పది రూపాయల నాణెం గురించి ఈ విషయం తెలిస్తే షాకవుతారు..!

పెద్ద నోట్ల రద్దు అనంతరం.. పది రూపాయల నాణాలు చెల్లవంటూ పుకార్లు చెలరేగాయి. సోషల్‌ మీడియాలో పూర్తిస్థాయిలో దుష్ప్రచారం చేస్తూ పది నాణాలు కలిగిన పౌరులలో ఆందోళన రేకెత్తించారు. దీంతో బస్తాల కొద్దీ పది రూపాయల నాణాలు విఫణిలోకి వచ్చేశాయి. బంగారు వర్ణంతో మెరిసి పోయే నాణాల పట్ల మక్కువతో పలువురు బస్తాల కొద్దీ (రిజర్వ్‌ బ్యాంకు విడుదల చేసిన రూ.20 వేలు విలువ కలిగిన నాణాల బస్తా) నిల్వ చేసేశారు. పుకార్లు రావడంతో ఇవ్వన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చేశాయి. చిల్లర కొరత తీరిందని, వర్తకులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. అయితే నాణాలు చెల్లవనే పుకారు కాస్తా అంటువ్యాధిలా మారి పది రూపా యల నాణెం చూస్తేనే అసహ్యించుకునే పరిస్థితికి పౌరులు వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ నేరుగా ప్రకటనలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. పది రూపాయల నాణాలు చెల్లుబాటు అవుతాయని, బ్యాంకులలోనూ, విఫణి లోనూ నాణాలు తీసుకోవడానికి నిరాకరిస్తే సంబంధిత వ్యక్తులను, సంస్థలను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ గట్టిగానే హెచ్చరిం చింది. అయినప్పటికీ పౌరులలో మార్పు రాలేదు. పది రూపాయల నాణాల బెడద చివరకు బ్యాంకులకు చుట్టుకుంది. బస్తాల కొద్దీ కాకున్నా కొద్దికొద్దిగా తెన్తే ఖాతాదారుల నుంచి బ్యాంకులు జమలు తీసుకోవడం ప్రారంభించాయి.


మరలా వాటిని బయటికి పంపడం పెద్ద కష్టంగా మారి పది నాణాలు బ్యాంకులకు గుది బండగా మిగిలాయి. జిల్లాలోని బ్యాంకులలో సుమారు రూ.20 కోట్లు విలువ చేసే పది రూపా యల నాణాల నిల్వలు పేరుకుపోయాయి. పాలకొల్లు లో ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌లోనే సుమారు రూ.2 కోట్లు విలువైన పది రూపాయల నాణాలు ఉన్నట్టు సమాచారం. ఈ నాణాల బస్తాలతో బ్యాంకులలోని ఛెస్ట్‌లు నిండిపోతున్నాయని, ఏం చేయాలో తెలియ డం లేదని, బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటు న్నారు. బ్యాంకులలో రూ.పది నాణాల నిల్వలు పెరిగిపోవడంపై ఆర్‌బీఐ అసహనం వ్యక్తం చేసింది. ఒక వైపు నగదు కొరతతో ఇబ్బందులు పడుతుంటే నాణాలను బ్యాంకు చెస్ట్‌లలో పెట్టుకుని పూజించ డంపై ఆర్‌బీఐ అధికారులు వివిధ బ్యాంకులకు తాఖీదులిస్తున్నారు. నగదు ఉపసంహరణ సమయంలో ఖాతాదారులకు కొద్దికొద్దిగా నాణాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.


గతంలో సంక్షేమ పింఛన్లకు నాణాలు ఖర్చు చేశారు. అయితే వృద్ధులు, వికలాంగులు పది రూపాయల నాణాలతో ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు రావడంతో పింఛన్ల పంపిణీకి పదిరూపాయల నాణాల విడుదల నిలుపు దల చేశారు. తాజాగా విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే పింఛన్లలో నెలనెలా కొంత మొత్తం రూ.పది నాణాలు ఇస్తే మెరుగ్గా ఉండటమే కాకుండా, పెన్షన్లు తీసుకునే వారందరూ విద్యావంతులు కావడంతో నాణాల చెలా మణి విషయంలో అపోహలకు పోకుండా అర్థం చేసు కుంటారని బ్యాంకు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల్లో పనిచేసి రిటైరైన ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నెలనెలా ఇచ్చే పింఛన్లు రూ.కోట్లలో ఉంటుంది.

ఒక పాలకొల్లు పురపాలక సంఘంలోనే విశ్రాంత ఉద్యోగులకు నెలకు సుమారు రూ.50లక్షలు అవసరం అవుతాయి. ఈ దామాషాగా జిల్లాలో సుమారు రూ.20కోట్ల పైబడి పింఛన్లకు ఖర్చు అవుతాయి. ఇవికాకుండా సంక్షేమ పింఛన్లు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల నిమిత్తం సుమారు రూ.40 కోట్లు అవసరమవు తాయి. ఈ మొత్తం పింఛన్లలో పది శాతం చొప్పున నాణాలు ఇచ్చినా బ్యాంకులలో పేరుకుపోయిన రూ.పది నాణాల నిల్వలు తగ్గుతాయని బ్యాంకు అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం.

Comments

comments

Share this post

scroll to top