జీవితంలో ఇంకేం లేదు, అంతా అయిపోయింది, సూసైడ్ చేసుకోవాలి, అని భావించే వారు ఇవి చ‌ద‌వండి..!

మ‌నం అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌రిగితే దాన్ని జీవితం అని ఎందుకంటారు చెప్పండి. ఒక్కోసారి మ‌నం అనుకోని ఘ‌ట‌నలు కూడా జ‌రుగుతుంటాయి. వాటికి మ‌నం ఎంతో కొంత బాధ‌ప‌డ‌తాం. విచారిస్తాం. కానీ కొన్ని ఘ‌ట‌న‌లు మాత్రం కోలుకోలేని దెబ్బ తీస్తాయి. దీంతో చాలా మంది తీవ్రమైన మాన‌సిక ఒత్తిడికి లోన‌వుతుంటారు. ఎప్పుడూ కోల్పోయిన భావ‌న‌లో ఉంటారు. త‌మ ప‌ని ఇక అయిపోయింద‌ని, అన్ని విధాలుగా జీవితంలో ఫెయిల్ అయ్యామ‌ని, ఇక జీవితాన్ని అంతం చేసుకోవ‌డ‌మే మిగిలి ఉంద‌ని భావిస్తూ అదే కోవ‌లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డతారు. అయితే అది క‌రెక్ట్ కాదు. ఆ చ‌ర్య స‌మ‌స్యలకు ప‌రిష్కారం చూప‌దు. మ‌రి ఏం చేయాలి..? అలాంటి తీవ్ర‌మైన మాన‌సిక ఒత్తిడి ఎదుర్కొంటున్న స్థితిలో ఎలా ఉండాలి..? అంటే.. అందుకు ఇదిగో ప‌రిష్కారం. ఈ సూచ‌న‌లు పాటించి చూడండి చాలు, మీ మాన‌సిక వేద‌న దూరం కాక‌పోతే చెప్పండి..!

1. మీరు ఎంత పాజిటివ్‌గా ఉన్న‌ప్ప‌టికీ, ఆత్మ‌విశ్వాసంతో ఉన్నా మీ మైండ్‌లో ఉన్న ఓ చిన్న నెగెటివ్ ఆలోచ‌న మిమ్మ‌ల్ని లొంగ‌దీసుకుంటుంది. త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఆడిస్తుంది. క‌నుక ముందు ఆ ఆలోచ‌న‌కు ముగింపు ప‌ల‌కండి. ఆ ఆలోచ‌న‌కు ఫుల్ స్టాప్ పెట్టండి. అది ఇచ్చే సూచ‌న‌ల‌ను అస్స‌లు విన‌కండి. మిమ్మ‌ల్ని మీరు మీ హృద‌యం చెప్పిన‌ట్టు న‌డుచుకోండి.

2. స‌మ‌స్య ఏది వ‌చ్చినా దాన్నుంచి దూరంగా పారిపోకూడ‌దు. అలాగే ఆత్మ‌హ‌త్య చేసుకోకూడ‌దు. అది పిరికి వారి చ‌ర్య‌. స‌మ‌స్య‌తో పోరాడాలి. క‌చ్చితంగా విజ‌యం మీదే అవుతుంది. స‌మ‌స్య‌ను చూసి భ‌య‌ప‌డితే అది మిమ్మ‌ల్ని ఇంకా ఆడిస్తుంది. క‌నుక దాని మాట విన‌కండి. మీరు చేసేది మీరు చేయండి. క‌చ్చితంగా గెలుపు మిమ్మ‌ల్ని వ‌రిస్తుంది. స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది.

3. మీకు వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను చూసి ఇత‌రుల‌ను నిందించకండి. ఇత‌రుల వ‌ల్లే ఆ స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని వారిని దూషించ‌కండి. అలాగే ప‌రిస్థితుల‌ను కూడా ఏమీ అన‌కండి. వాటి ప్ర‌భావం ఏమీ ఉండ‌దు.

4. మీ స‌మ‌స్య‌ను మీ స్నేహితుల‌కు చెప్పుకోండి. దీంతో స‌గం బాధ త‌ప్పుతుంది. కానీ దాన్ని అలాగే మ‌న‌స్సులో పెట్టుకుంటే అది మిమ్మ‌ల్ని పురుగులా తొలిచేస్తుంది. దీంతో మీరు ఇంకా తీవ్ర‌మైన మాన‌సిక ఒత్తిడికి లోన‌వుతారు.

5. కష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వ్య‌క్తుల జీవిత గాథ‌ల‌ను చ‌ద‌వండి. అలాంటి సినిమాల‌ను చూడండి. పుస్త‌కాల‌ను చ‌ద‌వండి. దీంతో మీకు ప్రేర‌ణ క‌లుగుతుంది. మీ స‌మ‌స్య‌ను మీరే ప‌రిష్క‌రించుకోగ‌ల‌రు అనే కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుంది.

6. మెడిటేష‌న్ ఎక్కువ‌గా చేయండి. దీంతో మీ మైండ్‌లో ఉన్న ఆందోళ‌న‌, ఒత్తిడి మ‌టుమాయం అవుతాయి. ప్ర‌తి రోజూ చేస్తే రోజూ కొత్త ఉత్సాహం వ‌స్తుంది. మాన‌సిక స‌మస్య‌లు పోతాయి.

7. స‌మ‌స్య వ‌చ్చిందంటే వెంట‌నే దాన్ని ప‌రిష్క‌రించాల‌ని చూసినా ఒక్కోసారి అది ఆల‌స్య‌మ‌వ‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ ప‌ట్టు వ‌ద‌ల‌కండి. ఎన్ని రోజులు అయినా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌నే న‌మ్మ‌కాన్ని ఉంచండి. అనంత‌రం కృషి చేయండి. క‌చ్చితంగా విజ‌యం సాధిస్తారు.

8. మీకు ఉన్న వ్య‌క్తిగ‌త హాబీల‌ను ఫాలో అవ్వండి. పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, సినిమాలు చూడ‌డం, పాట‌లు విన‌డం, క్రికెట్ చూడ‌డం, ఆట‌లు ఆడ‌డం, తోట ప‌ని చేయ‌డం, వెకేష‌న్‌కు వెళ్ల‌డం వంటి ప‌నులు చేస్తే బాగా రిలాక్స్ ఫీల్ అవుతారు. మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

9. ప‌రిష్క‌రించ‌డానికి సుల‌భ‌మైన స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించండి. అదే క‌ష్ట‌సాధ్య‌మైన స‌మ‌స్య‌ల‌ను ఆల‌స్యంగా ప‌రిష్క‌రించుకోండి.

10. ఏ స‌మ‌స్య‌కైనా క‌చ్చితంగా ప‌రిష్కారం ఉంటుంద‌నే ఆలోచ‌నను క‌లిగి ఉండండి. అది మీకు కొండంత ఆత్మ‌విశ్వాసాన్ని ఇస్తుంది. అలాగే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేట‌ప్పుడు జీవితం నేర్పించే పాఠాల‌ను నేర్చుకోండి. అవి మీకు భ‌విష్య‌త్తులో కొత్త స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు వాటిని ఎలా ప‌రిష్కరించాలో చెబుతాయి.

Comments

comments

Share this post

scroll to top