వాట్సాప్‌కు పోటీగా ఇంకా ఏమేం ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్ ఉన్నాయో తెలుసా..?

వాట్సాప్‌… ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక మంది యూజ‌ర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది. ఫేస్‌బుక్ దీన్ని కొనుగోలు చేశాక ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటూనే ఉంది. అయితే మ‌రి గూగుల్ ప్లే స్టోర్‌లో కొన్ని వంద‌ల కోట్ల యాప్స్ ఉన్నాయి క‌దా, వాటిలో అస‌లు వాట్సాప్‌కు పోటీ వ‌చ్చే యాప్స్ ఏవీ లేవా..? అందులో ఉన్న ఫీచ‌ర్ల‌ను పోలిన ఇత‌ర యాప్స్ ఏవీ లేవా..? అంటే.. కాదు, ఉన్నాయి. నిజానికి వాట్సాప్‌ను మించిన ఫీచర్ల‌ను అందిస్తున్న యాప్‌లు కూడా ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

1. హైక్‌…
హైక్ (Hike) మెసెంజ‌ర్ యాప్ ఇండియాకు చెందిన‌దే. వాట్సాప్‌లో ఉన్న ఫీచ‌ర్ల‌న్నీ ఇందులో కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్ మొబైల్ యూజ‌ర్ల‌కు ఈ యాప్ అందుబాటులో ఉంది. స్టోరీస్‌, కెమెరా, లైవ్ ఫిల్ట‌ర్స్ అనే కొత్త ఫీచ‌ర్ల‌ను ఈ మ‌ధ్యే ఇందులో యాడ్ చేశారు.

2. ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌…
ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, వాట్సాప్ రెండూ ఫేస్‌బుక్‌వే అయిన‌ప్ప‌టికీ ఈ రెండు యాప్‌ల‌ను యూజ‌ర్లు వాడుతున్నారు. నిజానికి వాట్సాప్‌లో ఉన్న ఫీచర్ల‌న్నీ మెసెంజ‌ర్‌లో కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ ల‌భిస్తోంది.

3. లైన్‌…
లైన్ (Line) యాప్ కూడా వాట్సాప్ లాంటి ఫీచ‌ర్ల‌నే యూజ‌ర్ల‌కు అందిస్తోంది. 21.4 కోట్ల మంది దీన్ని వాడుతున్నారు. టైం లైన్‌, కూప‌న్స్‌, వీడియో స్నాపింగ్ వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. దాదాపుగా 1 జీబీ వ‌ర‌కు సైజ్ ఉన్న ఫైల్స్‌ను ఇందులో షేర్ చేసుకోవ‌చ్చు. అదే వాట్సాప్‌లో ఇంత‌టి సైజ్ ఉన్న ఫైల్‌ను షేర్ చేయ‌లేం. ఈ యాప్ కూడా ఆండ్రాయిడ్‌, ఐఫోన్ యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉంది.

4. బ్లాక్‌బెర్రీ మెసెంజ‌ర్ (బీబీఎం)
బ్లాక్‌బెర్రీకి చెందిన BlackBerry Messenger or BBM యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తోంది. ఇది ఒక‌ప్పుడు కేవ‌లం బ్లాక్‌బెర్రీ ఫోన్ల‌లో మాత్ర‌మే ఉండేది. అయితే ఆ కంపెనీ వారు ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను రిలీజ్ చేస్తుండ‌డంతో ఇక గత్యంత‌రం లేక ఈ యాప్ ను కూడా ఇత‌ర ప్లాట్‌ఫాంల‌లో విడుద‌ల చేశారు. ఇందులో కూడా వాట్సాప్ లాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

5. టెలిగ్రాం (Telegram)
వాట్సాప్‌కు గ‌ట్టి పోటిస్తున్న యాప్ టెలిగ్రాం అని చెప్ప‌వ‌చ్చు. ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలు రెండింటిలోనూ ల‌భిస్తోంది. ఇందులో గ‌రిష్టంగా ఫైల్స్‌ను 1.5 జీబీ వ‌ర‌కు సైజ్ ఉన్న‌ప్ప‌టికీ షేర్ చేసుకోవ‌చ్చు. వాట్సాప్‌లో లేని చాలా వ‌ర‌కు ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. వాట్సాప్ గ్రూప్‌ల‌లో ఒక గ్రూప్‌కు కేవ‌లం 256 మందిని మాత్ర‌మే యాడ్ చేసుకోవ‌చ్చు. కానీ ఇందులో ఒక గ్రూప్‌కు గ‌రిష్టంగా 1000 మందిని యాడ్ చేయ‌వ‌చ్చు.

6. వైబ‌ర్ (Viber)
ఈ యాప్ జ‌పాన్‌కు చెందిన‌ది. వాట్సాప్ లాంటి ఫీచ‌ర్లే దీంట్లోనూ ఉన్నాయి. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ యూజ‌ర్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ యాప్ కూడా వాట్సాప్‌కు గ‌ట్టి పోటీనే ఇస్తున్న‌ది.

7. వీచాట్ (WeChat)
ఇది చైనాకు చెందిన‌ది. వాట్సాప్‌కు గ‌ట్టి పోటినిస్తున్న యాప్‌ల‌లో ఇది కూడా ఒక‌టి. ఇందులో 93.8 కోట్ల మంది యూజ‌ర్లు ఉన్నారు. వీడియో కాలింగ్‌, వాయిస్ కాలింగ్ ఫీచ‌ర్లు వాట్సాప్‌కు పోటీగా ఇందులో క్లారిటీతో ల‌భిస్తుండ‌డం విశేషం.

8. స్కైప్ (Skype)
సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన‌ది ఈ యాప్‌. దీంట్లోనూ వాట్సాప్ లాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. వాయిస్ కాలింగ్ ఇందులో చాలా క్లియ‌ర్‌గా ఉంటుంది.

9. గూగుల్ అలో (Google Allo)
సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ గ‌తేడాది ఈ యాప్‌ను విడుద‌ల చేసింది. దీన్ని పెద్ద సంఖ్య‌లో యూజ‌ర్లు వాడుతున్నారు. వాట్సాప్‌కు ఈ యాప్ గ‌ట్టి పోటీనిస్తోంది. ఇందులోనూ వాట్సాప్ లాంటి ఫీచ‌ర్లే ఉన్నాయి.

10. క‌కావో టాక్ (KakaoTalk)
ఈ యాప్ గురించి చాలా మందికి తెలిసి ఉండ‌దు. కానీ ఈ యాప్ కూడా వాట్సాప్‌కు పోటీనిస్తోంది. ఇది సౌత్ కొరియాకు చెందిన‌ది. ఈ యాప్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ల‌భిస్తోంది. వాయిస్ కాలింగ్ ఇందులో ప్ర‌ధాన‌మైన ఫీచ‌ర్‌. వాట్సాప్ లాగే ఇంకా అనేక ఇత‌ర ఫీచ‌ర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Comments

comments

Share this post

scroll to top