పదేళ్ల చిన్నారిని తల్లిని చేసిన ఉగ్రవాదులు.. కోరిక తీరాక వేరొకరికి విక్రయం ఇరాక్ లో దారుణం!!

మనుషులు పశువుల్లా మారిపోతున్నారు. కాదు కాదు పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇరాక్ లో జరిగిన ఓ దారుణ ఘటన యావత్తు ప్రపంచాన్నే సిగ్గుపడేలా చేస్తుంది. అభం శుభం తెలియని పదేళ్ల బాలికపై వంద మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డారు ఇస్లామిక్ ఉగ్రవాదులు. పదేళ్ల పసిపాప అని చూడకుండా ప్రతి రోజు అత్యాచారం చేసేవారు. ఫలితంగా తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన బాలిక తానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది.

ఇరాక్ లో యాజిది తెగకు చెందిన పురుషులను ఉగ్రవాదులు మూకుమ్మడిగా చంపేస్తున్నారు. ఆడవాళ్ళని మాత్రం బంధించి లైంగిక కోరికలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు. వారి లైంగిక కోరికలు తీర్చుకోవడానికి 10 నుంచి 20 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలను తమ దగ్గర ఉంచుకుంటారు సీనియర్ ఉగ్రవాదులు. వారిపై అత్యాచారం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. అత్యాచారానికి పాల్పడటమే కాకా తర్వాత ఇతరులకు విక్రయిస్తున్నారు.

ఉగ్రవాదుల చెర నుంచి యాజిదిలకు అక్కడ స్థానికంగా ఓ ఎన్జీవో ఆశ్రయం కల్పిస్తుంది. అయితే బాలిక మేనత్త ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకొని ఎన్జీవో చెంతకు చేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈమె కూడా ఉగ్రవాదుల చెరలో సెక్స్ బానిసగా పనిచేసింది, చిత్రవధ అనుభవించింది.

ఇద్దరు పిల్లలున్న ఈమెని కుటుంబంతో సహా ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆమెని సెక్స్ బానిసగా మార్చి ఆమె పిల్లల్ని అమ్మేశారు. ఇరాన్ లోని సింజార్ ప్రాంతంలో వీరిని ఉంచేవారంట. సరిగా తిండి పెట్టకుండా.. చిత్ర హింసలకు గురిచేసేవారట. ఆకలి తట్టుకోలేక జంతువులు విసర్జించిన పేడ తినేవాళ్ళంట. తన మేనకొడలిని పదేళ్ల పాప అని చూడకుండా ఆమెపై రోజు అఘాయిత్యం చేసేవారని, కోరిక తీరగానే సంతలో పశువుల్లగా అమ్మేసేవారని బోరున విలపిస్తూ చెప్పింది. గర్భం దాల్చిన తన మేనకోడలు ఎక్కడుందో తెలియదని వాపోయింది.

Comments

comments

Share this post

scroll to top