“పీఎస్వీ గరుడవేగ” ఎందుకు చూడాలి అనుకుంటున్నారా.? అయితే ఈ 10 కారణాలు తెలుసుకోండి..!

విజేతగా నిలబడినప్పుడు ఆ వ్యక్తి  చుట్టూ పది మందుంటారు..అదే ఒకసారి పరాజయం పాలైతే  చాలు పలకరించడానికి కూడా ఒక మనిషి ఉండడు..సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కథలు కోకొల్లలు..ప్రతి సినిమా రిలీజ్ రోజు సినిమావారికొక సవాల్.సినిమా గురించి ఎంతమంది క్రిటిక్స్ ఎన్ని రకాల స్పందనలు తెలియచేసిన ప్రేక్షకుడిదే ఫైనల్ డెసిషన్.సినిమా హిట్టా ఫట్టా అని నిర్ణయించేది ప్రేక్షకుడు మాత్రమే.. పది ప్లాపుల తర్వాత వచ్చే ఒక హిట్ చాలు ఒక హీరో పవర్ చూపడానికి..ఒక హిట్ సినిమా చాలు డైరెక్టర్ దగ్గరకు నిర్మాతలను,హీరో దగ్గరకి డైరెక్టర్లను క్యూలో నిలబెట్టడానికి… ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ,సోషల్ మీడియా అంతా ఒకటే టాక్..గరుడ వేగ…గరుడ వేగ..గరుడ వేగ…

కొన్నేళ్లుగా విజయం రుచి చూడని హీరో..ఎన్నో ఒడిదుడుకుల మధ్య ,అటు మాతృవియోగం,ఇటు వృత్తి పరమైన వైఫల్యాలతో సతమతమవుతుంటే ఆరోగ్యం క్షీణించడం..జీవితం అంటే ఇంత దరిద్రంగా ఉంటుందా అని జీవితంపైనే విరక్తి వచ్చే టైంలో చేసే ప్రయత్నం ..ఫలితం విజయాన్ని ఇస్తే ఆ సంతోషానికి,ఆనందానికి అంతుండదు..ప్రస్తుతం రాజశేఖర్ పరిస్థితి అదే..ఇంతమంది ఇంత గొప్పగా చెప్పడానికి ఇంతకి ఆ సినిమాలో ఏముంది…

  • ఇంతమంది హీరోలు అప్పటికి ఇప్పటికీ వారి ఆహార్యంలో ఎంతో మార్పు..కానీ రాజశేఖర్ మాత్రం అప్పటి అంకుశం,మగాడు సినిమాలో ఎలా ఉన్నారో..ఇప్పటి గరుడవేగ లో కూడా అలాగే ఉన్నారు..ఆహార్యంలోనే కాదు,అభినయంలో కూడా..ఏం ఛేజింగ్లు,ఏం ఫైటింగులు ఎక్కడా కూడా బోర్ రాదంటే నమ్మండి..

  • ఇప్పటివరకూ మన తెలుగు సినిమాల్లో బైక్ ఛేజింగ్ సీన్లు చాలానే వచ్చాయి..ఈ సినిమా స్టార్టింగ్లో బైక్ చేజింగ్ సీన్ ఉంటుంది…అబ్బబ్బ ఏమన్నా ఉందా..పెద్ద స్క్రీన్ పైన చూస్తే ఆ కిక్కే వేరప్పా..
  • రాజశేఖర్ ..యాంగ్రీ యంగ్ మాన్ ఏ కాదు..అతనిలో నచ్చేది స్మైల్ కూడా..ప్రతి సినిమాలో క్లోజప్ యాడ్ లా తన పళ్లు కనపడేలా స్మైలీ ఫేస్ ఉంటుంది..బట్ ఈ సినిమాలో అది ఎక్కడ కనపడదు.

  • కెమెరా పనితనం ,స్క్రీన్ ఫ్లే ని ఇష్టపడే వాళ్లకి అలాంటి కరెక్ట్ సీన్ ఒకటి పడితే చాలు పండుగ చేసుకుంటారు..ఈ సినిమాలో రిజర్వాయర్ లోకి NIA టీం దిగి ,అక్కడ యాక్షన్ సీన్స్ లో కెమెరా,స్క్రీన్ ప్లే చూస్తే పిచ్చెక్కిపోతుంది.
  • ఫ్యామిలి..ప్రతి ఒక్కరికి వృత్తి పరమైన జీవితం,వ్యక్తి గత జీవితం మధ్య ఏదో ఒక ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.ఈ సినిమాలో చంద్రశేఖర్ (రాజశేఖర్) కి ఆ పరిస్థితి ఎదురై విడాకుల వరకూ దారి తీస్తుంది.ఆ సీన్లో రాజశేఖర్ యాక్షన్ పీక్స్…
  • యాక్షన్ సీన్స్ కి హాలివుడ్ పెట్టింది పేరు..మన దగ్గర ఇప్పటివరకూ యాక్షన్ సీన్స్ ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి కానీ గ్రాఫిక్స్ సహాయంతో..కానీ ఈ సినిమాలో గ్రాఫిక్స్ సహాయం లేకుండా తీసిన యాక్షన్  సీన్స్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
  • సినిమాలో హీరో పై పెట్టిన కాన్సన్ట్రేషన్ విలన్ పై పెట్టే దర్శకులు చాలా తక్కువ..కానీ ఈ సినిమా దర్శకుడు ఆ పొరపాటు చేయలేదు..విలన్ జార్జిగా నటించిన కిశోర్ ని చాలా బాగా చూపించాడు.అంతేకాదు హీరోని డామినేట్ చేసే సూపర్బ్ డైలాగ్స్ విలన్ కి ఉండడం విశేషం.

  • ఈ సినిమాకి బిజిఎమ్ చాలా చాలా ప్లస్ అయింది.ఎక్కడ ఎలా వాయించాలో అలాగే వాయించారు..అతిగా వాయించి మన చెవుల్లోంచి రక్తం తెప్పించలేదు సరికదా..హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ లో బిజిఎమ్ ఆసమ్ అసలు..
  • తెలుగు సినిమా మూస ధోరణి ఆరు పాటలు,మూడు ఫైట్లు అనే కాన్సెప్ట్ కి తెరవేసి..అనవసరమైన పాటలను మధ్యమధ్యలో ఇరికించలేదు..కాకపోతే తలలు పగిలిపోయేంత టెన్షన్లో ఉన్న టైంలో,ఆ తర్వాత వచ్చే  పాటలో మాత్రం సన్నిలియోన్ కనపడడం చాలా రిలీఫ్.

  • లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ప్రవీణ్ సత్తారు..తన పేరులో ఉన్న సత్తాని చాటాడు..నిజంగా రాజశేఖర్ ని ప్రవీణ్ నమ్మాడు,ప్రవీణ్ లోని డైరెక్షన్ సత్తాని రాజశేఖర్ నమ్మాడు..అందుకే ఈ గరుడవేగ ఇప్పుడు సూపర్ హిట్ అయింది.లేకపోతే ఏ హిట్ లేని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఆ డైరెక్టర్ కి,ఇప్పటివరకూ ఒక కమర్షియల్ హిట్ లేని డైరెక్టర్ తో సినిమా చేయాలని ఆ హీరోకి అనిపించడం ఏంటండి..మన తెలుగు సినిమా చరిత్రలో ఇలా జరగడం చాలా అరుదు..దిస్ ఈజ్ ప్రవీణ్ సత్తారు మిషన్..దట్స్ ఆల్…

ఫైనల్ గా చెప్పేదేంటంటే యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్లే కాదు..ఇప్పటివరకూ ఫ్యామిలితో సినిమాలు చూడలేకపోతున్నాం అనుకునే వాళ్లు..సినిమాని అమితంగా ఇష్టపడే వాళ్లు..రాజశేఖర్ అభిమానులే కాదు అందరూ హ్యాపీగా వెళ్లి సినిమా చూసేయొచ్చు.

Comments

comments

Share this post

scroll to top