల‌సి ఉండేవారు క‌దా. ఆ ఆలోచ‌న వ‌చ్చే సరికి చేత‌న్ మ‌న‌స్సుకు ఏదో అనిపించింది. అప్ప‌టికే జాహ్న‌వి త‌న వద్ద‌కు వ‌చ్చేసింది. త‌ప్పించుకోవ‌డానికి వీలు లేనంత ద‌గ్గ‌రగా ఆమె అత‌న్ని స‌మీపించింది. ఆమె గేట్ దాటుతూ చేత‌న్ ను చూసి గుర్తు ప‌ట్టింది. అయినా ఆమె ఆగ‌లేదు. వెళ్తూనే ఉంది. అలా వెళ్తూ చేత‌న్‌ను ఒక మాట అన్న‌ది. నువ్వు అలా చేసి ఉండ‌కూడ‌దు అని జాహ్న‌వి చేత‌న్‌ను అన్న‌ది. వెంట‌నే ఆమె అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఒక్క‌సారిగా చేత‌న్‌కు నోట మాట రాలేదు. ఆమె పేరును ఉచ్చ‌రించాల‌ని అనుకున్నాడు. కానీ ప‌దాలు నోటి వెంట రాలేదు. మ‌రోవైపు క‌ళ్ల‌లో నీళ్లు తిరుగుతున్నాయి. మ‌న‌స్సులో ఏదో బాధ‌. గుండెను ఎవ‌రో పిండేసిన‌ట్టుగా అత‌నికి అనిపించింది. అంతలోనే త‌న 7 ఏళ్ల కొడుకు డాడీ అనుకుంటూ వ‌చ్చాడు. ఒక్క‌సారిగా త‌న క‌ళ్ల ముందు ఊహ‌ల ప్ర‌పంచంలో ఉన్న జాహ్న‌వి మ‌ళ్లీ అత‌నికి క‌నిపించ‌లేదు..! ఆమె ఉంద‌న్న భావ‌న అత‌నికి క‌ల‌గ‌లేదు..!

Comments

comments

Share this post

scroll to top