“అర్జున్ రెడ్డి” సినిమా చూసి మనం నేర్చుకోవాల్సిన 10 విషయాలు ఇవే..! 4 వ ది చాలా ముఖ్యమైంది.! ఎందుకంటే?

Written by: Sainath Gopi

బూతులు, ముద్దులే కాదు “అర్జున్ రెడ్డి” సినిమా నుండి మనం నేర్చుకోవాల్సిన నీతులు కూడా ఎన్నో ఉన్నాయి. ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎంతో మంది ఆదరణను పొందింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయిపొయింది. ఈ సినిమా చూసి అర్జున్ రెడ్డి లా ఆటిట్యూడ్ చూపిస్తా అనే ఫ్యూలిష్ ఆలోచనను పక్కన పెట్టి. ఈ సినిమా నుండు మనం నేర్చుకోవాల్సిన ఈ విషయాలు చూడండి!

#1. పర్సనల్ గా ప్రాబ్లెమ్ వచ్చింది అని కెరీర్ ఎప్పటికి వదులుకోకు. అసలే ఈ మధ్య లవ్ ఫెయిల్ అయ్యిందని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి సూసైడ్ చేసుకునే వారు ఎక్కువైపోయారు. సినిమా లో ప్రీతి వదిలేసినా కూడా అర్జున్ రెడ్డి బెస్ట్ డాక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు.

#2. సినిమా స్టార్టింగ్ లో కాలేజీ పరువు గురించి ఆలోచించకుండా తనలా తాను ఉంటాడు. మనకి ఒక కూడా ఆటిట్యూడ్ ఉంటుంది. అది మనల్ని జీవితంలో ముందుకి తీసుకెళ్లేది అని మనకు అనిపిస్తే ఎవరెన్ని చెప్పిన వదులుకోవద్దు.

#3. సినిమాలో ప్రీతి పెళ్లి జరుగుతున్నప్పుడు అర్జున్ రెడ్డి ఆపలేని స్టేజి లో ఉంటాడు. దానికి కారణం మొర్ఫిన్ తీసుకోవడం. కానీ మనం అలా చేయకూడదు. మనల్ని ప్రేమించే వారిని వదులుకోవాలి అన్న ఆలోచన కూడా రానివ్వద్దు.

#4. “శివ” లాంటి ఫ్రెండ్ దొరకడం చాల కష్టం. సంతోషంలోనే కాదు బాధల్లో తోడుండే అలాంటి ఫ్రెండ్ ని ఎప్పటికి వదులుకోవద్దు.

#5. శివ తో అర్జున్ రెడ్డి వైఫ్ పీరియడ్స్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడతాడు. మనమేమో అదేదో బూతులాగా చూస్తాము. మన ఆలోచన మంచిది అయినప్పుడు అది బూతు అవ్వదు. ధైర్యంగా మాట్లాడు. మంచోడు అని పేరు తెచ్చుకొని ఏం సాధించడానికి?

#6. అర్జున్ నానమ్మ “సఫర్ అవ్వనివ్వు” అంటారు. ఎందుకంటే ఎదుటోడిని బాధ పడకు అని చెప్పగలము కానీ బాధను పంచుకోలేము. నొప్పి తనది కాబట్టి.

#7. అర్జున్ నానమ్మ చనిపోయినప్పుడు అర్జున్ ఆమె ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తారు. అలా చేస్తే ఆత్మ ప్రశాంతంగా వెళ్ళిపోతుంది.

#8. అర్జున్ కి ప్రీతి ప్రేగ్నన్ట్ గా ఉన్నప్పుడు కనిపిస్తుంది. కడుపులో పెరుగుతుంది వేరొకరి బిడ్డ అయినా నా బిడ్డగా పెరుగుతుంది అని చెప్తాడు. నిజంగా ప్రేమించడం అంటే అది. చివరికి అది తన బిడ్డే అని తెలుస్తుంది.

#9. ఆపరేషన్ అర్జెంటు అంటే తన పరిస్థితి బాలేకున్న వెళ్తాడు. తర్వాత “డాక్టర్” చదివేటప్పుడు చేసిన ప్రామిస్ గుర్తుతెచ్చుకుంటాడు. నాకు నా లైఫ్ లో నచ్చింది కెరీర్ ఒక్కటే అంటాడు.

#10. ప్రీతికి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని తీసుకెళ్తాడు. ప్రతి సరి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అనుకుంటాము. కానీ డాక్టర్ ప్రొఫెషన్ గొప్పతనం చెప్తాడు. ఇంకోసారి టాపిక్ గురించి వచ్చినప్పుడు అప్పటికి ఆ అమ్మాయితో తనకి రిలేషన్ లేదు కాబట్టి ఇబ్బంది పడి వెళ్లిపోతాడు.

Comments

comments

Share this post

scroll to top