ఈ ప‌నులను మీరు నిత్యం పొర‌పాటుగా చేస్తున్నార‌ని మీకు తెలుసా..?

నిత్య జీవితంలో మ‌నం ఎన్నో ప‌నులు చేస్తుంటాం. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి ప‌డుకునే వ‌ర‌కు ఎన్నో ర‌కాల పనుల‌ను మ‌నం చేస్తాం. అయితే వాటిలో కొన్నింటిని మాత్రం మ‌నం ఎప్ప‌టికీ త‌ప్పుగానే చేస్తుంటాం. ఎందుకంటే స‌రిగ్గా ఎలా చేయాలో అంత‌గా కొంద‌రికి అవ‌గాహ‌న ఉండ‌దు క‌దా, అలాంట‌ప్పుడు తాము చేసేదే క‌రెక్ట్ అనుకుంటారు. మ‌రి అలా త‌ప్పుగా చేసే ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. హెడ్‌ఫోన్స్
చిత్రంలో చూశారు క‌దా. హెడ్‌ఫోన్స్‌ను ఎప్పుడూ చెవి మీదుగా వ‌చ్చేలా ధ‌రించాలి. ఇదే క‌రెక్ట్ అయిన ప‌ద్ధ‌తి. కానీ కొంద‌రు ముందు ఇచ్చిన విధంగా త‌ప్పుగా పెట్టుకుంటారు. అది క‌రెక్ట్ కాదు.

2. బ‌ర్గ‌ర్
బ‌ర్గ‌ర్‌ను ఎప్పుడూ ముందు, వెనుక రెండు వేళ్ల‌ను ప‌ట్టుకుని చిత్రంలో చూపిన‌ట్టుగా తినాలి. లేదంటే అందులో ఉండే ప‌దార్థం బ‌య‌ట‌కు వ‌స్తుంది.

3. హెయిర్‌పిన్స్
హెయిర్‌పిన్స్‌ను గ‌రుకుగా ఉన్న ప్రాంతం కింద‌కు వ‌చ్చేలా వాడాలి. పైకి వ‌చ్చేలా వాడ‌కూడ‌దు.

4. వైన్ గ్లాస్
వైన్ గ్లాస్‌ను ఎప్పుడూ కింది భాగంలో మాత్ర‌మే ప‌ట్టుకోవాలి. పై భాగంతో కాదు.

5. గుంజీలు
వ్యాయామంలో భాగంగా గుంజీలు తీసే వారు బాగా ముందుకు వంగ‌కూడ‌దు. చాలా త‌క్కువ వంగుతూ గుంజీలు తీయాలి.

6. బ్యాక్ ప్యాక్
బ్యాక్‌ప్యాక్‌ను ఎప్పుడూ వెన‌క్కి వంగేలా త‌గిలించుకోకూడ‌దు. శ‌రీరానికి స్టిఫ్‌గా అతుక్కుని ఉండేలా త‌గిలించుకోవాలి.

7. పిజ్జా
పిజ్జాను చేతి ముని వేళ్ల‌తో కాకుండా పూర్తి వేళ్ల‌తో ప‌ట్టుకుని తినాలి.

8. పెన్ను
చాలా మంది పెన్నుల‌ను చిత్ర విచిత్ర‌మైన భంగిమ‌ల్లో ప‌ట్టుకుని రాస్తారు. అలా కాదు. చిత్రంలో ఇచ్చిన విధంగా పెన్నును ప‌ట్టుకుని రాయాలి.

9. ప్యాంటు
చిత్రంలో ఇచ్చిన విధంగా ప్యాంటును మ‌డ‌త పెడితే అది ఎందులోనైనా స‌రిగ్గా ఫిట్ అవుతుంది.

10. బ్యాండ్ ఎయిడ్
చిత్రంలో ఇచ్చిన విధంగా బ్యాండ్ ఎయిడ్‌ను రెండు వైపులా మ‌ధ్య‌లోకి చీల్చి క‌ట్ చేయాలి. అనంత‌రం గాయంపై బ్యాండ్ ఎయిడ్‌ను ఉంచి క‌ట్ చేసిన పీస్‌ల‌ను అటు, ఇటు అతికిస్తే దాంతో బ్యాండ్ ఎయిడ్ స‌రిగ్గా అతుక్కుంటుంది.

Comments

comments

Share this post

scroll to top