ఈ 10 టిప్స్ పాటిస్తే మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను చాలా వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు తెలుసా..?

నేటి త‌రుణంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య బ్యాట‌రీ బ్యాక‌ప్‌. ఎంత పెద్ద బ్యాట‌రీ ఉన్న ఫోన్ కొన్నా ఎక్కువ బ్యాక‌ప్ రావ‌డం లేద‌ని చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు. కొంద‌రు త‌క్కువ బ్యాట‌రీ ఉన్నా చాలా పొదుపుగా దాన్ని వాడుకుంటారు. దీంతో ఎక్కువ బ్యాక‌ప్ వ‌స్తుంది. అయితే నిజానికి ఎవ‌రైనా స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీ ఎక్కువ సేపు రావాలంటే ఏం చేయాలో తెలుసా..? కింద ఇచ్చిన సూచ‌న‌ల‌ను పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీ బ్యాక‌ప్ క‌చ్చితంగా పెరుగుతుంది. ఆ సూచ‌న‌లు ఏమిటంటే…

1. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే వైబ్రేష‌న్ ఫీచ‌ర్‌ను ఆఫ్ చేయండి. ఎందుకంటే ఈ ఫీచర్ ఆన్‌లో ఉండ‌డం వ‌ల్ల ఎక్కువ బ్యాట‌రీ వాడుకుంటుంది. కాల్స్, ఎస్ఎంఎస్‌లు, ఇత‌ర యాప్‌ల‌కు చెందిన నోటిఫికేష‌న్లు వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చే వైబ్రేష‌న్ కానీ, లేదంటే టైప్ చేస్తున్న‌ప్పుడు, ఫోన్‌ను ప‌ట్టుకున్న‌ప్పుడు వ‌చ్చే వైబ్రేష‌న్‌లు అన్నింటినీ ఆఫ్ చేయాలి. దీంతో బ్యాట‌రీ బ్యాక‌ప్ కొంత వ‌ర‌కు పెరుగుతుంది.

2. సాధ్య‌మైనంత వ‌ర‌కు బ్లాక్ క‌ల‌ర్ ఉన్న వాల్‌పేప‌ర్ల‌నే సెట్ చేసుకోండి. ఎందుకంటే ఆ వాల్‌పేప‌ర్లు త‌క్కువ బ్యాట‌రీని వాడుకుంటాయి. అదే క‌ల‌ర్‌ఫుల్ వాల్‌పేప‌ర్లు అయితే బ్యాట‌రీని ఎక్కువ‌గా వాడుకుంటాయి.

3. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే జీపీఎస్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచ‌వ‌ద్దు. ఎందుకంటే జీపీఎస్ ఆన్‌లో ఉంటే బ్యాట‌రీ ఎక్కువ‌గా వినియోగం అవుతుంది. అవ‌స‌రం అనుకుంటేనే దాన్ని ఆన్ చేయండి.

4. మీ ఫోన్‌కు చెందిన ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోండి. ఆయా కంపెనీలు తాము విడుద‌ల చేసే ఫోన్ మోడ‌ల్స్‌కు అప్‌డేట్స్‌ను ఇస్తుంటాయి. వాటిని వేసుకుంటే బ్యాట‌రీ స‌మ‌స్య‌లు పోతాయి. దీంతో బ్యాక‌ప్ పెరుగుతుంది.

5. స్మార్ట్‌ఫోన్‌లో అవ‌స‌రం అనుకున్న‌ప్పుడ మొబైల్ డేటాను ఆన్ చేసి ఉంచండి. లేదంటే ఎక్కువ బ్యాట‌రీ వినియోగం అవుతుంది. అలాగే ఫోన్‌ను కొద్ది సేపు వాడం అని అనుకున్న‌ట్ట‌యితే ఎరోప్లేన్ మోడ్‌లో పెట్టండి. దీని వ‌ల్ల బ్యాట‌రీ చాలా వ‌ర‌కు పెరుగుతుంది.

6. ఫోన్ లో హోం స్క్రీన్ పై వాతావ‌ర‌ణం, మ్యాప్స్‌, మ్యూజిక్‌, గ్యాల‌రీ వంటి ర‌క ర‌కాల విడ్జెట్ల‌ను చాలా మంది పెడ‌తారు. కానీ వాటి వ‌ల్ల బ్యాట‌రీ బాగా వృథా అవుతుంది. క‌నుక ఆయా విడ్జెట్ల‌ను తీసేస్తే బ్యాట‌రీ బ్యాక‌ప్ పెరుగుతుంది.

7. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఆటోమేటిక్ సింక్ ఆప్ష‌న్‌ను డిజేబుల్ చేయాలి. అవ‌స‌రం అనుకున్న‌ప్పుడే ఆన్ చేయాలి. దీని వ‌ల్ల బ్యాట‌రీని ఆదా చేసుకోవ‌చ్చు.

8. ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ అంత క‌న్నా త‌క్కువ వెర్ష‌న్ ఉన్న ఫోన్ల‌ను వాడేవారు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలోకు అప్‌గ్రేడ్ అవ్వాలి. ఎందుకంటే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో దాని త‌రువాత వ‌చ్చిన ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌ల‌లో డోజ్ మోడ్ అనే ఫీచ‌ర్ ల‌భిస్తోంది. దీంతో ఏం జ‌రుగుతుందంటే.. యూజ‌ర్ ఎక్కువ సేపు ఫోన్‌ను వాడ‌కుండా ఉంటే ఆటోమేటిక్‌గా బ్యాట‌రీ ఆదా అవుతుంది. ఈ ఫీచ‌ర్ ఉన్నందునే అలా జ‌రుగుతుంది క‌నుక‌, యూజ‌ర్లు త‌మ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటే బెట‌ర్‌.

9. స్మార్ట్‌ఫోన్‌లో కేవ‌లం జీపీఎస్ మాత్ర‌మే కాదు, బ్లూటూత్‌, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ వంటి సెన్సార్లు ఏవి ఉన్నా ఆఫ్ చేయాలి. అవ‌స‌రం అనుకున్న‌ప్పుడే ఆన్ చేసి వాడుకోవాలి. దీంతో చాలా వ‌ర‌కు బ్యాట‌రీ ప‌వ‌ర్ పెరుగుతుంది.

10. ఆండ్రాయిడ్ ఫోన్‌లో Apps > Settings > Google Services > Search & Now > Voice > Click on ‘OK Google detection’ > Turn off ‘Always on అనే ఫీచ‌ర్‌ను ట‌ర్న్ ఆఫ్ చేస్తే బ్యాట‌రీ ఎక్కువ స‌మ‌యం పాటు వ‌స్తుంది. బ్యాక‌ప్ పెరుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top