బాలికా విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా యూపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదోతరగతి పాస్ అయిన ప్రతి బాలికకూ రూ.10వేలు బహుమతిగా అందివ్వనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని యూపీ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి దినేష్శర్మ వెల్లడించారు. ఇప్పటికే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఫలితాలు వెలువడగా.. త్వరలో యూపీ బోర్డు పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఉన్న కన్య విద్యాదాన్ యోజన తరహాలోనే ఈ పథకం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
2016 యునెస్కో లెక్కల ప్రకారం ఇండియాలో 4 కోట్ల 70 లక్షల మంది విద్యార్థులు స్కూల్ ను మధ్యలోనే మానేస్తున్నారు. పదవ తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు డ్రాప్ అవుతున్నారు. అమ్మాయిల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. 77 శాతం మంది టెన్త్ వరకు వస్తే… 52 శాతం మంది మాత్రమే…ఇంటర్ లో జాయిన్ అవుతున్నారు.!
ఈ డ్రాప్ అవుట్ సంఖ్య ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా ఉంది( బీహర్, రాజస్థాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి). అందుకే ఆ సమస్యను అదిగమించడానికి యోగీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. బేటీ బచావో – బేటీ పడావో..అనే నినాదాన్ని నిజం చేసేందుకు సంకల్పించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిద్దాం.